ఫోకస్

కాలయాపనకే ఉద్యోగ ప్రకటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ముందుగా హామీ ఇచ్చేది నిరుద్యోగులకే. ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు భరోసా ఇస్తారు. అధికారంలోకి రాగానే బడ్జెట్ సమస్య, నోటిఫికేషన్లు, ఆదాయ వనరులు అంటూ దాటేస్తుంటారు. దీంతో కొంత కాలయాపన జరుగుతుంది. ప్రభుత్వానికి వెసులుబాటు అవుతుంది. మళ్లీ నిరుద్యోగులు ప్రభుత్వంపై తిరగబడే ఆందోళనలు, ధర్నాలు, నిరశనలు వెల్లువెత్తగానే ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రకటన చేస్తోంది. దీంతో ప్రభుత్వం హుటాహుటిన ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఏవో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇదిలావుంటే ఖాళీ పోస్టుల స్థానే భర్తీ చేయాలని ప్రభుత్వంలోని ఒక పాలకవర్గం యోచిస్తుండగానే, కొత్త పోస్టులకు ప్రతిపాదనలు సిద్ధమవుతుంటాయి. దీంతో పాత ఖాళీలు భర్తీ కావు.. కొత్త నియామకాలు జరగవు. దీంతో నిరుద్యోగ యువత ఉద్యోగం దొరక్కా, కొత్త నియామకాలకు వయస్సు అర్హత దాటిపోతోందని ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుతం మాత్రం ఉద్యోగ ప్రకటనలు కేవలం కాలయాపనలతోనే సరిపెట్టుకుంటోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలి. కొత్త పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి.. పక్షం రోజుల్లోనే నియామకాలు చేపడితే బాగుంటుంది. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు, కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నామని, లక్ష ఉద్యోగాలంటూ ఒకసారి. 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశామని మరోసారి ప్రకటిస్తుందే.. తప్ప అమలులో కాలయాపన చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చూపుతున్న శ్రద్ధ, ఉపాధి అవకాశాలపై కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.

-పాండు రంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు