సబ్ ఫీచర్

ఆ రసాయనాలతో పిల్లల ‘ఐక్యు’పై దుష్ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. వారి ఎదుగుదల, మేథస్సుపై దుష్ప్రభావం పడకుండా వారు అప్రమత్తం కావలసిన సమయం ఇది. అగ్నిప్రమాదాలు జరగకుండా, అందం కోసం ఫర్నిచర్, గృహోపకరణాలకు వాడే కొన్ని రకాల రసాయనాలు చిన్నారుల మేథోసూచీ (ఐక్యు-ఇంటెలిజెన్స్ కోషంట్)పై చెడు ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనం తేల్చింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కో (యుసిఎస్‌ఎఫ్) అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన మెటాఅనాలసిస్ సర్వే చేపట్టింది. అగ్నిజ్వాలలను నిరోధించేందుకు వాడే ద్రావకాల్లో అత్యధికంగా పోలిబ్రొమినేటెడ్ డిఫినెల్ ఎథెర్స్ (పిబిడిఇ) ఆనవాళ్లు కనిపించాయి. ఇది పిల్లల మేథస్సుపై దుష్ప్రభావం చూపిస్తున్నట్లు ఆ సర్వే తేల్చింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అధ్యయనంలోని ఫలితాన్ని విశే్లషించారు. దాదాపు 3వేల తల్లీపిల్లల జంటలను పరిశీలించి వివరాలను విశే్లషించారు. ప్రతి పది జంటలలోని తల్లులలో పిబిడిఇ లెవెల్స్ పెరగడం, పిల్లల్లో 3.7 శాతం మేర ఐక్యు లెవెల్స్ తగ్గడాన్ని వారు గుర్తించారు. ఒక్కో కేసు ప్రాతిపదికగా చూస్తే ఈ తగ్గుదలపై ఆందోళన అనవసరం. కానీ మూడువేల జంటల ప్రాతిపదికగా ప్రపంచంలో పరిస్థితిని అంచనావేస్తే మాత్రం ఇది ప్రమాదకర పరిణామమేనన్నది శాస్తవ్రేత్తల భావన. ఫర్నిచర్ పరిరక్షణకు, అందం కోసం వాడే రసాయనాల ప్రభావం తల్లులపై, ముఖ్యంగా గర్భిణులపై ఎక్కువగా ఉంటోంది. దానివల్ల పుట్టే పిల్లల మేథస్సుపై ప్రభావం పడుతోంది. దీనివల్ల కలిగే అనర్థాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తాయి అని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ జులీన్ లామ్ చెబుతున్నారు. భవన నిర్మాణంలో వాడే ఇతర రసాయనాలు వీటికి తోడైతే మరింత చెడు జరుగుతుందని ప్రొఫెసర్ ట్రేసీ వుడ్ఫ్ హెచ్చరిస్తున్నారు. నిజానికి పిబిడిఇ ప్రభావం, ఎడిహెచ్‌డి (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటి డిజార్డర్)కు పరస్పరం సంబంధం ఉన్నాయన్న విషయాన్ని ఈ అధ్యయనం సందర్భంగా శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనల ఫలితాలు ఓ హెచ్చరికను పంపాయని, ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగడం మంచిదని సూచించారు. పర్యావరణ పరంగా ఆరోగ్య పరిరక్షణ కోసం విధివిధానాలు రూపొందిస్తున్న బాధ్యతాయుత వర్గాలు తమ పరిశోధనల ఫలితాలను గమనించాలని ఆమె కోరారు. పర్యావరణ, ఆరోగ్య విషయాలపై దుష్ప్రభావం చూపే రసాయనాలను నిషేధించాల్సిన అవసరాన్ని తమ పరిశోధన నొక్కి చెబుతోందని వారు అంటున్నారు. ద జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్‌స్పెక్టివ్స్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.