నల్గొండ

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్: అంతర్ జిల్లా దొంగను సూర్యాపేట పోలీసులు అరెస్ట్‌చేసి అతని వద్ద నుండి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక డిఎస్పీ వి.సునీతమోహన్ తెలిపారు. సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా కరీంనగర్ పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెందిన ఠాగూర్ భరత్‌సింగ్‌గా గుర్తించడం జరిగిందని, అతను గత కొద్దికాలంగా పట్టణంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పారు. నిందితుడు కృష్ణానగర్‌లోని రెండు ఇళ్లులలో గత జూలై నెలలో చోరీలకు పాల్పడి ఆరున్నర తులాల బంగారు నగలు, పది తులాల వెండి చోరీ చేసి వాటిని హైదరాబాద్‌లోని తిలక్‌నగర్ మణపురం బ్రాంచ్‌లో తాకట్టు పెట్టాడన్నారు. అదేవిధంగా బాలాజీనగర్‌లో మరో రెండు ఇళ్లలో చోరీలు చేసి బంగారం, నగదు, బుల్లెట్ వాహనాన్ని దొంగిలించినట్లు చెప్పారు. బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించాడన్నారు. నిందితునితో వెళ్లి 75గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 10తులాల వెండి, 5వేల నగదు, బుల్లెట్ వాహనాన్ని స్వాధీనపర్చుకుని, నింధితున్ని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో సిఐ మొగిలయ్య, ఎస్‌ఐ డానియల్, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.