బిజినెస్

బ్యాంకింగ్ షేర్లు తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. దీంతో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.26 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.21 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.70 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 1.67 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.29 శాతం, ఫెడరల్ బ్యాంక్ 1.19 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంక్ 1.08 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ షేర్ల విలువా పెరిగింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 276.16 పాయింట్లు పుంజుకుని 31,568.01 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 86.95 పాయింట్లు అందుకుని 9,852.50 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలూ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అమెరికా మార్కెట్ ఫ్రెండ్లీ పన్ను సంస్కరణలపై ఆశాభావంతో అటు ఐరోపా, ఇటు ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. ఇకపోతే సంక్షోభం నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడిలో ఉన్న ఇన్ఫోసిస్ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. బిఎస్‌ఇలో 1.98 శాతం, ఎన్‌ఎస్‌ఇలోనూ 1.98 శాతం మేర పెరిగింది. దీంతో సెనె్సక్స్ టాప్-10 సంస్థల మార్కెట్ విలువలోకి మళ్లీ ఇన్ఫోసిస్ చేరింది.