ఫోకస్

నిరుద్యోగాన్ని తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రభుత్వమైన ఆ ప్రాంతంలో ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యావకాశాలు పెంపొందుతున్న తరుణంలో ఉపాధి అవకాశాలు కూడా ఆ మేరకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అయితే నేడు ఉన్నత చదువులు అభ్యసించిన యువత కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగం కావాలన్న పట్టుదలతో ఇతర రంగాలవైపు దృష్టి సారించడం లేదు. అందువల్ల చదివిన చదువుకు, ఉద్యోగానికి సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు గుమస్తా ఉద్యోగాలకు, ఇతర ఉద్యోగాలకు పరుగులు తీస్తున్నారు. దానివల్ల వారి మేథా సంపత్తి వృథా అవుతోంది. యువత తమ టాలెంట్‌ను ఉపయోగించుకొని ఆయా రంగాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత డిఎస్సీద్వారా పదివేల ఉద్యోగాలను భర్తీ చేశారు. నేడు ప్రభుత్వం నిరుద్యోగాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల భర్తీ చేయలేకపోయినప్పటికీ, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత డిఎస్సీ ద్వారా 10వేల ఉద్యోగాలను భర్తీ చేయడం గమనార్హం. దాంతోపాటు ఎపిపిఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాము. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాము. ఆ విధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను కొత్త కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇనె్వస్టర్ల సదస్సులు నిర్వహించి విదేశీ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి తద్వారా మన రాష్ట్రంలో పెద్దతరహా పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నాము. తద్వారా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు చర్యలు చేపట్టాము. మరోపక్క మైదాన, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లోని యువతకు కూడా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఈ విధంగా ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

- మీసాల గీత చైర్మన్, మహిళా, శిశు సంక్షేమ శాసన సభ కమిటీ