వరంగల్

ఆయన లారీలో సరుకులేస్తే అటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం: అతనో లారీ డ్రైవర్.. ఆ సంపాదనతో ఓ లారీ కొన్నాడు.. అప్పటి వరకు మంచిగా ఉన్న ఆయన మదిలో ఏం దుర్బుద్ధిపుట్టిందో ఏమో.. ఆయన లారీలో సరుకులేసి పలానా చోటికి పంపాలని ఇస్తే... వాటిని గమ్యం చేర్చకుండా దారిమళ్లించి అడ్డదారిలో అమ్ముకోవడం మొదలెట్టాడు. ఇందుకు అడ్డుపడితే ఓ క్లినర్‌ను సైతం అందమొందించాడు. ఆ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన తరువాత కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా మరోసారి లారీలో రవాణా చేయడానికి ఇచ్చిన 31 టన్నుల మొక్కజొన్నలను గమ్యం చేర్చకుండా దారి మళ్లించి కేసముద్రంలో విక్రయించేందుకు యత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపితే దొంగ డ్రైవర్ బాగోతమంత బయటపడింది. మహబూబాబాద్ డిఎస్పీ రాజమహేందర్ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణంలోని ఏటి ఆగ్రహారం, రాంరెడ్డి నగర్‌కు చెందిన అన్నవరపు భాస్కర్‌రావు అనే డ్రైవర్ తన సొంత లారీ ఎపి7టి హెచ్1816 ద్వారా సరుకులను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఏలూరు నుంచి అశ్వరావుపేటకు 31 టన్నుల మొక్కజొన్నలను రవాణా చేయడానికి లోడ్ చేసుకున్నాడు. అయితే లారీ ఆ సమయంలో లారీ ఒరిజనల్ నెంబర్ కాకుండా ఎపి16టివి4593 వేసుకొని తప్పుడు రికార్డులు చూపి తన పేరును కూడా మార్చి సుబ్బారావుగా చెప్పి లారీ కిరాయి 18వేల రూపాయలకు మాట్లాడుకొని గమ్యస్థానం కాకుండా మరో చోటికి తరలించేందుకు యత్నించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు తీసుకురాగా లారీ గమ్యస్థానం చేరలేదనే విషయాన్ని తెలుసుకున్న ఎగుమతిదారు లారీ ఆచూకీ కోసం గుమాస్తాను పంపగా తొర్రూర్‌లో లారీని కనిపెట్టి తిరిగి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి యత్నిస్తుండగా గుమస్తా మూత్రవిసర్జకు దిగగా లారీని స్టార్ట్ చేసి కేసముద్రం తీసుకువచ్చాడు. ఇక్కడ మొక్కజొన్నలను విక్రయించేందుకు యత్నిస్తుండగా అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తన బృందంతో వెళ్లి పట్టుకున్నాడన్నారు. ఈ ఘటనపై మొక్కజొన్నలు ఎగుమతి చేసిన కూచం మల్లిఖార్జునరావు ఫిర్యాదు చేయడంతో లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి లారీతో పాటు మొక్కజొన్నలను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ తెలిపారు. కాగా ఇదే డ్రైవర్ భాస్కర్‌రావు గత కొద్ది మాసాల క్రితం ఇలాంటి ఘటనకు పాల్పడి సరుకులను అక్రమంగా అమ్ముకోగా వాటాల పంపకంలో తొర్రూర్ వద్ద క్లీనర్‌తో గొడవపడి హత్యచేసిన ఘటనలో నిందితుడన్నారు. మరో ఘటనకు పాల్పడ్డ భాస్కర్‌రావుపై కఠిణ చర్యలు తీసుకునే విధంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. లారీని పట్టుకున్న ఎస్‌ఐ, పోలీసులను డిఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ లింగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.