తెలంగాణ

ఏసిబి వలలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఈదెం బాపూజి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారన్న అభియోగాలపై ఏసిబి అధికారులు ఫుడ్ ఇన్స్‌పెక్టర్ బాపూజి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారాకానగర్‌లోని ఇంటితో సహ అతని బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. అదేవిధంగా ఆహార భద్రత, ప్రమాణాల కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. రికార్డులను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 5 కోట్ల అక్రమ అస్థులు కలిగివున్నట్టు ఏసిబి డైరెక్టర్ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న బాపూజీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్ బాపూజీ ఒక విల్లా, ఒక ఫ్లాట్, రెండు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్టు ఏసిబి అధికారులు గుర్తించారు.
అదేవిధంగా హైదరాబాద్‌లోని బండ్లగూడలో రూ.1.20 కోట్లు విలువచేసే విల్లా, సోమాజిగూడలో రూ. 10.25 లక్షలు విలువచేసే ఒక ఫ్లాట్, హయత్‌నగర్‌లో రూ. 2.44 లక్షలు విలువచేసే రెండు ఓపెన్ ప్లాట్లు, రూ.12.84లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, రూ. 2.04లక్షల నగదుతోపాటు రూ.8.80 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 2.91 లక్షలు విలువచేసే గృహోపకరణ వస్తువులు, రూ. 8.50 లక్షలు విలువచేసే ఫోర్డ్ కారు, రూ.0.45 లక్షల విలువచేసే హీరో హోండా టూ వీలర్‌ను సీజ్ చేశారు. ఇవి మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 5 కోట్ల ఆస్థులు అక్రమ ఆస్థులు కలిగివున్నట్టుగా ఏసిబి అధికారులు గుర్తించినట్టు ఏసిబి డైరెక్టర్ వివరించారు.