హైదరాబాద్

భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక చవితి, బక్రీదు పండుగల సందర్భంగా భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ సోమవారం జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గణేశ నిమజ్జనం, బక్రీదు పండుగలు ఒకే రోజు వస్తున్నందున రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, పండుగలు ప్రశాంతంగా జరుపుకునే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని డిజిపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీలను ఆదేశించారు. గణేశ మండపాల నిర్వాహకులు, శాంతి సంఘం సభ్యులు సమన్వయంతో పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత సంవత్సరం లాగే ఈ సారి కూడా గణేశ నిమజ్జనం ఒకే రోజు జరిగేలా చూడాలని, బక్రీదు పండుగ ఉన్నందున మధ్యాహ్నం వరకు గణేశ నిమజ్జనానికి వచ్చే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని, మధ్యాహ్నం నుంచి గణేశ నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను తరలించడంలో అందరూ సహకరించాలని సూచించారు. గణేశ మండపాలు, మసీదు, ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని డిజిపి జిల్లా ఎస్పీలకు సూచించారు. ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతి సంఘం సభ్యులు, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ యంత్రాంగం తగు భద్రత చర్యలు చేపట్టనున్నట్టు డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా గణేశ నిమజ్జనానికి వచ్చే మండపాల నిర్వాహకులు నిర్దేశిత రూట్‌లలోనే గణేశ విగ్రహాలు తరలించాలని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో నగర కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డితోపాటు అదనపు డిజి అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజి వి నవీన్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.