ఖమ్మం

భద్రాద్రి లడ్డూ ఇక ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి లడ్డూ ప్రసాదం ధరలు ఇక ప్రియం కానున్నాయి. నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు దేవస్థానం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రూ.100కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్న తరుణంలో ఆలయ ఆదాయం పెంచేందుకు ముందు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు భద్రాచలం దేవస్థానంలో లడ్డూ పరిమాణాన్ని పెంచేందుకు ప్రతిపాదించారు. గతంలో 80 గ్రాముల లడ్డూ రూ.15కు, 400 గ్రాముల కల్యాణ లడ్డూ రూ.50గా ఉండేది. ఈవో కె.ప్రభాకర శ్రీనివాస్ ఆదివారం రాత్రి జారీ చేసిన ప్రతిపాదిత ధరల్లో 80 గ్రాముల లడ్డూను 100గ్రాములు చేసి రూ.20 ధరగా నిర్ణయించారు. అలాగే 400 గ్రాముల కల్యాణ లడ్డూను 500గ్రాములు పెంచి రూ.100 ధర నిర్ణయించి ప్రతిపాదించారు. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ కారణంగా ధరల పెంపు అనివార్యం అవుతుందని ఈవో వెల్లడించారు. ప్రతిపాదిత ధరలపై 10 రోజుల్లో అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. పెంచిన ధరలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి భద్రాచలం దేవస్థానంలో కల్యాణలడ్డూ 400 గ్రాములది గతంలో విక్రయించేవారు. లడ్డూ పరిమాణం ఎక్కువ ఉండి రూ.50 ధర మాత్రమే ఉండటంతో నష్టాలు వస్తున్నాయనే సాకుతో విక్రయాలను నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ కల్యాణ లడ్డూను తెరపైకి తీసుకొచ్చారు. 400గ్రాముల లడ్డూ గతంలో రూ.50కి విక్రయించగా ఇప్పుడు దాన్ని 500 గ్రాములకు పెంచి రూ.100కు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత ధరల పెంపుపై భక్తుల అభిప్రాయాల అనంతరం సానుకూల స్పందన వస్తే నూతన ధరలు అమలు చేస్తామని దేవస్థానం అధికారులు పేర్కొంటుండగా ఆదాయమే మార్గంపై ఆది నుంచి ఈవో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల అభిప్రాయాలను పెద్దగా పరిగణించే అవకాశాలు లేవని, గతంలో కల్యాణ లడ్డూ విక్రయాలు నిలిపివేసిన సమయంలోనూ భక్తుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు కోరలేదని రామభక్తులు అభిప్రాయ పడుతున్నారు. ఈవో బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 100 రోజులు దాటింది. ఆయన ఆది నుంచి ఆదాయాన్ని పెంచేందుకే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆలయంలో డ్రస్‌కోడ్, సెల్‌ఫోన్ల నిషేదం వంటి చర్యలు చేపట్టగా సెల్‌ఫోన్‌ల నిషేధం వల్ల ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు లడ్డూ ప్రసాదాల భారాన్ని భక్తులపై వేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఆదాయం ఉన్నా ఇటువంటి చర్యలు చేపట్టడం తగదని రామ భక్తులు పేర్కొంటున్నారు.
భక్తులపై రూ.కోటి భారం
లడ్డూ ధరల పెంపు ప్రతిపాదన అమలైతే భక్తులపై ఏడాదికి అదనంగా రూ.కోటి భారం పడుతుందని భావిస్తున్నారు. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలు మినహా ప్రతిరోజూ రామాలయం నుంచి సుమారు 3వేల లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు తయారు చేసే 80 గ్రాముల లడ్డూ అన్ని ఖర్చులతో కలిపి రూ.16వరకు పడుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ ప్రభావం సుమారు 12శాతం ఉండనుండటంతో అదే లడ్డూ తయారీకి రూ.18 నుంచి రూ.19 వరకు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా గతంలో 400 గ్రాముల కల్యాణలడ్డూ రూ.50కి విక్రయించేవారు. కానీ దాని తయారీకి రూ.53 వరకు ఖర్చవుతుందని భావించి నష్టాలు వస్తున్నాయని అమ్మకాలు నిలుపుదల చేశారు. ఇప్పుడు రూ.500 గ్రాముల లడ్డూను రూ.100కు విక్రయించేందుకు ధర ప్రతిపాదించారు. అయితే 500 గ్రాముల బరువు ఉండే లడ్డూ తయారీకి జీఎస్టీతో పాటు అన్ని రకాల ఖర్చులు, ముడి సరుకు కలిపి సుమారు రూ.87 నుంచి రూ.89వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, అందుకే దాన్ని రూ.100కి విక్రయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. కాగా లడ్డూ ధరల పెంపు వల్ల ఏటా భక్తులపై రూ.కోటి భారం పడనుంది. గతంలో లడ్డూ పరిమాణం తగ్గించే సమయంలో దేవాదాయశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకముందే ఇక్కడ అమలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు విరాళాలు వస్తున్నా సరైన సౌకర్యాలు కల్పించకుండా ఆదాయమే పరమావధిగా లడ్డూ ధరలను పెంచడం దారుణమని వారు పేర్కొంటున్నారు. దీనిపై దేవాదాయశాఖ పునరాలోచన చేయాలని, అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలను పాత ధరల్లోనే కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి అనునిత్యం వచ్చే భక్తులపైనా ఆంక్షలు విధించినట్లు సమాచారం. భద్రాచలం రామాలయాన్ని నిర్మించిన భక్తరామదాసు శ్రీరంగం నుంచి ఐదు గోత్రాల వారిని స్వామి కైంకర్యం నిర్వహించేందుకు అప్పట్లో తీసుకొచ్చారు. వారి వారసులు తరతరాలుగా స్వామిసేవలో తరిస్తున్నారు. వారే కాకుండా భద్రాచలం పట్టణానికి చెందిన స్థానికులు కూడా నిత్యం రామయ్య సేవలో పునీతమవుతున్నారు. అయితే వారందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఈవో ఆదేశించినట్లు సమాచారం. దేవస్థానం తరుపున నిత్యం రామయ్య దర్శనానికి వచ్చే స్థానికులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, ఆ కార్డులను నెలనెలా గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఈవో మహిళా భక్తులకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై మహిళా భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వెంకయ్యను కలిసిన తుమ్మల
ఖమ్మం: రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడును సోమవారం కలిశారు. పదవి స్వీకరించిన తరువాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనను ముఖ్యమంత్రి కెసిఆర్‌లతో పాటు తుమ్మల కూడా బేగంపేట ఎయిర్‌పోర్టులో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తుమ్మలను ఆప్యాయంగా పలకరించటం విశేషం.

దళితులకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలి
ఖమ్మం(కల్చరల్): దళితులకు కమ్యూనిటీ హాల్స్‌ను వెంటనే నిర్మించాలని కులవివక్షవ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో సోమవారం డిఆర్‌ఓ శివశ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ ప్రతి దళితవాడలో అంబేద్కర్ విద్యావికాస కేంద్రాన్ని ఏర్పాటుచేయాలనే నిబంధనలున్నప్పటికి అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దళితులకై కమ్యూనిటీ హాల్స్‌ను, విద్యావికాస కేంద్రాలను ఏర్పాటుచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితులు గ్రామాల్లో, పట్టణాల్లో చిన్నపాటి ఫంక్షన్లు, మీటింగ్‌లు పెట్టుకోవాలంటే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు. వీటి గురించి ఎస్సీ కార్పోరేషన్ అధికారులను కలిసి విన్నవించగా స్థలం చూపాలన్నారని, స్థలంకావాలని స్ధానిక రెవెన్యూ అధికారులను కోరితే కమ్యూనిటీ హాల్ శాంక్షన్ లెటర్ కావాలని కాలయాపన జరుగుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి కమ్యూనిటీ హాల్, విద్యావికాస కేంద్రాలను నిర్మించి దళితులను ఆదుకోవాలని ఆయన కోరారు. డిఆర్‌ఓ స్పందిస్తూ తక్షణమే కమ్యూనిటీ హాల్‌కు కావాలిసిన స్థలాన్ని సమకూర్చి, హాల్ నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు బాబు, బొడ్డు ఏసు, బి నారాయణ, ఊట్కూరి ప్రసాద్‌రావు, బి కృష్ణయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం(గాంధీచౌక్): కామేపల్లి మండలంలోని రైతుల పహణీల విషయంలో కామేపల్లి తహశీల్ధార్ చొరవ చూపించి రైతుల సమస్యలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కామేపల్లి మండల రైతులందరి డిజిటల్ పహాణీలు రాకుండా తహశీల్దార్ రమణి నిలిపివేయడం దారుణమన్నారు. డిజిటల్ పహణీలు లేకపోవటంతో రైతులకు బ్యాంకుల రుణాలు ఇవ్వటం లేదన్నారు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకుంటున్నారని రైతులకు బ్యాంకు రుణాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైన తహశీల్దార్ మానవ ధృక్పదంతో ఆలోచించి ముందుగా రైతులకు బ్యాంకు రుణాలు అందేలా తగు చర్యలు తీసుకొని అనంతరం గతంలో జరిగిన అవినీతి గురించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే రైతులు బ్యాంకు రుణాలు అందక, పొలం పనులు పూర్తి చేయలేక ఇబ్బందులు పడతారన్నారు. లేనిపక్షంలో రైతుల ఇబ్బందులను తీర్చడానికై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్దమవుతామని హెచ్చరించారు.

మేమేం నేరం చేశాం....?
* మా 1బిలను ఎందుకు తొలగించారు
* అధికారులను నిలదీసిన కామేపల్లి రైతులు
ఖమ్మం(మామిళ్ళగూడెం): మా భూములకు సంబందించిన 1బిలను ఆన్‌లైన్‌లో ఎందుకు తొలగించారని కామేపల్లి మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో డిఆర్వోను నిలదీసారు. డిఆర్వో శివశ్రీనివాస్ ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. వందలాది మంది రైతులు తమ తమ పట్టాదారు పాస్‌పుస్తకాలు, 1-బిలను తీసుకొని అధికారుల ముందు టేబుల్‌పై పడవేసి వినతిపత్రం అందజేశారు. కామేపల్లి మండలం ముచ్చర్ల, కామేపల్లి, అడవిమద్దులపల్లి, సతానిగూడెం, జాస్తీపల్లి, తాళ్ళగూడెం తదితర 11గ్రామాలకు చెందిన రైతులు జడ్పిమీటింగ్ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేలో తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. సిపిఎం నాయకుడు నున్నా నాగేశ్వరరావు, రైతులు తోటకూర శివయ్య, మనె్నం వెంకటేశ్వర్లు, కాటాల మల్లయ్య తదితరులు అధికారులను ప్రశ్నించారు. వంశ పారంపర్యంగా వస్తున్న తమ భూములకు అన్ని హక్కులు ఉన్నాయని, 2014లో ఈ భూములన్నింటిని పరిశీలించి ఆర్డీఓ స్థాయిలో విచారణ జరిపి అప్పటి ఎంఆర్‌ఓ మాధవి తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, 1-బిలు జారీ చేశారన్నారు. ఆగస్టు 8న తహశీల్ధార్ రమణి వాటన్నింటిని ఆన్‌లైన్‌లో నుండి తొలగించారన్నారు. తమ వద్ద ఉన్న పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీల్‌లను తగులబెట్టమంటారా..? లేకుంటే ఆత్మహత్య చేసుకోమంటారా అని డిఆర్వోను నిలదీశారు. దీంతో డిఆర్వో మధిరలో ఉన్న కలెక్టర్ దృష్టికి పోన్‌ద్వారా తీసుకువెళ్ళారు. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన పోసల మురళీ తాను బిటెక్ పూర్తిచేసి వ్యవసాయం చేసుకుంటున్నానని తనకు ఉన్న 5ఎకరాల భూమిలో చేపల పెంపకానికి ఫర్మిషన్ కోసం తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించాలని కోరారు. నగరంలో 16ఏండ్లుగా ఎనె్నస్పీ కాలువపై ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నామని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులతో కలసి ఖాళీచేయాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ నివాస స్థలాలను క్రమబద్దికరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు. తెలంగాణ విమోచనా దినోత్సవం సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి నగర అధ్యక్షుడు రుద్ర ప్రదీప్ ఆధ్వర్యంలో డిర్వోకు వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉప సర్పంచ్ నాగేశ్వరరావు కుట్రపూరితంగా వ్యవహరించి విఆర్‌ఓ సత్యనారాయణ చేత జాతీయజెండాను ఎగురవేయించారని దీనిపై చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి తనకు న్యాయాం చేయాలని దమ్మాయిగూడెం సర్పంచ్ దేవళ్ళ జ్యోతి విన్నవించారు. గ్రీవెన్స్‌డేలో అధికారులు మారుపాక నగేష్ తదితరులు పాల్గొన్నారు.
డిటెన్షన్‌ను అమలు చేస్తే ఆందోళనలు తప్పవు
* ఎఐఎస్‌ఎఫ్
ఖమ్మం(జమ్మిబండ): కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంపేరుతో 6,7తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చూస్తుందని, దీన్ని అమలు చేస్తే ఉద్యమించక తప్పదని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలతో విద్యా వ్యవస్థ ధ్వంసం అవుతుందని ఆరోపించారు. డిటెన్షన్ విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థి పై తరగతులకు పోకుండా ఆపితే ఆ విద్యార్థి మళ్లీ పాఠశాల వెళ్ళేందుకు నిరాకరిస్తారని, దీని వలన విద్యార్థులు బాల కార్మికులుగా మారే అవకాశం ఉందన్నారు. పాఠశాలల్లో కనీస వౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు కల్పించకపోవడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయటం పట్ల శ్రద్ద చూపని ప్రభుత్వం విద్యార్థులపై డిటెన్షన్ విధించడం శోచనీయమన్నారు. కార్పొరేట్ చేతుల్లో విద్యా వ్యవస్థను అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, నాగులమీరా, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక తోలుకునేందుకు అనుమతులు
* జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్

మధిర: గ్రామాలలో అంతర్గతంగ రూ.5లక్షలలోపు వ్యయంతో నిర్మించే సిసిరోడ్ల నిర్మాణానికి ఇసుక తోలుకునేందుకు అనుమతులు ఇవ్వాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తానని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో సర్పంచ్‌లు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు మువ్వా వెంకయ్యబాబులు సిసిరోడ్ల నిర్మాణంలో వ్యయం చేసిన 20శాతం టిఎఫ్‌సి నిధులు 80శాతం ఇజిఎస్ నిధులు విడుదల చేయటంతో పాటు సిసిరోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక తోలుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ టిఎఫ్‌సి ఇజిఎస్ నిధులు మంజూరు చేయించడంతో పాటు రూ.5లక్షలలోపు వ్యయంతో నిర్మించే సిసిరోడ్లకు ఇసుక తోలుకునేందుకు అనుమతులు ఇస్తానన్నారు. అదే విధంగా నగర పంచాయతీలో విలీన గ్రామమైన మడుపల్లిలో గల 26ఎకరాల లెదర్‌పార్క్ భూమిలో నిర్మాణము చేసి 133కుటుంబాల వారికి జీవనభృతి కల్పించడంతో పాటు రుణసౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందచేశారు. మధిర నగర పంచాయతీలో విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని వాటిపై చర్యలు తీసుకోవాలని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకరాగా నగర పంచాయతీ కమిషనర్‌ను చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. నగర పంచాయతీలో సాదాబైనామాల ద్వారా భూములకు హక్కు కల్పించడం సాద్యం కాదని విధిగా రిజిస్ట్రేషన్ల ద్వారానే మ్యుటీషన్ చేయాలని విఆర్‌ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి వినయ్ కృష్ణారెడ్డి, ఆర్‌డిఓ పూర్ణచంద్, డిఆర్‌డిఎపిడి మురళీదర్‌రావు, మధిర డిప్యూటి తహశీల్ధార్ ఉపేందర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.