ఫోకస్

ఉద్యోగాలు వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ జారీ చేస్తే 1.2 లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో పెద్ద వింతేముంది అనుకోవచ్చు.. కాని దరఖాస్తుదారుల్లో ఇంజనీరింగ్ చేసినవారు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఉండటంతో సమాజంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉందో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఐదు పది పోస్టులకు సైతం లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. రోజురోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉందితప్ప తగ్గడం లేదు. దానికి కారణం కొత్తగా చదువులు పూర్తిచేసి పట్టాలతో జాబ్ మార్కెట్‌లోకి వస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. లభిస్తున్న ఉద్యోగాలు వేలల్లో ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కోటి ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇవ్వగా, రెండు తెలుగు రాష్ట్రాలూ ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ హామీలు ఏమయ్యాయో అందరికీ తెలిసింది. మూడేళ్ల తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షించారు. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదని, ఉపాధి అవకాశాలను మెండుగాపెంచే కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పగా, తెలంగాణలో మరో 85వేల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని, తద్వారా ఇచ్చిన హామీకు మించి లక్షకుపైగా పోస్టులను భర్తీచేసిన రికార్డు దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీపైనే ఎక్కువ దృష్టి సారించారు. నిరుద్యోగులు కోరుకుంటున్నది ఉద్యోగాలు కావాలనే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది కూడా ఉద్యోగ ఖాళీల భర్తీపైనే. రెండూ ఒకటే అయినా ఏదో అగాథం. ఖాళీలు చకచకా భర్తీ కావడం లేదు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలు ఉంటే ప్రతి మూడు నెలలకూ, ఆరు నెలలకూ గణాంకాలతోసహా నిరుద్యోగాన్ని బట్టబయలు చేసేవి. గత రెండు దశాబ్దాలుగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల్లో తమ చదువులను రిజిస్టర్ చేసుకోవడం లేదు. ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన సమాజం తర్వాత నైపుణ్యం అవసరం లేని వృత్తులకు మళ్లింది. తర్వాతర్వాత అవకాశాలు పెరగడం, పారిశ్రామిక ప్రగతి జరగడంతో నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం, నైపుణ్యలేమి ఉద్యోగాలు వచ్చాయి. గత 20 ఏళ్లుగా సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఒక్కసారిగా భారతదేశ దిశ-దశ మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగం వైపు చూడటం మానేసి నేరుగా ఐటి రంగంపైనే ఎక్కువ మంది దృష్టి పెట్టారు. అక్కడా స్తబ్దత రావడంతో మళ్లీ అంతా ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సౌకర్యాలు, సౌలభ్యత, తీరిక, మరే ప్రైవేటు ఉద్యోగంలోనూ లభించవు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.