అంతర్జాతీయం

స్పెయిన్‌లో భారీ దాడులకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్: గత వారం స్పెయిన్‌లో భయోత్పాతాన్ని సృష్టించిన ఉగ్రవాద ముఠా దాడులపై దర్యాప్తును పోలీసులు మరింత విస్తృతం చేశారు. మరింత భారీ దాడిలో బార్సిలోనాలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన కట్టడాలపై దాడి చేయాలని జిహిదీలు పథకం వేసుకొన్నట్లు ఈ దాడుల్లో పట్టుబడిన అనుమానితుడు కోర్టులో చెప్పడంతో పోలీసులు తమ దర్యాప్తును మరింత విస్తృతం చేశారు. గత వారం బార్సిలోనాలో రద్దీగా ఉండే లాస్ రాంబ్లాస్ బౌలెవార్డ్ ప్రాంతంలో, అలాగే రిసార్ట్ పట్టణం కాంబ్రిల్స్‌లో పాదచారులను వాహనాలతో ఢీకొట్టిన సంఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా, దాడులు జరిపిన ఉగ్రవాదుల నెట్‌వర్క్ మూలాలను వెలికి తీయడం కోసం దర్యాప్తు అధికారులు మంగళవారం రాత్రి తాజాగా మరిన్ని దాడులు జరిపారు. ఈ దాడులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేసిన అనుమానితుల్లో ఎక్కువ మంది మొరాకో దేశస్థులే ఉన్నారు.
జిహాదీలు ఎంత పెద్దఎత్తున దాడులు చేయాలనుకున్నారో మంగళవారం జరిగిన ప్రాథమిక కోర్టు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బాంబులతో బార్సిలోనాలోని చారిత్రక కట్టడాలను పేల్చి వేయాలని తమ ముఠా పథకం రూపొందించుకొన్నట్లు ఈ దాడులకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన మహమ్మద్ హౌలి చెమ్లాల్ (21) జడ్జికి చెప్పాడు. ఆల్కనార్ పట్టణంలో జరిపిన దాడుల్లో ఒక ఇంట్లో కనీసం 500 లీటర్ల అసిటోన్, పెద్ద మొత్తంలో మేకులు, డెటోనేటర్లు లాంటి పేలుడు పదార్థాలు దొరికినట్లు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. గత వారం జరిపిన దాడులను తమ సంస్థకు చెందిన సైనికులే జరిపారని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు జరగడానికి ఒక రోజు ముందు ఆల్కనార్‌లో ఒక బాంబుల ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా ఈ ముఠా తన పథకాన్ని మార్చుకుని వాహనాలతో జనాన్ని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజంతా విచారించిన తర్వాత కోర్టు చెమ్లాల్‌తోపాటుగా మరో అనుమానితుడు ద్రిస్ ఔకబిర్ (28) పోలీసు కస్టడీకి అప్పగించగా, మహమ్మద్ ఆల్లా అనే మరో నిందితుడిని బలమైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా షరతులపై విడుదల చేశారు. మరో నిందితుడిని రిమాండ్‌కు పంపించాలా అనే విషయంపై మూడు రోజుల తర్వాత నిర్ణయం చెబుతానని జడ్జి తెలిపారు.