ఐడియా

ఉద్యానవనం.. చిన్నారి రణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరికి వారికంటూ కొన్ని ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడకు వెళితే ఓ పట్టాన వదలి రాలేరు. అలాగే ఏడేళ్ల నవ్యాసింగ్‌కు కూడా పార్క్ అంటే ప్రాణం. అక్కడకు వెళ్లిందంటే ఆ చిన్నారికి ఆకలిదప్పులు తెలియవు. ఈ లోకాన్ని మరిచిపోయి ఆడుకుంటుంది. అక్కడకు వచ్చే ఎంతోమంది తన ఈడు పిల్లల్ని స్నేహితులుగా చేసుకుని అలసిపోయేవరకు ఆటలాడుతూనే ఉంటుంది. ప్రతిరోజూ వచ్చినట్లే ఆరోజు కూడా ఆ చిన్నారి పార్క్‌కు వచ్చింది. అయితే లోపలికి అనుమతించలేదు. పార్క్ అంతా ఇసుక, సిమెంట్, బుల్‌డోజర్లు, యంత్రాలతో నిండిపోయింది. ఎందుకంటే ఆ పార్క్ తీసేసి అక్కడ కమ్యూనిటీ హాలు కట్టాలని స్థానిక ప్రభుత్వ అధికారులు సమాయత్తమవుతున్నారు. విషయం తెలియడంతో ఆ చిన్నారి మనసు చివుక్కుమంది. రోజూ పొద్దుట, సాయంత్రం వచ్చి ఇక్కడ నేస్తాలతో ఆటలాడుకోవటం కుదరదా? ఇక ఇక్కడి పచ్చటి చెట్లు పలుకరించవా? అని వాపోయింది. ఏదో ఒకటి చేయాలి. ఈ పార్క్‌ను కాపాడుకోవాలి. ఏలా? అని ఆలోచించింది. అంతే పెన్ను, పేపర్ తీసుకుని తనకు వచ్చిన పదాలతో తన మనసులోని భావాలను ఆ పేపర్‌పై రాసింది. ఆ లెటర్‌ను ఎవరికీ పోస్టు చేయాలి? అనే ఆలోచనలో పడింది. ఆ చిన్నారికి రోజూ టీవీలో కనిపించే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుర్తొచ్చారు. ఆయనకు ఆ లేఖ పంపితే ఏమన్నా ప్రయోజనం ఉండవచ్చని భావించి ఆ లెటర్‌పై ప్రధానిమంత్రి అడ్రస్సు రాసింది. పచ్చటి పార్క్ లేక ఆ చిన్నారి పడుతున్న వేదన, చిన్నబోయిన మనసును గ్రహించిన ఆమె తండ్రి కూడా స్పందించాడు. తన బిడ్డకు బాసటగా నిలిచాడు. ఆయన లాయర్ అవ్వటంతో ఆయన తన కుమార్తె తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయదేవత వెంటనే కరుణించింది. వెంటనే భవన నిర్మాణ పనులు ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. మీరు పన్నులు కట్టని ఎగవేతదారులతో వ్యవహరించినట్లు వ్యవహరిస్తారా? పార్క్ అంటే పార్కే. తక్షణమే పనులు ఆపేయండి అని ఆ న్యాయస్థానం హుంకరించింది. వెంటనే అధికారులు బుల్‌డోజర్లు, యంత్రాలను తీసేశారు. చిన్నారి నవ్యాసింగ్ గంతులు వేస్తూ వచ్చి తన స్నేహితులతో ఆ పార్క్‌లో ప్రస్తుతం ఆడుకుంటుంది. ఇంతకూ ఈ పార్క్ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? దేశ రాజధాని పశ్చిమ ఢిల్లీలో, నవ్యాసింగ్ ఇంటికి సమీపంలోని రోహిణి ప్రాంతంలో ఉంది. ఇలా ఓ చిన్నారి చేసిన న్యాయ పోరాటం వల్ల పచ్చటి పార్క్ పిల్లలతో నేడు కళకళలాడుతోంది. చెట్లపైకి చిన్న చిన్న పక్షులు వచ్చి కిలకిలారావాలు చేస్తున్నాయి. పచ్చటి చెట్ల స్థానంలో తిష్టవేసిన బుల్‌డోజర్లు, ఇతర యంత్రాలు పనిచేయకుండా ఆగిపోయాయి.

మోదీకి రాసిన లేఖ సారాంశం ఇదీ

మోదీ అంకుల్,
‘మీకు రోజుకు వెయ్యి ఉత్తరాలు వస్తుంటాయట. నువ్వు ఈ లెటర్ చదివే తీరిక లేకపోతే నా ఆవేదన వినండి. నేను ప్రతిరోజూ నా స్నేహితులను కలిసి ఇక్కడ ఆడుకుంటాను. ఈ పార్క్ అంటే ఎంతో ఇష్టం. ఇది మా లైఫ్‌లైన్. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడకు సమీపంలోనే మా ఇల్లు ఉంది. ఇక్కడి చెట్ల నుంచి చల్లటి గాలి వీస్తుంది. మాకు సాయం చేయండి. మా పార్క్‌ను కాపాడండి.’