హైదరాబాద్

ఎప్పుడు ఎక్కడ ఉంటారో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆన్‌లైన్ సేవలు, ఆధునిక సంస్కరణల్లో ముందున్నామని ప్రకటించుకునే జిహెచ్‌ఎంసిలోని కొందరు అధికారులు ఇంకా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నందు వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. పైగా కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాలు, అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ముఖ్యంగా కోటి మంది జనాభా కలిగిన నగర వాసులు ప్రతిరోజు వివిధ పనులపై జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం మొదలుకుని జోన్లు, సర్కిల్ ఆఫీసులకు వస్తుంటారు. కానీ ఏ పనిపై వచ్చినా వారు చెప్పులరిగేలా ప్రదక్షిణలు చేయక తప్పటం లేదు. ముఖ్యంగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు.. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రత్యేక వేళలు అంటూ ఏమీ లేకపోవటం, పైగా ఒక పదవిలో కొనసాగుతున్న అధికారులకు అదనపు బాధ్యతలుగా మరో పోస్టును కట్టబెట్టడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. పరిపాలన విభాగంలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన రామకృష్ణారావు జూన్ మాసం చివరితో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఈ స్థానంలో శంకరయ్య అదనపు కమిషనర్‌గా వచ్చారు. కానీ ఇటీవల జరిగిన పలు మార్పుల కారణంగా ఆయనకు నార్త్‌జోన్ అదనపు జోనల్‌గా కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి ఆయన కేవలం నార్త్‌జోన్‌కే పరిమితమయ్యారని, ప్రధాన కార్యాలయంలో పరిపాలన వ్యవహారాలను సక్రమంగా పర్యవేక్షించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ప్రతిరోజు కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్మిక నేతలు ఈ విభాగానికే వస్తుంటారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత రావల్సిన ప్రయోజనాలు, బదిలీలు, ఇతరత్రా పరిపాలన వ్యవహారాలు, సమస్యల పరిష్కారం కోసం తామెన్నిసార్లు వచ్చినా ఈ విభాగం అదనపు కమిషనర్ అందుబాటులో ఉండటం లేదన్న కొందరు వాదిస్తున్నారు. ఇటీవల సర్కిల్ 10లో అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్ సైతం సెలవులపై వెళ్లారు. ఆయన స్థానంలో సర్కిల్ 9 అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్ భార్గవ నారాయణకు ఇన్‌చార్జి ఏఎంవోహెచ్‌గా బాధ్యతలు అప్పగించటంతో ఆయన సర్కిల్ 10 కూడా చూడాల్సి ఉంది. బల్దియా విధుల్లోనే అతి ముఖ్యమైన పారిశుద్ధ్య పనులను తెల్లవారుఝము నుంచే పర్యవేక్షించటంతో పాటు సర్కిల్ పరిధిలో వ్యాపార సంస్థల తనిఖీలు, బర్త్, డెత్ సర్ట్ఫికెట్లను జారీ చేయటం ఈ ఏఎంవోహెచ్‌ల విధుల్లో ముఖ్యమైనవి. వీటిలో ప్రతిరోజు వందలాది మంది బర్త్, డెత్ సర్ట్ఫికెట్ల కోసం ఏఎంవోహెచ్‌ల కార్యాలయాలకు ఎంతోమంది వస్తుంటారు. ఒకే అధికారి రెండు సర్కిళ్లలో విధులు నిర్వహిస్తుండటంతో ఆయన ఎప్పుడు ఏ సర్కిల్‌లో అందుబాటులో ఉంటారో ఆయనకే తెలియాలి. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫోన్లు సమకూర్చినా, అందులో ప్రజల కాల్‌కు స్పందించే అధికారుల సంఖ్య చాలా తక్కువే.. చిన్నచిన్న పనులపై ఆఫీసులకు వచ్చే సామాన్యుల సమస్యలను గుర్తించి, అధికారులు నిర్ణీత వేళల్లో, నిర్ణీత ఆఫీసులో అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.