నల్గొండ

మట్టి వినాయకులే విఘ్నేశ్వరునికి ప్రీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: విఘ్నాలబారిన పడకుండా ఉండేందుకు మట్టి వినాయకుని విగ్రహాలనే పూజించాలని, మట్టి విగ్రహాలే గణనాథునికి ప్రీతిపాత్రమైనవని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విగ్రహాలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత కొనే్నళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అంశంపై ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పర్యావరణ చర్చలో వినాయక చవితి పర్వదినం చేరడం బాధకరమైన విషయమన్నారు. ప్రకృతిని పరిరక్షించుకుంటూ వయో పరిమితిని పెంపొందించుకోవాల్సి ఉండగా అందుకు విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ నిర్విర్యమైపోతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి మెలిసి జీవించేందుకు పండుగలు దోహదపడుతున్నాయన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదన్నారు. అదే సమయంలో రసాయనాలతో తయారుచేసిన వినాయకుని విగ్రహాలతో వాతావరణం కాలుష్యమవుతుందన్న ప్రమాదాన్ని ప్రజలు గమనించడం లేదన్నారు. తెలంగాణలో ఆది నుండి జరుపుకునే గ్రామదేవతల పండుగలన్ని పకృతిని కాపాడుకునేందుకేనని అందులో భాగమైన వినాయక చవితిని మాత్రం రసాయనాల వినియోగంతో మలినం చేస్తుండటం తగదన్నారు. మొక్కలు నాటడమే ప్రకృతిని పరిరక్షించడం కాదని, పర్యావరణాన్ని కాపాడడం కూడా ప్రకృతి ధర్మమేనన్నారు. సూర్యాపేట జిల్లాలో మూడేళ్లుగా మట్టి వినాయకుల ప్రతిమల ఏర్పాటును ప్రొత్సహిస్తున్నామన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి వినాయకులను వినియోగించడంలో జిల్లా తెలంగాణ జిల్లాలన్నింటికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ జనహిత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 10వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నేపుణ్యాలను వెలికితీసెందుకు మట్టి వినాయకుల తయారీ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.