పర్ఫెక్షన్ సాధిస్తున్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఓవైపు కమర్షియల్ సినిమాలతో మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు ధనుష్. దక్షిణాదిలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ బాలీవుడ్‌లో కూడా తన హవాను చాటాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం విఐపి-2. ఇంతకు ముందు వచ్చిన రఘువరన్ బిటెక్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. ధనుష్ భార్య సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో ధనుష్‌తో ఇంటర్వ్యూ

* రఘువరన్ హిట్టవడంవల్ల ఈ చిత్రాన్ని తెలుగులో చేస్తున్నారా?
- అవును. రఘువరన్ బిటెక్ చిత్రం తెలుగులో ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాతో నాకు తెలుగులో చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. అందుకే విఐపి-2ను తెలుగులో స్ట్రయిట్ సినిమాగా చేసాం.
* విడుదల ఆలస్యమైంది ఎందుకు?
- రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాలవల్ల తెలుగు సినిమా ఆలస్యమైంది. తమిళంలో ఆగస్టు 11న డేట్ దాటితే మంచి రిలీజ్ డేట్ లేదని అక్కడ విడుదల చేసాం. తెలుగులో 25న వస్తోంది.
* విఐపి-2లో ప్రత్యేకతలు ఏమిటి?
- ఈ సినిమాలో నా పాత్ర, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ, మాస్ ఎలిమెంట్లు రఘువరన్ చిత్రంలో వున్నట్టుగానే వుంటాయి. ఇందులో నేను కాజల్‌ను ప్రొఫెషనల్‌గా ఎలా ఎదర్కొన్నామనేది అసలు పాయింట్.
* దర్శకురాలిగా సౌందర్య ఎందుకు?
- స్క్రిప్టు పూర్తయిన తర్వాత ఎలా మొదలుపెట్టాలని ఆలోచనలో వున్నప్పుడు నిర్మాత ధానుకు మరో సినిమా చేయాల్సి వుంది. అందుకే సౌందర్య అయితే బెటర్ అని ఆలోచించి ఆమెతో చేయించాం. సౌందర్య ఆలోచనలు కూడా గ్రాండ్‌గా వుంటాయి. సినిమా కూడా చక్కగా తెరకెక్కించింది.
* కాజోల్ గురించి?
- ఈ చిత్రంలో కాజోల్ పాత్ర కొత్తగా వుంటుంది. ఈ పాత్రకోసం చాలామందిని అనుకున్నాం కానీ ఆమె అయితేనే బెటర్ అని అనుకున్నాం. కాజోల్ అద్భుతంగా నటించింది.
* సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసారు? అక్కడ ప రిస్థితులు ఎలా వున్నాయి?
- నేను ఎలా పనిచేస్తున్నానో సినిమా చేసేవాళ్లు ఎలా చేస్తున్నారు అనేది ఎక్కడైనా తేడా చూపిస్తుంది. బాలీవుడ్‌నుండి నేను పర్‌ఫెక్షన్ ఎలావుంటుందో నేర్చుకున్నాను.
* ఖాళీ సమయాల్లో?
- నాకు పనిచేయడమే రిలాక్సేషన్. ఎప్పుడూ పని చేస్తుంటాను. చిన్న పిల్లలకు ఆడుకోవడం ఎలాగో నాకు పని చేయడం అలాగే. పనిని ఎంజాయి చేస్తా.

-శ్రీ