తెలంగాణ

పట్టణాభివృద్ధిలో మహిళలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పట్టణాభివృద్ధిలో మహిళల పాత్రను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో (మెప్మా) పని చేస్తున్న రిసోర్స్ పర్సన్స్, కమ్యూనిటీ ఆఫీసర్లతో మంత్రి కెటిఆర్ బుధవారం ముఖాముఖి నిర్వహించారు. పట్టణాల్లో నివసిస్తున్న పేదల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన కార్యక్రమాలపై రిసోర్స్ పర్సన్‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ కిట్లు, హరితహారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితం తదితర కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు తెన్నూలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్త సేకరణ కార్యక్రమానికి పట్టణ ప్రజలను చేతన్యం చేయడంలో మెప్మా కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాక్సినేషన్, పౌష్టికాహారం, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలన్నారు. దశాబ్దకాలంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేస్తున్న తమకు అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారని మెప్మా ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి వేతనాలు పెంచడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.