జాతీయ వార్తలు

శశికళకు సుప్రీం షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ గత మే నెలలో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ‘ఇందులో తమ తీర్పును పునః సమీక్షించాల్సిన యోగ్యతలేవీ లేవు’ అని పేర్కొంది. అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను విచారణ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించడంతో మిగిలిన నిందితులకు విముక్తి కలిగించాలంటూ శశికళ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌లో తీర్పును పునః సమీక్షించాల్సిన యోగ్యతలేవీ లేవని సుప్రీంకోర్టు కొట్టివేసింది.