విశాఖ

వచ్చే ఎన్నికల్లో టిడిపి, వైకాపాలకు బుద్దిచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్): అగ్రిగోల్డ్ సంస్థలో తాము పొదుపు చేసిన డబ్బులు ఇప్పంచి తమను ఆదుకోవాలని లక్షలాధి మంది బాధితులు ఇటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నా ఏటువంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరుపార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఎజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్వర్యంలో ఈనెల 16 నుండి సెప్టెంబర్ 15 వరకు ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు నిర్వహిస్తున్న చైతన్యయాత్ర సోమవారం అనకాపల్లి చేరుకుంది. అనకాపల్లి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్వర్యంలో చైతన్యయాత్రకు స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద స్వాగతం పలికి అక్కడ నుండి బైక్ ర్యాలీగా నెహ్రూచౌక్ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సిఎం చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవడం లేదని ఆయన అరోపించారు. సంస్థకు చెందిన ఆస్తులను స్వాదీనం చేసుకొని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి స్పందన కానరాకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యయాత్ర చేస్తున్నామన్నారు. గడిచిన మూడు సంవత్సరాలు నుండి పోరాటం చేస్తే వైఎస్ జగన్ ఏనాడైనా స్పందించి మద్దతు తెలిపారా అని ఆయన ప్రశ్నించారు. 2019ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన 3నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తారని నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి సంఘం అధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడిన విప్లవ గీతాలు పలువురను ఆకట్టుకున్నారు. అనకాపల్లి బాధితుల సంఘం అధ్యక్షుడు కరణం మాణిక్యాలరావుఅధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు బి విశ్వనాధరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, నిర్వాహక అధ్యక్షుడు ఇవి నాయుడు, మహిళా కార్యదర్శి నాగలక్ష్మి, గౌరవ అధ్యక్షులు వైఎవ్ బద్రం, కోన లక్ష్మన అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.