నల్గొండ

త్వరలోనే మినీ ట్యాంకుబండ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని సద్దలచెర్వు కట్టపై చేపడుతున్న మినీ ట్యాంకుబండ్ నిర్మాణ పనులను త్వరలోనే పూర్తిచేయించేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సద్దలచెర్వుపై చేపట్టిన నిర్మాణ పనులను భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.15.06కోట్ల నిధులతో రాష్ట్రానికే తలమానికంగా మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పట్టణ వాసులకు ఆహ్లాదం పంచేలా మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు చెర్వుకు అవతలి వైపున జాతీయ రహదారి పక్కన ఏరినా పార్క్‌ను నిర్మించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వర్షాల కారణంగా కొంతమేర పనులు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. మిగిలిన పనులను సత్వరమే పూర్తిచేయించేలా చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా మినీ ట్యాంకుబండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, పోలబోయిన నర్సయ్య, గండూరి కృపాకర్, తూడి నర్సింహారావు, టిఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు.

మట్టి గణేషా.. మొక్క గణేషా
ప్రారంభించిన ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ దిశగా జలకాలుష్యం నివారణకు, పర్యావరణ పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ వినూత్నంగా చేపట్టిన మట్టి గణేషా మొక్క గణేషా కార్యక్రమాన్ని ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి సోమవారం ప్రారంభించి మట్టి హరిత గణేష విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. వర్మికంపోస్టు, మట్టితో కూడిన చిన్న పూలకుండిలో మొక్క విత్తనం, మట్టి వినాయక ప్రతిమను అమర్చి ప్రజలకు రూ.120 ఒకటి చొప్పున అందిస్తున్నారు. నవరాత్రుల వ్యవధిలో అందులోని విత్తనం మొలకెత్తుతుందని దానిని ఇంట్లో, లేదా ఆరుబయట పెట్టి పోషించుకోవచ్చన్నారు. వినాయకుడిని నిమజ్జనంకు తరలింవచ్చని ఎస్పీ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత హారం వ్యాప్తికి ఈ రకమైన కార్యక్రమాన్ని ప్రొత్సహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ హరిత గణేష విగ్రహాలు ఎస్పీ కార్యాలయం ముందు విక్రయిస్తారన్నారు. సిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు
జిల్లా కేంద్రంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆకస్మిక తనిఖీలు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ: పారిశుద్ధ్యం విధుల నిర్వాహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రం నల్లగొండ మున్సిపాల్టీలోని వివిధ వార్డుల్లో కలెక్టర్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో పారిశుద్ధ్యం నిర్వాహణ, చెత్త కుప్పల తరలింపు, మురికి కాలువల్లో చెత్త తొలగింపులను వారు పరిశీలించారు. సదరు వార్డుల్లో పారిశుద్ధ్యం విధులు నిర్వహించే మున్సిపల్ ఉద్యోగులను, పారిశుద్ధ్యం సిబ్బందిని విధుల నిర్వాహణలో సమస్యలు అడిగి తెలుసుకుని, రిజిస్ట్రర్‌లో వారి పనితీరును, హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు. దోమలు ప్రబలి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విస్తరిస్తాయని వాటి నివారణకు ముందస్తుతగా పారిశుద్ధ్యం చర్యలు పక్కాగా నిర్వహించి వీధుల్లో చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు తరలించాలని, మురికి కాలువల్లో మురికి నీరు, వరద నీరు ప్రవాహం ఆగకుండా చూడాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి రాజ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

బాలికల పాఠశాల ప్రార్థనలో ఒకే ఒక్కరూ..
* సమయానికి రాని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు
నడిగూడెం: రాష్టస్థ్రాయిలో తెలంగాణకు హరితహారంలో హరితమిత్ర అవార్డుకు ఎంపికైన మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారు. అవార్డులతో ఆదర్శంగా నడవాల్సిన పాఠశాలలో సోమవారం ప్రార్థన సమయంలో పిఈటి మినహా ప్రధానోపాధ్యాయులతో సహా, ఇతర ఉపాధ్యాయులేవరూ హాజరుకాకపోడం శోచనీయం. పిఈటీ ఒక్కరే పిల్లలతో ప్రార్థన చేయించారు. ప్రార్థన పూర్తయి పిల్లలు తరగతి గదుల్లోకి వెళ్లిన తరువాత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రావడం జరిగింది. ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటామని ఎంఈవో సభలో చెప్పారు. మరుసటి రోజే మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు హాజరుకాకపోడం గమనార్హం. మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ తీరు ఏలా ఉందోనని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైన వెంటనే చర్యలు తీసుకుని పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

పిఏపల్లి ఆర్‌ఐ సస్పెండ్
నల్లగొండ టౌన్: విధి నిర్వాహణలో అవకతవకలకు పాల్పడుతున్న ఆరోపణలపై విచారణ జరిపి పెద్దఅడిశర్లపల్లి ఆర్‌ఐ ఎం.నవీన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌ఐ అక్రమాలపై కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించిన కలెక్టర్ నవీన్‌ను సస్పెండ్ చేశారు.

పంట పొలాల మధ్య రసాయన వ్యర్థాలు
గుండాల: మండలంలోని వెల్మజాల గ్రామ శివారు పంట పొలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలు గల 57 డ్రమ్ములను గుట్టుచప్పుడు కాకుండా పడవేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని గ్రామస్థులు అధికారులకు అందించగా, సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం నిఘా పెట్టడంతో రసాయన కంపెనీలకు చెందిన వ్యక్తులు మారుమూల ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. వెల్మజాల గ్రామం పారిశ్రామిక ప్రాంతాలకు దూరంగా ఉండటంతో కావాలనే మారుమూల ప్రదేశాలను ఎంచుకొని వదిలి వెళ్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పడవేసిన రసాయన వ్యర్థాల వల్ల సమీప ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతున్నట్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పురేందర్‌భట్ తెలిపారు.

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
గుండాల: కన్నతండ్రి మందలించాడన్న నెపంతో క్షణికావేశంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మరిపడిగ గ్రామానికి చెందిన కొండెబోయిన సోమయ్య తన కుమారుడు యాసన్న (24)ను చెడు తిరుగుడు మానివేసి చదువుకోవాలని మందలించి వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, కుమారుడు యాసన్న మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న యాసన్నను 108 వాహనం ద్వారా జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి కొండెబోయిన లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పురేందర్‌భట్ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
తిప్పర్తి: మండల పరిధిలోని శేషమ్మగూడెం శివారులో గుర్తు తెలియని వ్యక్తి (45)ని చంపి మృతదేహాన్ని కాల్చిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. నల్లగొండ ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, డిఎస్పీ సుధాకర్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి కాలిన మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించి ఆనవాళ్లు ఏమి లభ్యం కాలేదు. ఎక్కడో హత్య చేసి ఇక్కడికి మృతదేహాన్ని తీసుకవచ్చి టైర్లు వేసి తగుల పెట్టారు. దీనిపై తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.