హైదరాబాద్

ట్రాన్స్‌కో చెట్ల నరికివేత కష్టాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను నరకడం వల్ల తలెత్తే సమస్యను పరిష్కరించేందుకు బ్రాంచ్ ప్రూనింగ్, ష్రెడ్డింగ్ మిషన్లను అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ వీటిని ప్రారంభించనున్నారు. నగర రహదారులపై ఏపుగా పెరిగిన చెట్లను విద్యుత్ శాఖ విద్యుత్ కేబుళ్లకు అడ్డుగా ఉండటంతో నరికివేయడం సర్వసాధారణం. అయితే, ఇలా నరికివేసిన కొమ్మలను తరలించడం ఆలస్యం అవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలపై ప్రభావం చూపుతోంది. దీనిని పరిష్కరించేందుకు బ్రాంచ్ ప్రూనింగ్, ష్రెడ్డింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా భారీ స్థాయిలో ఉన్న కొమ్మలను చిన్న, చిన్న ముక్కలుగా చేసి తరలించవచ్చు. దీంతో పాటు ష్రెడ్డింగ్ మిషన్ల ద్వారా ముక్కలుగా కట్ చేసిన వాటిని సేంద్రియ ఎరువులుగా రూపొందించేందుకు సైతం అవకాశం ఏర్పడుతుంది.