ఫోకస్

యువతకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా కనిపించడం లేదు. ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాల కల్పన తదితర హామీలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కేసింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంతవరకూ నిరుద్యోగ భృతి అమలు చేయలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. ఇంటింటికీ ఉద్యోగమన్నారు, చివరకు ఉన్న ఉద్యోగాలను కూడా రద్దు చేస్తున్నారు. ఫీల్డ్ సహాయకులు, అంగన్‌వాడీ వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఉపాధి సిబ్బంది తదితరులందరినీ తొలగించి జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో టిడిపి కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తుండడం విచారకరం. గత ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలనే ఇప్పుడు అమలుచేస్తూ పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారు. కనీసం వీటికి కూడా సరిగా నిధుల మంజూరు కావడం లేదు. ఇతర దేశాలనుంచి పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేస్తున్నామంటూ తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలుతప్ప వాస్తవంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎటువంటి ప్రయోజనం ఇంతవరకూ కలగలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో చేసిన అయిదు వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. దేశంలోనే పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా సర్వేల్లో చెప్పుకోవడం మినహాయించి ఇంతవరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎంతమందికి ఉద్యోగాలు కేటాయించింది శే్వతపత్రం విడుదల చేయాలి. అదే విధంగా ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్న వేల కొలది ఖాళీలను భర్తీచేసే విషయంలో ప్రభుత్వం సరైన చొరవ చూపడం లేదు. ఏదో కొన్ని ఖాళీలను మాత్రమే భర్తీ చేసేలా నోటిఫికేషన్లు విడుదల చేయడం, అవికూడా నత్తనడకలా సాగడం చూస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు ఇపుడు ఆచరణలో కనిపించడం లేదు. పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచడం సంతోషదాయకం అయినప్పటికీ, ఈ వర్తింపు ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే, వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు