గుంటూరు

రెండు వేర్వేరు సంఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి: మంగళగిరి రూరల్ పోలీసు స్టేషను పరిధిలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోగా మరో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదటి సంఘటనలో రూరల్ మండలం బేతపూడిలో బి రమేష్‌బాబు (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో సంఘటనలో పెదవడ్లపూడి గ్రామంలో జంజు జాన్‌బాబు (31) ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా అదే గదిలో జాన్‌బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న దుర్గ (27) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది వుంది. సోమవారం జరిగిన ఈ ఘటనలకు సంబంధించి రూరల్ ఎస్సై వాసు కథనం ప్రకారం బేతపూడికి చెందిన రమేష్‌బాబుకు ఉమారాణితో వివాహమైంది. భార్యా భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధల నేపధ్యంలో భర్తపై పోలీసుస్టేషనులో ఉమారాణి ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో రమేష్‌బాబు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్‌బాబుతండ్రి బేతపూడి పీటర్‌పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై వాసు తెలిపారు. పెదవడ్లపూడి రైల్వేస్టేషను రోడ్డులో నివాసం ఉంటున్న బందు దుర్గకు పదేళ్ల క్రితం లాం గ్రామానికి చెందిన సుధాకర్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య భర్తల మధ్య ఏర్పడిన విభేదాల నేపధ్యంలో సుధాకర్ గుంటూరులో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా దుర్గ తన పుట్టిల్లు పెదవడ్లపూడిలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి మండలం డోలాస్ నగర్‌కు చెందిన జుంజు జాన్‌బాబు అనే వ్యక్తితో దుర్గకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గడచిన ఆరేళ్లుగా జాన్‌బాబు, దుర్గ సహజీవనం సాగిస్తున్నారు. జాన్‌బాబుకు భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దుర్గ, జాన్‌బాబుల మధ్య ఎటువంటి గొడవ జరిగిందో తెలియదు గానీ జాన్‌బాబు ఉరివేసుకుని మరణించగా దుర్గ మంచంపై అనుమానాస్పదంగా మృతిచెంది ఉంది. ఆమెనోటి నుంచి నురగ వస్తుండటంతో ఏదైనా విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా, లేక జాన్‌బాబే ఆమెను చంపి ఉరి వేసుకున్నాడా? అనేది తేలాల్సి ఉందని రూరల్ ఎస్సై వాసు తెలిపారు.

జంట హత్యల కేసులో నిందితుడి అరెస్ట్
* తహశీల్దార్ వద్ద లొంగిపోయిన వైనం
అమరావతి: మండల కేంద్రమైన అమరావతిలో నక్కల వాగు సమీపంలో ఈనెల 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఓ పథకం ప్రకారం ఇద్దరు యువతులను హత్యగావించిన నిందితుడు మండల తహశీల్దార్ కార్యాలయంలో లొంగిపోవడంతో అమరావతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి ఎస్‌హెచ్‌ఒ తక్కెళ్లపాటి మురళీకృష్ణ కథనం ప్రకారం... అమరావతి బాబు జగజ్జీవన్‌రామ్ కాలనీకి చెందిన మసకా లక్ష్మి (24)తో గత రెండు సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్న వైకుంఠపురం గ్రామానికి చెందిన పల్లా సత్యనారాయణ ఆమె వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక 4 లక్షల రూపాయలు ఇవ్వాలని పీడించడంతో పథకం ప్రకారం లక్ష్మిని హత్య చేయడానికి పథకం రూపొందించాడు. ఈనెల 15 ఉదయం 11 గంటలకు మృతురాలు మసకా లక్ష్మి బెదిరించగా ఆ రోజు రాత్రికి నక్కలవాగు సమీపానికి వస్తే డబ్బులిస్తానని చెప్పి నమ్మబలికి మసకా లక్ష్మితో పాటు ఆమె వెంట వచ్చిన మరో హతురాలు బత్తుల ఫణిని కూడా కట్టెతో తీవ్రంగా గాయపరిచి నక్కల వాగులో తోసివేశాడు. వారి వద్ద నున్న స్కూటర్‌ను కూడా కాల్వలోనే పడవేశాడు. ఈ విషయమై మృతురాలు తండ్రి తుడుము కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నిందితుడు పల్లా సత్యనారాయణ ఉదయం 9 గంటలకు మండల తహశీల్దార్ భాస్కరరావు వద్ద లొంగిపోయాడు. నిందితుడిచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకుని, విచారించి నిందితుడు హత్యకు ఉపయోగించిన హ్యాండ్ బ్యాగ్, సరివి కట్టెతో పాటు అతని వద్దనున్న ఆటోను స్వాధీనపర్చుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, సోమవారం సాయంత్రం సత్తెనపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సిఐ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసులో ఎస్‌ఐలు షేక్ రహంతుల్లా, నరసింహారావు, హెడ్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, దాసు తదితరులు పాల్గొన్నారు.
26న ఉపరాష్టప్రతికి పౌరసన్మానం
* సభా స్థలిని పరిశీలించిన కలెక్టర్, అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు: ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈనెల 26వ తేదీన పౌరసన్మానం చేయనున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర, రాష్టమ్రంత్రులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ కోన శశిధర్ సచివాలయ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. గృహనిర్మాణ పథకానికి కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
హసనాబాద్ కొండల్లో ఎర్రచందనం కలకలం
అచ్చంపేట: క్రోసూరు మండలం హసనాబాద్ కొండల్లో ఎర్రచందనం కలకలం చెలరేగింది.. రెండు కొండల మధ్య రహస్య ప్రదేశంలో దుంగలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకు ఉప్పందించారు. దీంతో సోమవారం సాయంత్రం అటవీ, పోలీసు శాఖ కొండల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు కొండల మధ్యన ఓ ప్రదేశంలో 30 వరకు దుంగలు ఉన్నట్లు గుర్తించారు. నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. కాగా పోలీసులు స్వాధీన పరచుకున్న దుంగల విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని కొన్ని ఎలక్ట్రానిక్ చానళ్లలో ప్రసారమైంది. దీంతో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఉలిక్కిపడి క్రోసూరుపై దృష్టి సారించారు. పై అధికారుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. చివరకు అవి నల్లతుమ్మ మొద్దులు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎర్రచందనం ఈ ప్రాంతంలోని అడవుల్లో లభ్యం కాదని చెప్తున్నారు. అయితే బొల్లాపల్లి మండలం నల్లమల అటవీ సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి ఎవరైనా స్మగ్లర్లు ఇక్కడ దాచి ఉండవచ్చనే వాదనలు వినవస్తున్నాయి.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో టాస్క్ఫోర్స్ స్వాధీనం చేసుకుని స్మగ్లర్ల ఆట కట్టించటంతో మరోమార్గం ద్వారా తరలించే ప్రయత్నం జరుగుతోందా? అనే కోణంలో కూడా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. కాగా అవి ఎర్రచందనం కానేకాదని పరీక్షల ద్వారా నిర్ధారించేందుకే వాటిని స్వాధీన పరచుకున్నామని అటవీ అధికారులు స్పష్టం చేశారు.

ఉద్యోగాలిచ్చే స్థాయకి విద్యార్థులెదగాలి
తాడికొండ: విద్యార్థులు ఉద్యోగాలకోసం వెతకకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కేంద్ర సాంకేతిక, ఎర్త్ సైనె్సస్ శాఖామాత్యులు వైఎస్ సృజనాచౌదరి ఆకాంక్షించారు. మండల పరిధిలోని లాం చలపతి కళాశాలలో నూతనంగా నిర్మించిన బ్లాక్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎస్ కనె్వన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా పాల్గొన సుజనా చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనా దేశానికి కావలసిన టెక్నాజీని రూపొందించాలన్నారు. విద్యార్థులకు కలిగిన ఉన్నతమైన ఆలోచనలో ప్రాజెక్టులకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి పరిచి గ్రామ అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోట్పడాలన్నారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎప్పుడూ వుంటుందన్నారు. సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా దేశాభివృద్ధికి ఉపయోగించి సత్ఫలితాలను పొందాలన్నారు. అనంతరం విద్యార్థులు పలు ఆసక్తికర ప్రశ్నలకు సృజనా చౌదరి సమాధానం ఇచ్చారు. అనంతరం సృజనా చౌదరిని చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి నక్కా అనంద్‌బాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివీ ఆంజనేయులు, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ , రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకూమారి, గుంటూ రు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, చలపతి విద్యాసంస్థల సెక్రటరీ వైవి సుజిత్ కుమార్, డైరెక్టర్ వినయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్స్ నాదెండ్ల రామారావు, డాక్టర్ రవికాంత్ ,డాక్టర్ పండరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
అమరావతి: మండల కేంద్రమైన అమరావతిలోని పల్లపువీధిలో నివశిస్తున్న పసుపులేటి రత్తయ్య కుమారుడు సురేష్ (20) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి సిఐ తక్కెళ్లపాటి మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్‌ఐ రహంతుల్లా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి 30 పడకల ఆసుపత్రికి తరలించారు.
మహాశివునికి రుద్రాభిషేకం
* శివాలయాలకు భారీగా తరలివచ్చిన భక్తజనం
గుంటూరు (కల్చరల్): అరుదుగా వచ్చే పోలాల అమావాస్య నాడు సోమవారం నాడు నగరంలోని 11 ప్రధాన శివాలయాల్లో లింగధారుడైన మహాశివునికి అర్చక బృందం మహారుద్రాభిషేకాలు నిర్వహించింది. అమావాస్య, సోమవారం ఒకటిగా కలిసి వచ్చిన శుభతరుణంలో సకల ఉపద్రవాలను నివారించడానికి తద్వారా, లోక శాంతిని కల్గించాలనే ప్రధాన సంకల్పంచేసి వివిధ శివాలయాల్లో అర్చకులు సోమవారం తెల్లవారుజాము నుంచే రుద్రాభిషేకాలను జరిపారు. ఈ సందర్భంగా అన్ని శివాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ధ్వజస్తంభాల వద్ద ఆవునేతితో దీపాలను వెలిగించి అంతరాలయంలో కొలువైయున్న సర్వేశ్వరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. గ్రహపీడాదిధోషాల నివారణకై ముఖ్య శివాలయాల్లో నవగ్రహ మండపాల వద్ద కూష్మాండదానాలు (మంచి గుమ్మడికాయ) చేశారు.

వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు (కొత్తపేట): వ్యవసాయ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కార్మికులు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలపై కుస్తీ పడుతున్న అధికార, ప్రతిపక్షాలకు వ్యవసాయ కార్మికుల సమస్యలు పట్టడం లేదన్నారు. రాజధాని ప్రాంతంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిపిందన్నారు. ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడ్తున్న ప్రభుత్వం కార్మికుల సమస్యలపై దృష్టిసారించకపోవడం బాధాకరమన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పనిదినాలు కల్పించాలని, కూలికి 400 రూపాయలు చెల్లించాలని, 55 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరాజు మాట్లాడుతూ కరవు వలసల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు, వ్యవసాయ కూలీలకు జాబ్‌కార్డులతో సంబంధం లేకుండా పనులు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నుండి జిల్లా పరిషత్ వరకు ప్రదర్శన నిర్వహించి జెసి కృత్తికాశుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపి ఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఎ ఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ముసునూరి రమేష్, పులి సాంబశివరావు, బి రామకృష్ణ, సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.

రజకుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా
గుంటూరు (పట్నంబజారు): రజకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఎపి రజక వృత్తిదార్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సంఘ జిల్లా అధ్యక్షుడు వల్లభాపురపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా పలు గ్రామాల్లో రజకులపై పెత్తందార్లు భౌతికదాడులు చేస్తూ, వివక్షతను చూపిస్తూ, సామాజిక గ్రామ బహిష్కరణ చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా రజకులకు మాత్రం నేటికీ స్వేచ్ఛ రాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటి చట్టం మాదిరిగా రజకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మానేపల్లి దుర్గారావు మాట్లాడుతూ బిసి కార్పొరేషన్ రుణాలకు సంబంధించి 90 శాతం సబ్సీడితో రజకులకు బ్యాంకులతో సంబంధం లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం చంద్రబాబు వృత్తిదారులకు చేతి పనిముట్లను ఆదరణ పథకం ద్వారా ఉచితంగా అందజేస్తామని ప్రకటించారే తప్ప నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. ఇళ్లులేని పేద రజకులకు ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన రజక వృత్తిదార్లకు 2 వేల రూపాయలు వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వృత్తిదారులకు మద్దతు తెలియజేశారు. రజకులకు రక్షణ చట్టం కోసం సంఘ నాయకులతో కలిసి మంత్రి అచ్చన్నాయుడును కలిసి సమస్యలు తెలియజేస్తామన్నారు. ధర్నానంతరం ర్యాలీగా జిల్లా పరిషత్‌కు చేరుకుని జెసి కృత్తికాశుక్లాకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకట నరసయ్య, గాంధీ, ఆర్ శేషయ్య, ఎ శివనాగేశ్వరరావు, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
పచ్చళ్ల తయారీ కంపెనీలపై దాడులు
మంగళగిరి: పట్టణంలోని కొత్తపేటలో పచ్చళ్లు తయారు చేస్తున్న ఒక ఇంటిపై సోమవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఐదు డ్రమ్ముల్లో పచ్చళ్ల తయారీకి కలిపిన మెటీరియల్‌ను వారు తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించారు. పచ్చళ్ల తయారీ నాసిరకంగా ఉంటున్నట్లు పలుచోట్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం దాడులు ప్రారంభించింది. ఈ నేపధ్యంలో మంగళగిరిలో పచ్చళ్లు తయారవుతున్నట్లు అందిన సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ అధికారి విలియమ్స్, డెప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించి డ్రమ్ముల్లో తయారీకి సిద్ధంగా ఉన్న పచ్చడిని పరిశీలించారు. శాంపిల్స్ తీసి లేబొరేటరీకి పంపుతున్నామని, ఇందులో కల్తీ ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
పివిఆర్‌కె ప్రసాద్ మృతి హిందు సమాజానికి తీరనిలోటు
గుంటూరు (కల్చరల్): నిజాయితీ, నిబద్దతకు మారుపేరుగా వివిధ హోదాల్లో రాష్ట్రానికి, దేశానికి సేవలందించి, హైందవధర్మ పరిరక్షణ, ప్రచారమే లక్ష్యంగా తుదిశ్వాస విడిచేవరకు శ్రమించిన పివిఆర్‌కె ప్రసాద్ అస్తమయం హిందూ ధర్మానికి తీరనిలోటని హిందూ ధర్మరక్షా సమితి జిల్లా శాఖ తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేసింది. జిల్లాలోని నర్సరావుపేట సమీపంలో గల సాతులూరు గ్రామంలో జన్మించిన పివిఆర్‌కె ప్రసాద్ ఐఎఎస్ అధికారిగా, తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా, టిటిడి అభివృద్ధికి ఎంతగానో శ్రమించారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న ప్రతి బృహత్తర కార్యక్రమానికి ఇఒగా ఆనాడే పివిఆర్‌కె ప్రసాద్ బాటలు వేశారని, హిందూ ధర్మరక్షా సమితి జిల్లా శాఖ అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ సంతాపం వ్యక్తంచేశారు. ప్రస్తుతం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పివిఆర్‌కె తిరుమలలోనూ, దేశంలోని అనేక ముఖ్యప్రాంతాల్లో హైందవ ధర్మ జాగృతికై పీఠాధిపతులందరితో సదస్సులు, హైందవ ధర్మ సమ్మేళనం నిర్వహించారని శ్రీనివాస్ కొనియాడారు. నిజాయితీకి మారుపేరుగా ధర్మబద్దమైన జీవనాన్ని కొనసాగించిన పివిఆర్‌కె ఆకస్మిక అస్తమయం హైందవ ధర్మానికే కాకుండా, రాష్ట్రానికి, జిల్లా వాసులకు తీరని లోటన్నారు. చివరిసారిగా పివిఆర్‌కె గుంటూరు నగరంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో సంత్ రవిదాస్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రబోధాత్మక సందేశాన్ని అందించారని శ్రీనివాస్ సోమవారం ఇక్కడ విలేఖర్లకు తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, పివిఆర్‌కె కుటుంబానికి శ్రీనివాస్, హిందూ ధర్మరక్షా సమితి కార్యవర్గ సభ్యులు భగవంతుని ప్రార్థించారు. కాగా పివిఆర్‌కె ప్రసాద్ హైదరాబాద్‌లో సోమవారం గుండెపోటుతో మరణించడం ఇక్కడ ఆయనతో అనుబంధం ఉన్న అనేక మంది సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల వారి హృదయాలను కలచివేసింది. గుంటూరు నగరంతో మరిముఖ్యంగా పాత గుంటూరుతో వీటన్నింటికీ మించి ధార్మిక ప్రచారయజ్ఞంలో ఆయన కీలకపాత్ర వహించడంతో ఈ నగరం, జిల్లాతో ఉన్న అనుబంధం మరపురానిదని పలువురు తమ సంతాపంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సిరిపురపు శ్రీ్ధర్ సోమవారం పివిఆర్‌కె మృతిపట్ల సంతాపం వ్యక్తంచేశారు.

ట్రాఫిక్ సమస్యలపై జపాన్ బృందం సర్వే

సత్తెనపల్లి:రాష్ట్ర రాజధాని అమరావతికి అతి చేరువలోవున్న సత్తెనపల్లి పట్టణంలో నెలకొనివున్న ట్రాఫిక్ సమస్యలపై సోమవారం జపాన్ బృందం సర్వే చేసింది. సిఆర్‌డిఏ పరిధిలోవున్న 12 మున్సిపాల్టీలు 900 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు బృందం పేర్కొంది. భారత ప్రభుత్వం ఆదేశాలమేరకు జపాన్ బృందంతోపాటు అనుబంధంగా ఆర్‌వి అసోసియేషన్‌వారు పట్టణంలో నెలకొనివున్న ట్రాఫిక్ సమస్యలను ఎలా అధికమించవచ్చుననే దానిపై వారు పూర్తి స్థాయిలో సర్వేచేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వానికి 18 నెలల్లో ప్రాజెక్టును తయారుచేసి సమర్పించడం జరుగుతుందని వివరించారు. 2300 చదరపు కిలోమీటర్లువున్న సి ఆర్ డి ఏ పదిదిలో ఈ సర్వేని నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు వెడల్పు, ప్రధాన కూడళ్ళలో తీసోకోవాల్సిన జాగ్రత్తలపై కూలంకుషంగా వారు సర్వేచేయనున్నారు. మరోవారం రోజుల్లో ఈ సర్వే పనులకు శ్రీకారం చుట్టనున్నుట్లు వారు వివరించారు. ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పకూచి (జపాన్) ఆర్ వి అసోసియేషన్ సలహాదారు ఎమ్‌వి శర్మ, మేనేజర్ జగదీష్, పట్టణ ప్లానర్ మోజేష్, పురపాలక సంఘ కమీషనర్ బొల్లినేని శ్రీనివాసరావు, డి ఇచంద్రశేఖర్, టిపి ఓ సి హెచ్ వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.