నల్గొండ

గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో ఆలేరు చిరకాల స్వప్నం సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టితో వెయ్యి కోట్లతో యాదాద్రి క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి అన్నారు. అలాగే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్‌లతో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని మయూరి పంక్షన్ మాలులో టిఆర్‌ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ సునితారెడ్డి మాట్లాడుతూ కరవు కాటకాలు, ఫ్లోరోసిస్‌తోఅల్లాడుతున్న అలేరు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలోనే చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రంగా, పాడిపంటలతో సస్యశ్యామలం చేసేందుకు ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం బెస్ట్ అగ్రికల్చరల్ అవార్డు పొందిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం ప్రజలు భారీ ఎత్తున కెసిఆర్‌ను సన్మానించాలని తనకు మొమోరండంను అందించారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేసి నియోజకవర్గంలో సన్మానానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్డా చైర్మన్ పిచ్చిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదిగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలె సుమలత, ఎంపిపి గడ్డమీది స్వప్న, జడ్పీటిసిలు ఎంపిపిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.