Others

అమరశిల్పి జక్కన్న (నాకు నచ్చిన చిత్రం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1964లో విడుదలైన రంగుల శిల్పకావ్యం. మహాశిల్పి జక్కన్న జీవితంలోని ఘట్టాలను ఆధారం చేసుకుని చిత్రాన్ని రమణీయంగా తీర్చిదిద్దారు నిర్మాత, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బిఎన్ రంగా. కెకె శేఖర్ కళాదర్శకత్వంలో వేసిన సెట్టింగులు సినిమాకి నిండుదనాన్ని చేకూర్చాయి. సి నారాయణరెడ్డి, సముద్రాల, దాశరథి, కొసరాజు రాసిన గీతాలకు సాలూరు రాజేశ్వరరావు అందించిన మధురమైన సంగీతంలో -ఈ నల్లని రాళ్ళలో, నిలువుమా, అందాల బొమ్మతో ఆటాడవా, మధురమైన జీవితాల, ఏదో గిలిగింత వంటి గీతాలు ఘంటశాల, సుశీల మధుర గాత్రాలలో జాలువారి నేటికీ అలరిస్తున్నాయి. హీరాలాల్‌తో సహా నలుగురు నృత్యదర్శకులు అందించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ. జక్కన్న మంజరి అనే నృత్యకళాకారిణిని ప్రేమించి వివాహం చేసుకుని శిల్పకళా ప్రావీణ్యంతో శిల్పాలు చెక్కుతూ జీవిస్తుంటాడు. మంజరిపై మోహంతో మండల ప్రభువు గోపదేవుడు మంజరి తల్లి కుట్ర పన్నుతాడు. ఆ క్రమంలో జక్కన్న గర్భవతి అయిన భార్యను అపార్థం చేసుకుని వదిలి వెళ్లిపోతాడు. గోపదేవుడి మోసం గ్రహించిన మంజరి అక్కడినుండి తప్పించుకొని వెళ్లి ఢంకన్న అనే పుత్రుణ్ణి కని తన బంధువులకు అప్పగించి, మహారాణి శాంతాదేవి అంతఃపురంలో నివశిస్తూంటుంది. బేలూరులో విష్ణువర్థన మహారాజు నిర్మిస్తున్న వైష్ణవ ఆలయంలో శిల్పాలు చెక్కుతున్న జక్కన్నను చూసి అతనికి తెలియకుండా అతడి బాగోగుల చూస్తుంటుంది. జక్కన్న తండ్రి మల్లన్న వద్దకు చేరుకున్న ఢంకన్న శిల్పకళలో ప్రావీణ్యం సంపాదించి బేలూరు చేరుకుని అక్కడ ప్రధాన విగ్రహంలో లోపముందని నిరూపించగా పందెంలో భాగంగా జక్కన్న చేయి వేళ్ళను నరుక్కోగా, శ్రీరామానుజాచార్యుల సహాయంతో అపార్థాలు తొలగించుకొని మంజరి, కొడుకు ఢంకన్న సహాయంతో మొండి చేయితోనే ప్రధాన విగ్రహాన్ని పూర్తిచేసి దైవకృపతో తిరిగి చేతిని పొందుతాడు జక్కన్న. ఏఎన్‌ఆర్, సరోజాదేవి, హరనాథ్, ధూళిపాళ, సూర్యకాంతం ప్రధాన తారాగణంగా ప్రతివారూ తమ పాత్రలను రక్తి కట్టించారు. నృత్యకళాకారిణిగా బి.సరోజాదేవి తన అందం, నృత్యం, అభినయంతో అలరించింది. తెలుగువారిని బాగా ఆకట్టుకున్న భక్తిరస చారిత్రాత్మక చిత్రం.

-ఎస్.ఎస్.ఎస్, విశాఖపట్నం