తెలంగాణ

90లక్షల ఎకరాల్లో పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 90లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వర్షపాతం సాధారణం కంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విత్తనాలు వేసిన భూముల్లో పంటలు బాగానే ఎదుగుదలకు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 82శాతం విస్తీర్ణంలో వేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. పంటలు పండేందుకు మరో రెండు నెలల సమయం ఉండటంతో ఈ సమయంలో నాలుగైదు సార్లు భారీ వర్షం కురిస్తే ఉత్పత్తి బాగానే అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు.
జూన్ ఒకటి నుండి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 527 మిల్లీమీటర్లు కాగా వాస్తవంగా 461 మిల్లీమీటర్లు నమోదైంది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం (728 మిల్లీమీటర్లు) నమోదుకాగా, నాగర్‌కర్నూలు జిల్లాలో అతితక్కువ వర్షపాతం (240 మిల్లీమీటర్లు) నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ (అర్బన్) జిల్లాల్లో పూర్తిస్థాయిలో విత్తనాలు వేయగా, మేడ్చల్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ, యాదాద్రి, వరంగల్ (రూరల్), జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 75 శాతంపైగా విస్తీర్ణంలో పంటలు వేశారు. మంచిర్యాల జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో అంటే 50 శాతం విస్తీర్ణంలోగా వేశారు. మిగతా జిల్లాలైన వనపర్తి, గద్వాల, సూర్యాపేట జయశంకర్, ఖమ్మం, జగిత్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 51 శాతంపైగా విస్తీర్ణంలో పంటలు వేశారు.
ఈ పర్యాయం పత్తిపంట 45 లక్షల ఎకరాల్లో వేశారు. గత ఏడాది పత్తి విస్తీర్ణం 20 లక్షల ఎకరాలలోపే ఉంది. గత ఏడాది పత్తి పంట వేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో పత్తి విస్తీర్ణం తగింది. పత్తికి గత ఏడాది మంచి ధర రావడంతో రైతులు మళ్లీ ఈ ఏడు అధిక విస్తీర్ణంలో పత్తివేశారు. పసుపు కూడా దాదాపు 94 శాతం విస్తీర్ణలో అంటే 1.20 లక్షల ఎకరాల్లో వేశారు. ఇప్పటి వరకు వరినాట్లు 15 లక్షల ఎకరాల్లో పూర్తికాగా, మరో 9 లక్షల ఎకరాల్లో నాట్లువేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వరిమినహా మిగతా ఆహార ధాన్యాలు 12 లక్షల ఎకరాల్లో (82 శాతం) వేయగా, పప్పుదినుసులు 10 లక్షల ఎకరాల్లో వేశారు. నూనె విత్తనాలు ఏడున్నర లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా, ఐదులక్షల ఎకరాల్లో వేశారు.
వినాయక చవితి నుండి మూడు రోజుల పాటు తెలంగాణలోనా చాలా పాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల తుపాను ద్రోణి ఏర్పడి ఉండటం వల్ల ఈ ప్రభావం శుక్రవారం నుండి తెలంగాణలో ఉంటుందని వెల్లడించారు.
గత 24 గంటల్లో మిర్యాలగూడ, రామన్నపేట, కొనిజర్ల (ఖమ్మం) ప్రాంతాల్లో నాలుగేసి సెంటమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.