Others

శే్వతార్క గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కార్యంలోనూ తొలిపూజలందుకునే దైవం, విఘ్ననాశకుడు శ్రీవినాయకుడు. ఈయనకి 64 రూపాలున్నాయంటారు. వాటిలో 32 రూపాలు ముఖ్యమైనవని, మళ్లీ అందులో షోడశరూపాలు అతి ముఖ్యమైనవని చెబుతారు. వీటిలో శే్వతార్కగణపతిని ఎక్కడా చెప్పకపోయినా తెల్ల జిల్లేడు వక్షాలు 100 సంవత్సరములపైన వున్నట్లయితే వాటి మూలంలో గణపతి ఆకారం తయారవుతుందని ప్రశస్తి. అయితే ఇలాంటి గణపతి రూపం దొరకటం దుర్లభమని పెద్దలు చెబుతారు. గణపతి నవరాత్రుల ఉత్సవాలలో గణపతికి ప్రత్యేకంగా శే్వతార్క పత్రంతో చేసే పూజ గురించి మన గ్రంథాలలో కూడా ప్రస్తావన వుంది. ఈ శే్వతార్క గణపతి ఆరాధనతో సర్వగ్రహ దోష నివారణ అవుతుంది అని పండితులు చెపుతూ ఉంటారు. చాలామంది తెల్లజిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శే్వతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్రం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా వున్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. శే్వతార్క మూలానికి వశీకరణశక్తి వుంటుంది. ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవు నెయ్యి గోరోజనంలో శే్వతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థిస్తూ నుదుటిమీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది. కేతుగ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శేతార్క గణపతిని పూజించాలి. శే్వతార్క గణపతిని పూజా గృహంలో పెట్టుకుని దాని ముందు ప్రతిరోజూ ఓ గం గణపతియే నమః అని ఒక జపమాల జపించడంవల్ల జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ధన ధాన్య సుఖ సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. దారిద్య్ర నివారణకు తరుణోపాయం శేతార్క గణపతి జీవితంలో సర్వతోముఖాభివృద్ధికోసం దిగువ చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం ఒక జపమాల చేయాలి.
గణపతి రూపాలు 64 ఉండగా అందులో ముఖ్యమైనవి 32 ఉన్నాయని, అందులో షోడశ రూపాల గణపతులకు అత్యంత ప్రాధాన్యత ఉందని పురాణాల్లో చెప్పబడి ఉంది. పైన చెప్పిన రూపాల్లో శే్వతార్క గణపతిని గూర్చి స్పష్టంగా ఎక్కడా కనబడదు. ఏ చెట్టు వేరులైనా పాములవలె, తొండములవలె కనిపిస్తాయో, అలా కనిపించే ప్రతి వేరు శే్వతార్క మూల గణపతి కాదని అంటారు. అయితే తెల్లజిల్లేడు చెట్టు గొప్పతనం గణపతి ఉపనిషత్‌లో చెప్పినట్లుగా ‘త్వం మూలధారేస్థితోసినిత్యం’ అన్నట్లుగా సహజ సిద్ధంగా ఉండే చెట్టు, గణపతి ఆకృతిలో అన్ని అవయములతో తయారుకావడం ఒక గొప్ప విశేషం. హనుమంతుని విషయంలో కూడా పారిజాత తరుమూల వాసితం అంటారు కదా. అంటే ఆంజనేయస్వామి వారి ఆకృతి పారిజాత (పూలు) చెట్టు మూలంలో లభ్యమవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా మర్రిచెట్టులో శివుడు, రావిచెట్టులో విష్ణువు నివశిస్తాడని అంటారు. ‘సాధనాత్ సాధ్యతే సర్వం’ అన్నట్టు ఏకాగ్రతతో భగవత్ విశ్వాసంతో చేసే పని ఎప్పుడూ వృధా కాదని పెద్దలంటుంటారు.
‘ఓం నమో విఘ్న హరాయ గం గణపతియే నమః’

-తరిగొప్పుల విల్లెన్ మూర్తి