ఆంధ్రప్రదేశ్‌

మంత్రి గంటాకు నాన్‌బెయలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి: ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాలేదనే ఆగ్రహంతో జిల్లామంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీచేస్తూ అనకాపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అనకాపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటిన్ జడ్జి జెవిఎస్ సత్యనారాయణ బుధవారం ఈ తీర్పు చెబుతూ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2009 సంవత్సరం ఎన్నికల్లో అనకాపల్లి నుండి ప్రజారాజ్యం పార్టీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు యువకులకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై కోర్టులో అప్పటి నుండి కేసు నడుస్తోంది. పలుసార్లు మంత్రి గంటాకు ఈ విషయమై కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినా స్పందన కానరాలేదు. దీంతో మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేస్తూ రెండవ అదనపు మెట్రోపాలిటిన్ జడ్జి సత్యనారాయణ తీర్పు చెప్పారు.