ఫోకస్

హామీలను అమలుచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని ఏ ఒక్కరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. గత మూడున్నర సంవత్సరాల్లో ఉద్యోగుల పక్షపాతిగా ప్రభుత్వం అనేక మంచి నిర్ణయాలు తీసుకుంది. అన్ని సమస్యలనూ పరిష్కరించింది. ఉద్యోగులకు ఇటీవల ఒక డిఏ ఇచ్చాం. త్వరలో మరో డిఏ ఇవ్వనున్నట్టు ప్రకటించాం. ఇందుకు ఉద్యోగులు కూడా సమ్మతించారు. సుమారు 10నుండి 15వేల కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు వివిధ రూపాల్లో బెనిఫిట్స్ ఇచ్చాం. మొత్తం 21 రకాల ప్రయోజనాలను ఈ మూడున్నర సంవత్సరాల్లో ఉద్యోగులు పొందారు. దురదృష్టవశాత్తూ ఉద్యోగుల్లో అభద్రాభావాన్ని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు! అలాగే అర్చకులు, దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగులను ప్రతిపక్ష నేతలు తాజాగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా, క్యాబినేట్‌లో చర్చ జరుగుతుంది. ఏదైనా అంశంపై జివోలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇందులో తప్పుడు ప్రచారాలకు ఆస్కారం లేదు. రహస్యంగా ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగని ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ ఒక్క నిర్ణయం తీసుకోదు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. ఉద్యోగులకు వైద్యారోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. తప్పుడు ప్రచారాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ నమ్మరు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఉద్యోగులకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి.

-యనమల రామకృష్ణుడు ఏపి ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి