Others

పరభాషా తారలు (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాకు పరభాషా నటీమణులు పరిచయం కావటం అనాదిగా జరుగుతున్నదే. అయితే అలనాడు పరిచయమైన నటీమణులు అంకితభావంతో నటించారు. తిరువాన్కూరు సిస్టర్స్‌గా పేరొందిన లలిత, పద్మిని, రాగిణి నర్తకీమణులుగా తెలుగు చిత్రాలకు పరిచయమై ఎనలేని కీర్తిని ఆర్జించారు. ప్రారంభ దశలో లైలామజ్ను, బీదలపాట్లు, తిరుగుబాటు మొదలైన చిత్రాలలో లలిత, పద్మిని నృత్యతారలుగా నటించి అలరించారు. ఇక దేవదాసు చిత్రంలో చంద్రముఖి పాత్రలో లలిత నటన అపూర్వం. ఈ పాత్రకి మూడు సూపర్‌హిట్ పాటలున్నాయంటే మామూలు విషయం కాదు. ఇక పద్మిని తెలుగులో ఎన్‌టిఆర్ సరసన విజయగౌరి, అమ్మలక్కలు, సంపూర్ణ రామాయణం చిత్రాలలోనూ, అక్కినేని సరసన ‘వసంతసేన’ చిత్రంలోనూ నటించి ఆ తర్వాత రాజ్‌కపూర్ సరసన ‘జిస్ దేశ్‌మే గంగా బెహతీహై’ చిత్రం ద్వారా జాతీయస్థాయికి ఎదిగి పలు హిందీ చిత్రాల్లో నటించింది. లలిత, పద్మినిలాగా మూడో సోదరి రాగిణి కూడా నృత్యతారగా సంతోషం, గంగా గౌరీ సంవాదం, మాంగల్యబలం మొదలైన చిత్రాల్లో నృత్యాలు చేసింది. ఈ ముగ్గురు నృత్యకళాకారిణుల వారసురాలిగా వారి మేనకోడలు శోభన హీరోయిన్‌గా రాజేంద్రప్రసాద్ సరసన ఏప్రిల్ 1 విడుదల, మోహన్‌బాబు సరసన అల్లుడుగారు చిత్రాలతోపాటు మరికొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించింది. శోభన వారసురాలు ఎవరో ఎదురుచూడాలిక!

-పర్చా శరత్‌కుమార్, 9849601717