ఖమ్మం

10వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్: బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు 10వ వేతన ఒప్పందాన్ని అమలుచేసి సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఐఎఫ్‌టియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఎన్‌సిడబ్యూ ద్వారా వేతనాలు వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన వేతన జివో కంటితుడుపు చర్యే అన్నారు. పర్మినెంటు కార్మికులకు నిర్ణయించిన వేతనాలు, అలవెన్సులను చెల్లించే విధంగా సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జరివరి 19న విడుదలచేసిన జివో ప్రకారం కనీస వేతనంగా అన్‌క్సిల్డ్‌కు రూ 359, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ 420, స్కిల్డ్ కార్మికులకు రూ 506, హైస్కిల్డ్ కార్మికులకు రూ 593 చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయంచేసే సర్క్యులరును కార్మికులు అంగీకరించరని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఉధ్యమాలపై నీళ్ళు జల్లేందుకే కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పదోవేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, అలవెన్సులు, సమాన వేతన చట్టం ప్రకారం అమలుజరిగేలా కేంద్ర ప్రభ్వుం బొగ్గు గనుల యాజమాన్యాలపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత జెబిసిసిఐ సంఘాలపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు 10వ వేతన ఒప్పందం కోసం ఉధ్యమాలు చేస్తామని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఐఎఫ్‌టియు నాయకులు డి ప్రసాద్, కొండపల్లి శ్రీను, మధుసుదన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.