బిజినెస్

బ్యాంకుల విలీనానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఏర్పాటులో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల వేగవంతానికి ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థను నెలకొల్పాలని బుధవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సాయంపై ఆధారపడకుండా నిధులను సమీకరించుకునేలా ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడానికి, వృద్ధిపథంలో వెళ్తున్న దేశ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర కేబినెట్ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది.