కృష్ణ

రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ప్రపంచ ప్రఖ్యాత రాజధానుల్లో మేటి రాజధానిగా నిర్మిస్తున్న అమరావతిలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం కేదారేశ్వరపేటలోని అమరావతి అభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ప్రస్తుతం నిర్మిస్తున్న 10 రహదారులకు వౌలిక వసతులను సమకూర్చి ప్రజా రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. 50 మీటర్ల నిడివి గల దాదాపు 12 సబ్ అర్టీరియల్ రహదారులకు కూడా తక్షణమే టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇబ్రహీంపట్నంలో రాజధాని స్టార్టప్ ప్రాంతం వరకూ కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి కూడా టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విధివిధానాలను చర్చించిన మంత్రి నారాయణ విజయవాడ - అమరావతి నగరాల్లో భవిష్యత్తు ట్రాఫిక్‌ను అంచనావేసి ట్రాఫిక్ నియంత్రణకు గాను ఇన్నర్ రోడ్ల నిర్మాణానికి కూడా సన్నద్ధం కావాలన్నారు. రాజధాని నిర్మించే ప్రతి రహదారి ఇన్నర్ రోడ్డుకు కనెక్ట్ చేయాలని, ఎక్కువ వంపులు లేకుండా నిటారుగా ఉండే రహదారుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రజా రాజధానిగా పిలువబడే అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎన్‌టి రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఆర్కిటెక్ట్ నిపుణుల గురించి ఏడిసి అధికారులకు సూచనలిచ్చిన మంత్రి నారాయణ శాఖమూరులో ఏర్పాటుచేయనున్న వినోద ఉద్యానవనంపై చర్చించారు. ఎడిసి సిఎండి లక్ష్మీపార్థసారథి మాట్లాడుతూ రాజధానిలో వౌలిక వినియోగాల ఏర్పాటుకు గాను మంగళవారమే టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు, అలాగే శాఖమూరు వినోద ఉద్యానవనంపై కూడా నిపుణలతో సమీక్షిస్తున్నట్టు వివరించారు. సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.