రంగారెడ్డి

పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: వినాయక చవితి పండుగ, ఉత్సవాలను, బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వికారాబాద్ డిఎస్పీ టి.స్వామి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలిస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి సంఘం సమావేశంలో మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. డిజె అనుమతి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిర్ణయానే్న అమలు చేస్తామని చెప్పారు. వికారాబాద్ ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రమైనందున ఉత్సవాల్లో ఏ చిన్న తప్పు దొర్లినా జిల్లాపై ప్రభావం చూపుతుందని, అలా జరగకుండా సహకరించాలని కోరారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జెఎసి జిల్లా గౌరవాధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ అన్ని పండుగలను హిందూ, ముస్లింలు కలిసి జరుపుకోవడంలో వికారాబాద్ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. 24వ వార్డు కౌన్సిలర్ ఎ.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్, విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీసులు తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా, తప్పు చేయనివారిపై కేసులు నమోదు చేయడం సరి కాదన్నారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు గులాం హఫీజ్ మాట్లాడుతూ రామయ్యగూడ రైల్వే గేటు వద్ద రోడ్డు గుంతలు పడి ఉందని, వినాయకుల నిమజ్జనం రోజు ఇబ్బంది పడతారని మరమ్మతు చేయాలని సూచించారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి తస్వర్ అలీ మాట్లాడుతూ అన్ని జిల్లాల కంటే వికారాబాద్ పూర్తిగా వెనుకబడి ఉందని, మరింత వెనుకబడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వికారాబాద్ జడ్పీటిసి ముత్తార్ షరీఫ్ మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా మున్సిపల్, విద్యుత్ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శివరాజ్ మాట్లాడుతూ ఉత్సవాల్లో మద్యం సేవించి ఉంటారనే అపోహను వీడాలని స్పష్టం చేశారు. మిగతా వారి పండుగలకు మద్యం సేవిస్తారని కించపర్చలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముస్లింల పండుగల్లో హిందువులు పాలుపంచుకున్నట్టే, వినాయక నిమజ్జనం రోజు ముస్లింలు వేదికను ఏర్పాటు చేసుకుని స్వాగతం పలికి పూజలు నిర్వహించాలని తెలిపారు. టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య మాట్లాడుతూ నిమజ్జనం తొందరగా ప్రారంభిస్తే తొందరగా ముగుస్తుందని వివరించారు. జెఎసి జిల్లా కన్వీనర్ జి.రాంచందర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రోడ్డు పనులు పూర్తయినందున నిమజ్జనం రోజు వేదికల ఏర్పాటు విషయంలో పోలీసులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో వికారాబాద్ సిఐ ఎం.వెంకట్రామయ్య, ఫైర్ ఎస్‌ఐ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డి, ఎంపిడివో సత్తయ్య, విద్యుత్ ఎఇ కిషన్ ప్రసాద్, ఎస్‌ఐ నరేష్, డిప్యూటీ తహశీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.

వైభవంగా శ్రావణమాస ముగింపు ఉత్సవాలు
దౌల్తాబాద్: శ్రావణమాస అమావాస్యను పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామల్లో ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఉదయం నుండి భక్తులుతో ఆలయాలు కిటకిటలాడాయి. దౌల్తాబాద్ గ్రామంలోని నీలకంఠ స్వామి దేవాలయం నుండి స్వామివారిని పల్లకిలో ఉంచి, భజన పాటలతో నృత్యాలు చేస్తూ పురవీధుల మీదుగా ఉరేగింపు నిర్వహించారు. అనంతరం పెద్దచెరువులో గంగస్నానం చేయించారు. నందీకోళ కార్యక్రమం చేపట్టారు. ఆలయం చూట్టూ ప్రదక్షణలు చేశారు. అన్నదానం నిర్వహించారు. ఈదమ్మ దేవాలయం, హనుమాన్ దేవాలయంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ముగిసిన సిద్దులగుట్ట జాతర
శంషాబాద్: మూడు రోజులుగా వేలాదిమంది భక్తులు శివనామస్మరణంతో సిద్దులగుట్ట జాతర వైభవంగా సాగింది. వెండికొండపై కొలువు దీరిన జంగమయ్యను భక్తజనం దర్శించుకుని పునీతులయ్యారు.
సోమవారం చివరి రోజు వేలాది మంది భక్తులు జాతరకు పోటెత్తారు. స్వామివారికి ఆలయం ముందు ఉన్న గుండంలో అమృత స్నానం నిర్వహించి పల్లకి సేవలో తీసుకెళ్లారు. హోమాలు, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాస రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు. పూజ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపిపి చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, స్థానిక సర్పంచ్ సిద్ధేశ్వర్, మాజీ సర్పంచ్ ఆర్.గణేష్ గుప్తా, కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగౌడ్, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, దూడల వెంకటేష్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, మోహన్‌రావు, వైస్ ఎంపిపి సురేష్ గౌడ్, సర్పంచ్‌లు సిద్ధులు, సిద్ధేశ్వర్‌తో పాటు దీపా మల్లేష్, అన్నపూర్ణ పాల్గొన్నారు.
పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
వికారాబాద్: వికారాబాద్ సమీపంలోని బుగ్గలోని శ్రీ రామలింగేశ్వరాలయంలో సోమవారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ఎస్.ఆత్మలింగం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణం, ప్రత్యేక పూజలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాలుపంచుకున్నారు. అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయంతో పాటు పూడూరు మండలం దామగుండం శివాలయం, మదన్‌పల్లి సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివాలయానికి భక్తుల తాకిడి
పరిగి: శ్రావణ సోమవారం సందర్భంగా పరిగి పట్టణంలోని శివాలయానికి, దామ గుండంలోని శ్రీరామ లింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి శివాలయానికి వచ్చిన భక్తులు.. అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అన్న ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఉపవాస దీక్షలు చేసిన భక్తులు సాయంత్రం 5 గంటలకు శివాలయ ప్రాంగణంలో దీక్షలు విరమించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శివాలయ కమిటీ ఏర్పాట్లను చేసింది. శివాలయాన్ని రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించారు. జాగరణ చేసే భక్తులు దేవాలయం దగ్గరే ఉన్నారు. శివాలయ ప్రాంగణం శివ నామస్మరణతో మారుమోగింది.
సంగమేశ్వర ఆలయంలో
మర్పల్లి: మర్పల్లి మండలం బూచన్‌పల్లిలోని సంగమేశ్వర్ దేవాలయంలో శ్రావణమాసం ఆఖరి సోమవారం, అమావాస్య సందర్భంగా బిల్వార్చన ఘనంగా జరిగింది. ఆలయంలోని శివలింగానికి రుద్రాభిషేకంచేసి మారేడు పత్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ఆఖరి సోమవారంతో ఇదే రోజు సూర్యగ్రహణం కూడా ఉండడంతో ఈ రోజును సోమావతి అమావాస్య పరిగణిస్తారని పూజారి మఠం నాగలింగంస్వామి అన్నారు. ఈ రోజుకు చాలా విశిష్టత ఉందని.. మహా శివరాత్రి కన్నా పవిత్రమైనదని ఆయన అన్నారు. ఈ రోజున సకల శక్తులు లింగరూపుడైన శివుడిలో కొలువై ఉంటాయని, ముక్కోటి దేవతలు, సప్త రుషులు, నవగ్రహాలు సైతం ఈ రోజు శివుడిని ఆరాధించేందుకు ఎదురుచూస్తారని పురాణాల్లో ఉందని పేర్కొన్నారు. ఈ రోజు బిల్వపత్రాలు, పూలతో పూజించడం అందరికీ శుభప్రదమని సూచించారు. మహిళలు, పిల్లలతో పాటు పురుషులు శివలింగంపై బిల్వపత్రాలు పెట్టి మొక్కుకొన్నారు. వందేళ్ల చరిత్ర కలిగి ఈ ఆలయంలో భక్తులు అన్నదానం, తీర్థ ప్రసాద వితరణ చేశారు.

ఏకాంబరి జాతరకు పోటెత్తిన భక్తజనం
తాండూరు: పవిత్ర శ్రావణమాసం ఆఖరి సోమవారం అమావాస్యతో ముగిసింది. ఈ సందర్భంగా తాండూరు డివిజన్ పట్టణ అన్ని మండలాల ప్రజలు మహిళలు భక్తజనం తమకిష్టమైన దేవాలయాలకు వెళ్లి ఆయా దేవతలను సందర్శించుకొని పూజలు నిర్వహించారు. కాగా, బషీరాబాద్ మండలం నీల్లపల్లి, పర్వత్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతం గుట్టల మధ్య కొలువుదీరిన ఏకాంబరి శ్రీ రామలింగేశ్వర దేవాలయానికి ఏటా మాదిరి భక్తజనం పోటెత్తారు. ఏకాంబరి గుట్టల్లో ఉన్న స్వామివారి ఏడు గుండాల కోనేరుగా ప్రసిద్ధిలో ఉన్న కోనేటిలో స్నానమాచరించి శ్రీ రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. జాతర ఉత్సవాలకు భక్తజనంతోపాటు పక్కనే కర్నాటకలోని గుల్బర్గా, యాద్‌గిర్, రాయచూర్ వంటి సూదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా తాండూరు డివిజన్ శ్రావణమాస ముగింపు వేడుకలకు ప్రసిద్ధి గాంచిన పెద్దెముల్ మండలం తట్టెపల్లి, అడ్కిచర్ల గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కోలువు దీరిన శ్రీ అంబు రామన్నగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానం జాతరలో సైతం అశేష భక్తజనం హాజరై మొక్కులు తీర్చుకున్నారు.