జాతీయ వార్తలు

తగ్గని అన్నాడిఎంకె సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో అధికార అన్నాడిఎంకెలో చీలిక వర్గాలు విలీనం అయినా సమస్య మాత్రం తీరలేదు. శశికళ వర్గానికి చెందిన టిటివి దినకరన్ పార్టీపై పట్టుసాధించేందుకు నలుగురు మంత్రులపై వేటు వేశారు. ఈ నలుగురినీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటించిన ఆయన తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను పుదుచ్ఛేరిలోని ఓ రిసార్టులోనే కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్ధకం చేసే రీతిలో దినకరన్ చర్యలు సాగుతున్నాయి. మరోపక్క రంగంలోకి దిగిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అన్నాడిఎంకె సర్కార్ బలపరీక్షను ఎదుర్కోవల్సిందేనని డిమాండ్ చేసింది. ఇప్పటికే డిఎంకె ఇందుకు సంబంధించిన డిమాండ్‌పై పట్టుబడుతోంది. 22 మంది అన్నాడిఎంకె శాసన సభ్యులు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు ఎలాంటి విశ్వాసం లేదని గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లేఖను అందించిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. 234 మంది సభ్యులుగల తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడిఎంకె బలం 134. కాగా పార్టీపై ఇంకా శశికళకే పట్టుఉందని స్పష్టం చేసిన దినకరన్ ముఖ్యమంత్రి పళని ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి కొనసాగే హక్కులేదని, సిఎం పదవి నుంచి ఆయన తప్పుకోవల్సిందేనని తంజావూర్ జిల్లాలోని కుంభకోణంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. తాజా పరిణామాలతో నిమిత్తం లేకుండా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ శతవార్షికోత్సవాల్లో నిమగ్నమయ్యారు.
చిత్రం.. బుధవారం తిరుచ్చిలోని బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని సందర్శించిన
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం