రంగారెడ్డి

తపాలా సిబ్బంది సమ్మెతో నిలిచిన పింఛన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా సిబ్బంది సమ్మె చేస్తుండటంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. కొత్తూరు, నందిగామ మండలాల్లో మొత్తం 18గ్రామ పంచాయతీలు, 28అనుబంధ గ్రామాలు, 23గిరిజన తండాలు ఉన్నాయి. కొత్తూరు తపాలా శాఖ పరిధిలో తొమ్మిది మంది పనిచేయాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆసరా పథకం పింఛన్ల పంపిణీ కార్యక్రమా తపాలా శాఖ ద్వారానే నిర్వహిస్తుంది. నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున 3513మంది లబ్ధిదారులకు ప్రతి నెల తపాలాశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలాశాఖ సిబ్బంది ఆగస్టు 16వ తేది నుండి సమ్మె చేస్తుండటంతో పింఛన్ల పంపిణీ కాస్తా నిలిచిపోయింది. దాంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తపాలా కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు కొనసాగిస్తున్నారు. పింఛన్ల పంపిణీ ఐదు రోజులుగా నిలిచిపోవడంతో ప్రభుత్వం స్పందించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాలు, పాస్‌పోర్టు, మనియార్డర్, రిజిస్టర్‌పోస్టు, స్పీడ్‌పోస్టు, అర్డీ, ఎస్‌బి, సుకన్య యోజన వంటి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్తూరు, నందిగామ పారిశ్రామికవాడ కావడంతో ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు వచ్చి పనులు చేస్తున్నారు. కార్మికులు ప్రతి నెల తమ స్వగ్రామాలకు డబ్బులు పంపించేందుకు ఎక్కువగా తపాలా సేవలను వినియోగిస్తుంటారు. కానీ, ఐదు రోజులుగా తపాల సేవలు నిలిచిపోవడంతో కార్మికులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.