తెలంగాణ

కెసిఆర్ సర్కార్‌పై చర్య తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అఖిలపక్ష నేతలు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అఖిలపక్ష నేతలు, టిజెఎసి నేతలు సీపీఐ నేత డి.రాజా నేతృత్వంలో బుధవారం నాడు రాష్టప్రతిని కలిశారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ సిపిఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, కాంగ్రెస్ నాయకులు సంపత్‌కుమార్, గూడూరు నారాయణ రెడ్డి తదితరులు రాష్టప్రతిని కలిసిన వారిలో ఉన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందని, నేరెళ్ల ఘటనలో దళితులపై దాడులు, ధర్నాచౌక్ ఎత్తివేత వంటి అంశాలను వారు రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఇసుక దందాలపై ప్రశ్నించిన దళితులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని రాష్టప్రతికి వివరించినట్టు తెలిపారు. ప్రభుత్వం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందనడానికి నేరెళ్ల ఘటన ఉదాహరణ అని విమర్శించారు. నేరెళ్ల బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జోక్య చేసుకోవాలని రాష్టప్రతిని కోరినట్టు తెలిపారు. ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మభ్యపెడుతున్నారన్నారు. తాము చేసిన విజ్ఞప్తులకు రాష్టప్రతి సానుకులంగా స్పందించారని అఖిలపక్ష నేతలు తెలిపారు.