అక్కడా.. కింగ్ ఖానే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల జాబితాలో కింగ్‌ఖాన్ షారూఖ్‌కు చోటుదక్కింది. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన జాబితాలో ముగ్గురు భారతీయ నటులకు చోటు లభించడం గమనార్హం. ఈ జాబితాలో ట్రాన్స్‌ఫార్మర్ హీరో వార్క్‌వాల్ బెర్గ్ తొలి స్థానంలో ఉన్నాడు. తాజా చిత్రానికి రెమ్యునరేషన్ భారీగా అందడంతో వాల్‌బర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో తొలిస్థానం నిలుపుకున్నాడు. ఇక రూ.243 కోట్ల సంపాదనతో షారుఖ్‌ఖాన్ ఎనిమిదో స్థానంలో, రూ.237 కోట్లు సంపాదనతో తొమ్మిదో స్థానంలో సల్మాన్‌ఖాన్ రూ.227 కోట్ల (35.5 మిలియన్ డాలర్లు) ఆదాయంతో అక్షయ్ కుమార్ పదవ స్థానంలో వున్నట్లు వెల్లడించారు. ఈ జాబితాలో అమీర్‌ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో ది రాక్ జాన్సన్ 65 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో నిలవగా, విన్‌డీసెల్, ఆడం సాండ్లర్, జాకీచాన్‌లు టాప్ 5లో వుండగా, రాబర్ట్ టౌనీ జూనియర్, టాంక్రూస్ తదితరులకూ స్థానం లభించింది.