ప్రకాశం

2022 విజన్ లక్ష్యంగా ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : ప్రధానమంత్రి మోదీ ఆశించిన నూతన భారత నిర్మాణానికి అందరూ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందని, విజన్ 2022 సాకారం దిశగా అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖమంత్రి సుజనాచౌదరి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎవన్ కన్వన్షన్ హాలులో 2022 నాటికి నూతన భారత నిర్మాణానికి తీసుకోనున్న సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని భారతప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయనసూచించారు. భారతప్రధానమంత్రి ఆశించిన నూతన భారత నిర్మాణానికి అందరూ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజన్ ఉండి కార్యాచరణ ప్రణాళిక లేకపోతే ఏమి సాధించలేమని తెలుపుతూ ప్రణాళికతోపాటు విజన్ ఉండాలని, అభివృద్ధి చెందాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రకాలుగాసద్వినియోగపర్చుకోవాలని సూచించారు. కేంద్రప్రభుత్వం నీతిఅయోగ్ కింద దేశంలో వంద వెనుకబడిన జిల్లాలను పరిగణలోకి తీసుకుని జిల్లాలను అభివృద్ధి చేసే విధంగా చర్యలుతీసుకుందని అందులో ప్రకాశం జిల్లా మొదటి స్ధానంలో ఉందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది ద్వారానే దేశాభివృద్ధి సాధ్యవౌతుందన్నారు. జిల్లాలో వెనుకబడిన గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని అందులోభాగంగా గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. కేంద్రప్రభుత్వం అందరికి గృహాలు, సరైన ఆరోగ్యం వౌలిక వసతులు, మాతాశిశుమరణాలు తగ్గించాలి, పౌష్టిక ఆహార లోపాలను తగ్గించాలని నిర్ణయించిందన్నారు. యువత వలసలు వెళ్లకుండా జిల్లాలోనే అన్ని రకాల విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఉపాధి పొందేందుకు కావాల్సిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ 1942 ఆగస్టు 9వతేదీన మహత్మాగాంధీదేశ స్వాతంత్య్రం కోసం క్విట్ ఇండియా ఉద్యమాన్ని జరిపి ఇప్పటికే 75సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ ధృడసంకల్పం, పట్టుదల,స్ఫూర్తితో సంకల్పం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీపిలుపుతో రాబోయే ఐదేళ్లలో 2017-2022 వరకు జిల్లాలో, మండలాల్లో గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి సంకల్పం చేట్టాల్సిఉందన్నారు. రాబోయే ఐదుసంవత్సరాలు అత్యంత కీలకమైనవిగా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో కరవుపరిస్ధితులను ఎదుర్కొనేందుకు, వ్యవసాయంలోని ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు, సాగు, తాగునీటికి ప్రణాళికలు రూపొందించాలని సంకల్పం చేపట్టడటం జరిగిందన్నారు. ఆ సంకల్పంతో రాబోయే ఐదుసంవత్సరాల్లో మరిన్ని పంటకుంటలు, నీరు -ప్రగతి కింద చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైనవన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు గుండ్లకమ్మ రిజర్వాయరు, కొరిశపాడు ఎత్తిపోతల పధకాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వచ్చేనెలలో ప్రారంభిస్తామన్నారు. వెలుగొండప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులు ప్రారంభమయ్యాయని వర్క్ ఆర్డర్ ఇచ్చి కాంట్రాక్టురు చేత పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 22వేల హెక్టార్లల్లో ఉద్యానవనశాఖపంటలు వేయాలని నిర్ధేశించటం జరిగిందని ప్రధానమంత్రి కృషి సంచాయియోజన పథకం ద్వారా ఉద్యానవన పంటలు వేయటం జరిగిందన్నారు. ఉన్న నీటిని సక్రమంగా నిర్వహణలోకి తీసుకుని ఎక్కువుగా ఉద్యానవనపంటలు వేసుకునేందుకు ప్రోత్సహించటం జరిగిందన్నారు. నేల సారవంతమైన వాటిని గుర్తించి సూక్ష్మపోషకాలు ఎంత అవసరం తెలుసుకుని సమతుల్యత పాటించి ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను ఉద్యానవనపంటలవైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. నూరుశాతం సబ్సిడీ సూక్ష్మప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో వౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. జిల్లాలో 750 కిలోమీటర్ల సిసి రోడ్లను వేసేందుకు పరిపాలన ఆమోదం ఇచ్చామన్నారు. ప్రతిగ్రామంలో మంచినీటి సమస్య లేకుండా ఉండాలని కచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. ప్రతిగ్రామంలో డ్రైన్స్, పాఠశాలలు, అంగన్‌వాడికేంద్రాలు, ఆటస్థలాలు, ఎల్‌ఇడి బల్పులతో వీధిదీపాలు ఉండాలని ప్రణాళికలు రూపొందించటం జరిగిందన్నారు. ఒంగోలు నగరం స్మార్ట్‌సిటిగా రూపొందించేందుకు వందకోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో భారీపరిశ్రమలు రావాల్సి ఉందని దొనకొండ మెగా ఇండ్రస్టియల్ హబ్‌గా ఏర్పాటుకు రెండుకంపెనీలు అగ్రిమెంటు జరిగిందన్నారు. రాబోయే రెండు నుండి మూడునెలల్లో అవసరమైన కార్యక్రమాలు చేపట్టి యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. శింగరాయకొండ, ఉలవపాడుల్లో పర్యాటకంగా అభివృద్ధి చేసేవిధంగా ఐదుకోట్లతో టూరిజం ప్రణాళికను రూపొందించామన్నారు. ప్రధాని సూచించిన విధంగా విజన్ 2022 తూచాతప్పకుండా ప్రణాళికలు రూపొందించుకుని సమర్థవంతంగా అమలుపర్చుకోవాల్సి ఉందన్నారు. ఈసందర్బంగా జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ భారతప్రధాన ఏవరిఊహకు అందని పధకాలు అమలుచేస్తున్నారని దేశానికి దిశ, దశ చూపుతున్న ప్రదానమంత్రికి అభినందలు తెలిపారు. ప్రధానమంత్రి సంకల్పం సిద్ది నేరవేరాలని ఆకాంక్షించారు. జిల్లాలో 35కోట్లతో జిల్లాపరిషత్ హైస్కూళ్లలో జిల్లాపరిషత్ నిధులతో ప్రహరీ గోడల నిర్మాణాలు చేపట్టామన్నారు. 14వ ఆర్ధికసంఘం నిధులు జిల్లాపరిషత్‌కు, మండలాలకు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఎంఎల్‌సి కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి విజన్ 2022నాటికి నూతన భారత నిర్మాణానికి అందరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కేంధ్రమంత్రి సుజనాచౌదరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకుని తీసుకువస్తున్నారని అభినందించారు. జిల్లా బౌగోళిక, ఆర్ధికపరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని జిల్లాకు తగిన సహాయం అందించాలని సూచించారు. ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విద్య,వైద్యసదుపాయాలు, రక్షిత మంచినీటిసౌకర్యాలు కల్పించాల్సిఉందన్నారు. నీతిఅయోగ్‌కింద వెనుకబడిన ప్రకాశం జిల్లాను ఎంపిక చేయటంపట్ల ఆయనసంతోషం వ్యక్తం చేశారు. 14వ ఆర్ధికసంఘం నిధులు స్ధానిక సంస్ధలకునేరుగా అందేలా చూడాలన్నారు. ఎంఎల్‌సి పోతులసునీత మాట్లాడుతూ 2022నాటికి భారతదేశం అగ్రగామిగా ఉండాలని, అభివృద్ధి చెందాలని సంకల్పం చేయటం జరిగిందన్నారు. కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ అక్షరాస్యత సాధిస్తే అన్ని సాధించగలిగే అవకాశం ఉందన్నారు. ప్రధాని విజన్ 2022కు అందరు పునరంకితం కావాలన్నారు.్భరతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉందన్నారు.కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు మాట్లాడుతూ భారతదేశ ఉజ్వల భవిష్యత్‌కు సంకల్పం చేపట్టడటం జరిగిందన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చేయాల్సిఉందన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌భీమాయోజన పధకంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిఉందన్నారు. పాఠశాల్లో ల్యాబ్‌పరికరాలు అందించేలా చూడాలని, సైన్స్ ఎగ్జిబిషన్లలో షార్‌సెంటర్ల వారి సహకారంతో అందించేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో నెడ్‌క్యాప్ చైర్మన్ ఏరిక్షన్‌బాబుతోపాటు జిల్లాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందు డ్యాన్స్ అకాడమీ, మాంటిస్సోరి హైస్కూలు విద్యార్థులచే చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి సుజనామంత్రి ప్రధానమంత్రి సందేశాన్ని వినిపించి అనంతరం అందరి చేత సంకల్పం చేయించారు.