ఫోకస్

కాలపరిమితి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగ నియామకాల్లో కాలపరిమితి లక్ష్యంగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. దీనివల్ల జాప్యం నివారించవచ్చు. పైగా తప్పుడు తడకలకు తావులేకుండా, సాంకేతికపరమైన లోపాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు జారీచేయాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లు జారీచేసే సమయంలో పాల్పడిన తప్పిదాలవల్ల అనేక మందికి అన్యాయం జరిగింది. 1999లో జారీచేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ ఆ తర్వాత ఇదే కేటగిరీ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏదైనా ఉత్తమ విధానాలను పాటించాలి. పారదర్శకత ఉండాలి. జవాబుదారీతనంతో వ్యవహరించాలి. సకాలంలో ఫలితాలు ఇవ్వాలి. న్యాయపరమైన వివాదాలు చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేమి ఖర్మోగాని మన రాష్ట్రాల్లో ప్రతి నోటిఫికేషన్ వివాదమవుతోంది. ఏదో ఒక తప్పు దొర్లుతోంది. దానిని పట్టుకుని అభ్యర్థులు న్యాయం చేయమని కోర్టుకు వెళతారు. దీంతో ఏళ్లతరబడి ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో యువకులు వృద్ధులవుతున్నారు. యుపిఎస్‌సిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యుపిఎస్‌సి ప్రతి ఏడాది వేలాది ఉద్యోగాలు వివిధ కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నిర్ణీత కాలపరిమితి లోపల వీటిని భర్తీచేస్తుంది. పారదర్శకతతో లోపాలకు తావులేని పరీక్షా విధానాలు అమలవుతున్నాయి. కేంద్రం ఇచ్చే సహకారం కూడా ఎక్కువ. అదే మన రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుల నియామకాల మొదలుకుని అన్నీ రాజకీయాలే. పైగా ప్రతి నోటిఫికేషన్‌లో సాంకేతికపరమైన తప్పులు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ‘బాబు వస్తే జాబు వస్తుంద’న్నారు. ఇంతవరకు ఏపి పబ్లిక్ సర్వీసు కమిషన్ ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది? అలాగే ప్రభుత్వం కూడా ఆర్భాటపు ప్రకటనలు మానివేసి ఆర్థిక శాఖద్వారా పోస్టుల పెండింగ్ లేకుండా అనుమతి ఇచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. పరీక్షా విధానంలో జటిలమైన ప్రక్రియలు వద్దు. పైగా మన రాష్ట్రాల్లో 371డి అమలులో ఉంది. జిల్లా కేడర్, జోనల్ కేడర్, రాష్ట్ర కేడర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. దీనికి ఆరు సూత్రాల పథకాన్ని జోడించారు. వీటిని అర్థం చేసుకుని న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. రాజధాని అంటే ఫ్రీ జోనా లేక ఏదో ఒక జోన్‌లో భాగమా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

- ఎస్ సలాం అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం