మహబూబ్‌నగర్

నిబంధన సడలించాలంటూ వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నచింతకుంట: కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల గృహాల మంజూరుకుగాను కఠినమైన నిబందనలు విధించిందని ఇట్టి నిబంధనను సడలించాలని రాష్ట్ర లేబర్ కమిషనర్ భీమేశ్వర్‌రావుకు ప్రగతిశీల బీడీ వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. బీడి కార్మికులకు గృహాల వ్యయం రూ.లక్ష 50 వేలు సరిపోవని రూ.5లక్షలు ఇంటి నిర్మాణం చేపట్టేలా కేంద్రప్రభుత్వం మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నారు. ఇసి, పొజిషన్ దృవపత్రం, గృహం లేదని తహశీల్దార్ అందజేసే దృవపత్రం, గ్రామం లేదా మున్సిపల్ అనుమతి పత్రం, ఖాళీ స్థలం సర్వే నెంబర్‌ను నిబంధనను తొలగించాలని అదేవిధంగా ఎస్సి, ఎస్టి వికలాంగులకు ప్రత్యేకంగా అధిక నిర్మాణం వ్యయాన్ని మంజూరు చేయాలని, కుల ధృవపత్రాన్ని నిబంధన నుంచి తొలగించాలని, బీడీ కార్మికుడి ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటే పునర్నిర్మాణం కల్పించేందుకు ఆర్‌ఐఎస్‌హెచ్‌ఎస్ మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నారు. కఠినమైన నిబందనలను వెంటనే తొలగించాలని కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కార్యక్రమంలో నాయకులు సూర్యం, దేవదానం, అరుణ్‌కుమార్, వెంకటన్న, వనపర్తి జిల్లా అధ్యక్షులు చింతలన్న, సాంబశివుడు ఉన్నారు.
మరిన్ని సేవల కోసమే అధికారులకు శిక్షణ
* కలెక్టర్ శ్రీ్ధర్
నాగర్‌కర్నూల్: జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వ అధికారులకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు కలెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ అధికారులకు మూడు రోజుల ఇ-లర్నింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా అధికారులు, 15 అంశాలపై శిక్షణ పొంది లక్ష్య నిర్దేశ్యం, కాల పరిమితి, ప్రామాణికం, నిర్దేశిత లక్ష్యం, వ్యక్తగత, సంస్థగత విలువలు, సమస్యల పరిష్కారం, కారణాల విశే్లషణ, నిర్వాహణ అవరోధాలు, సమర్థవంతంగా విధుల నిర్వహణ, ప్రాధాన్యత క్రమాలు, బావోద్వేగ మేధస్సు, విజ్ఞానం, ఒత్తిడి నిర్వాహణ, నాయకత్వ లక్షణాలు, రికార్డుల నిర్వహణ, ఆర్థిక నియమాలు, నియంత్రణ తదితర అంశాలను ఆన్‌లైన్ ద్వారా నేర్చుకునేందుకు 20 గంటల పాటు ప్రాక్టిస్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకుగాను శిక్షణ పొందుతున్న వారికి యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఇవ్వడం జరుగుతుందని, వీటి ద్వారా ఆన్‌లైన్ ద్వారా 60 రోజులలో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత వీరికి ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా దృవపత్రాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ శిక్షణకు ఆరు రాష్ట్రాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, అందులో తెలంగాణ కూడా ఉందన్నారు. శిక్షణ పొందిన అధికారులు ప్రతిరోజు వేర్వేరు విభాగాలలో వారు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆన్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఇందులో ఇచ్చిన శిక్షణను చాలా విషయాలు తెలిసి ఉన్నప్పటికి మరోసారి ఒత్తిడి జయంతి సమయ పాలన పాటించడానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి తిరిగి పునఃశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఎంత తెలిసినా ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయనే విషయాన్ని గ్రహిస్తే మరింత జ్ఞానాన్ని పెంపొందించుకునేందకు వీలువుతుందన్నారు. ఉద్యోగపరంగా విజయవంతమైతేనే తమ విధులను సంపూర్ణంగా నెరవేర్చినవారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి సురేందర్ కరణ్, సిపివో జగన్నాథం, డిఎఫ్‌వో జోజి, వ్యవసాయాధికారి సింగారెడ్డితోపాటు జిల్లా స్థాయి అధికారులు, రెండోస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
* అధికారులతో జెసి సురేందర్ కరణ్
నాగర్‌కర్నూల్: ప్రజావాణిలో ప్రజలనుంచి వివిధ సమస్యలపై వచ్చిన వినతులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జెసి సురేందర్ కరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో మధుసూధన్‌నాయక్‌తో కలిసి ఆయన 91 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు చెందిన అధికారుతో ఆయా సమస్యలపై చర్చించి నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. మండల పరిధిలో ఉన్న వాటికి సంబందించి నేరుగా ఆయా శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా మండల స్థాయిలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల హాజరును పరిశీలించి, వివిధ సమస్యలపై అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణి హాల్‌లో అధికారులనుద్దేశించి జెసి మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులకు సత్వరంగా పరిష్కరించాలని, సమయానికి మించి పెండింగ్‌లో సరైన పద్దతి కాదన్నారు. మండల పత్యేకాధికారులు నిర్ణయిత సమయానికి మండలాలలో ప్రజావాణికి హాజరై ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే అధికారుల హాజరును అదేరోజు జిల్లా కలెక్టర్‌కు నివేదించాలన్నారు. కార్యక్రమం డిఆర్వో మధుసూధన్‌నాయక్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కేంద్రపథకాలపై ప్రచారం అవసరం
* బేటి బచావో బేటి పడావో రాష్ట్ర చైర్‌పర్సన్
కొత్తకోట: కేంద్ర పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించే బాద్యత ప్రతి కార్యకర్తపై ఉందని బేటి బచావో బేటి పడావో రాష్ట్ర చైర్‌పర్సన్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భిణులకు కేంద్రం నిధుల ద్వారా ప్రసవం అనంతరం రూ.6వేలు అందిస్తుందని, దానికి తోడుగా మరో రూ.6వేలు కలుపుకొని కెసిఆర్ ఇస్తూ తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నారన్నారు. సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సి సెల్ నాయకురాలు రజినిరెడ్డి, నేతలు వెంకట్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, రాంమోహన్‌రెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, బుడ్డన్న , తదితరులు పాల్గొన్నారు.
ఎఇపై మండిపడ్డ సభ్యులు
* మండల సమావేశంలో వాగ్వాదం
కొత్తకోట: మూడునెలలైనా ఏ గ్రామంలో కూడా విద్యుత్ సమస్యను తీర్చ డం లేదని, అందుకు విద్యుత్ ఎఇ రామకృష్ణపై సభ్యులు మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గుంత వౌనిక అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఇ ప్రభుత్వం నుండి అందిస్తున్న ఉచిత విద్యుత్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్న నిధులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గ్రామాల్లో మూడు నెలలు దాటిన సమస్య పరిష్కారం కావడం లేదని సభ్యులు నాగేష్, మాసన్నతో పాటు ఆయనపై మండిపడ్డారు. గ్రామాల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, లోఓల్టేజీ సమస్యతో ఇండ్లలోనే విద్యుత్ వైర్లు, టివిలు, ఫ్యాన్లు కాలిపోతున్నాయని సభా దృష్టికి తీసుకొచ్చారు. అంతక ముందు వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కొత్తకోటకు ఎడిఎ కార్యాలయం మంజూరైందని త్వరలోనే కార్యాలయాన్ని ప్రారంభించుకోనున్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆదివారం నర్సింగాపురంలో పాముకాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారని, అందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని సభకు రాని వైద్యాధికారులుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా, అంతటితో సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీరిని అదుపు చేయడానికి సర్పంచు చెన్నకేశవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సురేంద్రనాథ్ రెడ్డి సమన్వయం చేశారు. వార్డులకు అనుగుణంగా రేషన్ షాపులను కేటాయించాలని వారు సభకు వివరించారు. కొత్తకోట మండలంలో మరుగుదొడ్లు కట్టుకున్న వారికి రూ.2.65 కోట్లు మంజూరు అయినట్లు ఎంపిడిఓ సుదర్శన్ తెలిపారు. గతంలో కట్టుకున్న వారికి బిల్లులు రాలేదని వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. కొందరు బోనాఫైడ్ లేక షాదిముబారక్, కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయలేకపోతున్నారని వారి పరిస్థితి ఎలా అని తహశీల్దార్ సమాధానం చెప్పాలన్నారు. పామాపురం గ్రామానికి 20వేల మొక్కలు ఇస్తే ఇప్పటి వరకు 500 మొక్కలు కూడా బతకలేదన్నారు. మొక్కలను సంరక్షించేందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మాగనూర్: క్రిష్ణ మండల పరిధిలోని నల్లగట్టు దగ్గర గల సత్యసాయి వాటర్ పంప్‌హౌజ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంఘటనలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక నుండి తిరివార్ గ్రామానికి చెందిన కిరణ్(30) కెఎ36ఇడి9995 నంబర్ గల ద్విచక్రవాహనంపై మక్తల్ వైపు వెళ్తుండగా మక్తల్ నుండి రాయిచూర్ వైపు వేళ్తున్న టిఎస్12యుబి1845నంబర్ గల డిసిఎం ద్విచక్రవాహనాన్ని ఢికొనడంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సై రామకృష్ణ తెలిపారు.
చిన్నారులకు ఎమ్మార్ టీకాలు తప్పనిసరి
* జిల్లా విద్యాధికారి వేణుగోపాల్
గద్వాలటౌన్: ప్రాణాంతరకమైన రూబెల్లా, తట్టు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించడానికి ఎమ్మార్ టీకాలు తప్పకుండా వేయించాలని జిల్లా విద్యాధికారి వేణుగోపాల్ అన్నారు. సోమవారం గద్వాల పట్టణంలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లోనిర్వహించిన రుబెల్లా, తట్టు వ్యాధుల నివారణకు టీకాల వేయు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ వ్యాధులు సోకకుండా ఎమ్మార్ టీకాలు తప్పకుండా వేయించాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో విద్యార్థులకు తట్టు, రుబెలా వ్యాధులు రాకుండా ఆరోగ్య సిబ్బందిచే ఈ టీకాలు తప్పకుండా వేయించాలని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులకు టీకాలు వేయు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైధ్యులు డాక్టర్ శశికళ, పాఠశాల కరస్పాండెంట్ శ్రీధర్, హెచ్‌ఇఓ నాగరాజు శెట్టి, వైద్యసిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
‘ఎమ్మెల్సీని విమర్శించడం తగదు’
వెల్దండ : కల్వకుర్తి నియోజకవర్గ అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటు పడుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని మాడ్గుల ఎంపిపి జైపాల్‌నాయక్ విమర్శించడం ఎంత మాత్రం తగదని వెల్దండ సింగిల్‌విండో చైర్మన్ ద్యాప మోహన్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి యెన్నం భూపతిరెడ్డి,జడ్పీటిసి తనయుడు సంజీవ్‌కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కల్వకుర్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే లోటును తీరుస్తు కల్వకుర్తి తాలుకా అభివృద్ధికి నిర్విర్యమంగా కృషి చేస్తున్న ఎమ్మెల్సీపై సొంత పార్టీ ఎంపిపి తన స్థాయిని మరిచి ఆరోపణలు చేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎంపిటిసి జయప్రకాష్, టిఅర్‌ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, భీమయ్యగౌడ్, అంజయ్య, తానేష్‌యాదవ్ పాల్గొన్నారు.
జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి
* జాతీయ కార్యవర్గ సభ్యుడు యాదగిరి
కొత్తకోట: విద్యార్థి దశలోనే విద్యార్థులు జాతీయ భావాలను కలిగి ఉండాలని ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు యాదగిరి అన్నారు. మండల కేంద్రంలోని సాక తిమ్మప్ప డిగ్రీ కళాశాలలో నిర్వహించిన శిక్షణ తరగతులో ఆయన మాట్లాడుతూ ఎబివిపి జాతీయ పునర్నిర్మాణమే ద్యేయంగా పని చేస్తుందని, కళాశాల క్యాంపస్‌లోనే జాతీయ వాదాన్ని పెంపోదించడమే ద్యేయంగా ఎబివిపి కమిటీలతో పని చేయాలని అన్నారు. కళాశాలలను జాతీయ విద్యార్థుల అడ్డాగా మార్చుకోవాలని, ఎబివిపి ఏర్పడినప్పటి నుండి ఎన్నో ఉద్యమాలు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా ఆనేక విద్యారంగ సమస్యలు, సామాజిక సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందన్నారు. నేడు కళాశాలలోకి విచ్చన కారమైన భక్తులు కమ్యూనిస్టులు ప్రవేశిస్తూ విద్యార్థుల మధ్యే వైశ్యామ్యాలు రెచ్చగొడుతున్నారని కావున కళాశాల క్యాంపస్‌లోలోకి విచ్చన్నకరమైన శక్తులను అడుగు పెట్టనివ్వొద్దని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.