సంపాదకీయం

నైతిక బాధ్యత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేశ్ ప్రభు రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడడం ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల నైతిక బాధ్యతా నిర్వహణ సూత్రానికి మరో నిదర్శనం. గతంలో 1960వ దశకంలో తమిళనాడులోని ఒక వంతెన వరద నీటికి కొట్టుకునిపోవడంతో ఘోరమైన రైలు ప్రమాదం జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సందర్భంగా అప్పటి రైల్వేమంత్రి- ఆ తరువాత ప్రధానమంత్రి అయిన -లాల్‌బహదూర్ శాస్ర్తీ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి పదవీ త్యాగం చేశాడు! ఇనే్నళ్ల తరువాత ఈ నైతిక బాధ్యతను వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి సురేశ్ ప్రభు సంసిద్ధుడు కావడానికి నేపథ్యం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదాలు! అజాంగఢ్ జిల్లాలోని అరియా సమీపంలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం పట్టాలు తప్పడంతో అనేక బోగీలు బోల్తాపడ్డాయి. డెబ్బయి నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. మిగిలిన ప్రయాణీకులు సురక్షితంగా బయటపడడం, క్షతగాత్రులు కోలుకుంటుండం దైవ ఘటన! కానీ, మూడు రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల రైలు ప్రమాదాలు జరగడం రైల్వేలను ఆవహించి ఉన్న నిర్లక్ష్య రుగ్మతకు మరో నిదర్శనం! బుధవారం నాటి ప్రమాదం తరువాత సురేశ్ ప్రభు రాజీనామాకు సంసిద్ధుడయ్యాడన్న సమాచారం ప్రచారం అవుతున్న సమయంలోనే ‘రైళ్ల నిర్వహణ మండలి’-రైల్వేబోర్డు-కి అశ్వనీ లోహానీ అన్న కొత్త అధ్యక్షుడు నియుక్తుడు కావడం సమాంతర పరిణామం! గత శనివారం పంతొమ్మిదవ తేదీనాడు జరిగిన ఘోర ప్రమాదం తరువాత ప్రభుత్వం చేపట్టిన యంత్రాంగ ప్రక్షాళన కార్యక్రమంలో ఈ అధ్యక్ష నియామకం భా గం కావచ్చు! ముజఫర్‌నగర్ సమీపంలోని ‘క తౌలీ’ వద్ద ఉత్కళ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ప ద్నాలుగు బోగీలు పట్టాలపైనుంచి పడిపోవడం లో ఇరవై ఇద్దరు మరణించారు. నూట యాబయికి పైగా ప్రయాణీకులు క్షతగాత్రులు కావడం ఆ ప్రమాద తీవ్రతకు నిదర్శనం. ఇలా రైలు ప్రమాదాలు జరిగిపోతునే వుండడం రైలు వ్యవస్థను ఆవహించిన రుగ్మతకు కారణం! ఈ ‘రుగ్మత’కు నైతిక బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా సురేశ్ ప్రభు లాల్‌బహదూర్ శాస్ర్తీ హయాం నాటి నైతిక బాధ్యతా సూత్రాన్ని మరోసారి గుర్తు చేయగలిగాడు. ఎందుకంటే నైతిక బాధ్యత సూత్రాన్ని ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మరిచిపోయిన తరువాత దశాబ్దులు గడిచిపోయాయి. ఈ ‘మరపు’ కేవలం రైల్వేలకు, రైల్వే మంత్రిత్వ విభాగానికి పరిమితం అయి ఉండలేదు. రకరకాల నైతిక బాధ్యతలను వివిధ అధికార రాజకీయవేత్తలు పట్టించుకొనకపోవడం ఇటీవలి చరిత్ర! రాష్టమ్రంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చివరికి ప్రధానమంత్రులు సైతం నైతిక బాధ్యతను విస్మరించడం దశాబ్దుల చరిత్ర..
నైతిక బాధ్యతను వహించిన సురేశ్ ప్రభు రాజీనామా చేసినప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన వైదొలగడానికి సమ్మతిస్తాడా? అన్నది కుతూహలగ్రస్తులను ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం! ఘోరం జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు పదవుల నుంచి వైదొలగిపోవడం వల్ల తక్షణం లోపాలు తొలగిపోవు! దీర్ఘకాలం తరువాత కూడ లోపాలు తొలగకపోవచ్చు! అందువల్ల ప్రమాదాలు జరిగిన తరువాత మంత్రులు రాజీనామా చేయడం కంటే ప్రమాదాలు జరగని రీతిలో భద్రతను, పనితీరును, యంత్రాంగ ప్రవృత్తిని, వ్యవస్థను మెరుగుపరచడానికి వలసిన చర్యలు తీసుకోవడం ప్రధానం! అవినీతి, లైంగిక బీభత్సం, వ్యూహ బద్ధమైన నేరాలు, దేశ భద్రతను ఛిద్రం చేస్తున్న ప్రచ్ఛన్న,ప్రత్యక్ష ఉగ్రవాదం వంటివి పునరావృత్తం కాకుండా నిరోధించడం ప్రధానం. మంత్రులు వైదొలగడం పరిష్కారం కాజాలదు! అందువల్ల నైతిక బాధ్యతను వహించడం ఎందుకు? అన్న ప్రశ్న మన రాజ్యాంగ వ్యవస్థను దశాబ్దులుగా వేధిస్తునే ఉంది. ఆయా మంత్రిత్వ విభాగాల్లో జరిగే తప్పులకు, కిందిస్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యానికి, అవినీతికి అక్రమాలకు ఆయా మంత్రిత్వ శాఖల అధిపతులు ప్రత్యక్షంగా బాధ్యులు కారు! అందువల్లనే నైతిక బాధ్యత సూత్రం ప్రజాస్వామ్య సంప్రదాయం అయింది. బాధ్యులు కానివారు సమస్య తీవ్రతను ప్రజల దృష్టికి తేవడానికి మాత్రమే ‘నైతిక బాధ్యత’ దోహదం చేస్తుంది. ఇలా నైతిక బాధ్యతను వహించి అమాత్యాదులు పదవీ పరిత్యాగం చేయడం వల్ల సంచలనం కలుగుతుంది, సమస్యను పరిష్కరించడానికి చర్యలు అనివార్యం కావడం ఈ సంచలనానికి పరాకాష్ఠ!
అందువల్ల మాత్రమే నైతిక బాధ్యతను మం త్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు నైతిక బాధ్యతను వహించాలన్నది ప్రజాస్వామ్య సంప్రదాయం. ఈ సంప్రదాయం 1960వ దశకంలోనే భంగపడింది. 1990వ దశకంలో ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర రంగ ఆర్థిక సంస్థలలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి అప్పటి ఆర్థిక మంత్రి మన్‌మోహన్ సింగ్ పదవికి రాజీనామా చేశాడట! కానీ అప్పటి ప్ర ధాని పి.వి. నరసింహారావు ఆ రాజీనామాను తిరస్కరించాడు. తిరస్కరించడం, ఆమోదించ డం వేరే సంగతి. కానీ ధైర్యంగా బాధ్యతను అంగీకరించి పదవీ త్యా గపత్రం సమర్పించడం నైతికత! 2013లో బొగ్గు బొరియల కేటాయింపు అవినీతికి సంబంధించిన ‘దస్త్రాలు’ కొన్ని ప్రధాన మంత్రి కార్యాలయం-పిఎమ్‌ఓ-నుంచి అదృశ్యమైపోయా యి. దొంగలు ఆ దస్త్రాల-ఫైళ్ల-ను ఎత్తుకునిపోయారా? లేక ‘గుండ్రాయికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్...’ అని ఒక కవి అన్నట్టుగా దస్త్రాలకు కాళ్లు వచ్చి అవి బయటికి వెళ్లిపోయాయా? అన్నవి ప్రశ్నలు.. సమాధానం ఎప్పటికీ రాదు, కానీ నైతిక బాధ్యతను వహించడానికి తప్పును ఒప్పుకొనడానికి అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ సిద్ధపడలేదు.. ఇరవై ఏళ్లలో వచ్చిన ‘నైతిక బాధ్యతా రహిత పరివర్తన’ అది! 1962లో చైనా మన దేశంపై దురాక్రమణ జరపడానికి కారణం అంతకు పూర్వం ఏళ్ల తరబడి మన ప్రభుత్వం అవలంబించిన విధాన వైఫల్యం! కానీ ఈ విధాన వైఫల్య బాధ్యత తనదని 1962నాటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించలేదు. ‘నైతిక బాధ్యత స్వీకరించే’ సంప్రదాయం అప్పుడే భంగపడింది!
ఇలా ఏళ్ల తరబడి విస్మృతికి గురి అయిన ‘నైతిక బాధ్యత’ను సురేశ్ ప్రభు మళ్లీ గుర్తించడం మంచి మార్పు. కానీ రైలు ప్రమాదాలు ఇలా వరసగా ఎందుకు జరిగిపోతున్నాయన్నది అంతుపట్టని వ్యవహారం, రైలు పట్టాలను ఆవహించి ఉన్న రుగ్మత తొలగడం లేదు. ఈ విషయమై అధ్యయనం జరగాలి, పరిశోధన జరగాలి. పట్టాలు తప్పని రైళ్లు నిరంతరం నడవడానికి మార్గం అనే్వషించాలి! ఈ అనే్వషణ ఎప్పుడు మొదలవుతుంది?