భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.సత్యశ్రీ, ఏలూరు (ప.గో)
ప్ర: మాకు అడవివరంలోని సింహాచల దేవస్థాన భూమి అయిన పుట్టింటివారి ఆస్తి ఎప్పుడు అమ్మకం కాగలదు?
సమా: మీ ప్రశ్నలో స్పష్టత లేదు. ఓ వైపు దేవస్థానం భూమి అంటున్నారు- పుట్టింటి ఆస్తి అంటున్నారు. దేవస్థానం భూమి ప్రైవేటు ఆస్తి ఎలా అవుతుంది? అమ్మే అధికారం ఎలా ఉంటుంది. అందులోనూ పుట్టింటివారిది అంటున్నారు. అన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దానికి సమాధానం ఇవ్వలేను. అయితే మీరు చెప్పిన సంఖ్య ప్రకారం కొన్ని సంతాన మూలకమైన శుభాలు జరిగే అవకాశం ఉంది- నవంబర్‌లో.
సి.జయరాం, హబ్సిగూడ, హైదరాబాద్
ప్ర: ఋణబాధలు తీరి స్వగృహ యోగం ఉన్నదా?
సమా: ముందు ఋణబాధలనుండి విముక్తి పొందండి. దానికిగాను ప్రతి మంగళవారం ఋణవిమోచన అంగారక వ్రతం పదకొండు వారాలు చేయండి. అనుకూల ఫలితాలు కలుగుతాయి.
సి.శైలజ, విజయనగరం (ఆంధ్రప్రదేశ్)
ప్ర: గురువుగారూ! మా అమ్మాయి బి.టెక్ చదివింది. పెళ్లి చేశాము. ఇప్పుడు పెళ్లి ఎందుకు చేశామా అని విచారిస్తున్నాము. అమ్మాయికి సివిల్స్ వ్రాయాలని ఉంది. అత్తింటివారి సహకారం లేదు. ప్యూచర్ గురించి భయపడుతోంది.
సమా: పెళ్లి ఎందుకు చేసామా అని మీరు విచారించడం న్యాయం కాదు. పెళ్లి చేయటం మీ కర్తవ్యం. మీ ధర్మం మీరు చేశారు. పెళ్లయిన తరువాత అత్తింటివారి ఇష్టప్రకారం నడచుకోవడమే మంచిది. అనవసరంగా ఆమెలో మీరు ఆశలు రేకెత్తిస్తున్నారు. ఆ విధంగా ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. పైచదువులు చదవాలా వద్దా అనేది ఆమె భర్త- ఆమె నిర్ణయించుకుంటారు. మీరు జోక్యం చేసుకోకండి. మీ ఆర్థిక సమస్యలకూ ఆవిడ చదువుకూ ఏ మాత్రం సంబంధంలేదు.
ఆర్.శ్యామల, విజయనగరం (ఆంధ్ర)
ప్ర: గురువుగారూ! నమస్కారం- నా పేరు మీద ఉన్న ఇల్లు అమ్మకం త్వరగా కాగలదా?
సమా: ఇల్లు మీ పేరుమీద ఉంటే ఉండవచ్చు! కాని దానిపైన మీకు పూర్తి స్వాతంత్య్రం ఉన్నట్టు కన్పించటంలేదు. మరికొందరి ప్రమేయం కూడా బలంగా ఉండి వారి సహకారం లభిస్తే కాగలదు.
సిహెచ్.బసవ పున్నారావు, హరిపురికాలనీ (హైదరాబాద్)
ప్ర: ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?
సమా: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీరు నగదు డబ్బుకు సంబంధించిన వృత్తిలోనే ఉన్నట్టు సూచిస్తోంది. బహుశా లావాదేవీల వ్యాపారం అయి వుండాలి. కొరత అంటూ మీకేమీ ఉన్నట్టు లేదు. కోరికల గుఱ్ఱాలకు కళ్ళెం వేసుకోండి.
బి.శివసాయి, నెల్లూరు (ఆంధ్ర)
ప్ర: భార్యాభర్తలమధ్య మనస్పర్థలు. 5 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నాం. కలిసే అవకాశం ఉన్నదా?
సమా: మీ ఇరువురి గొడవలకు కారణం కొన్ని స్థిరాస్తి వ్యవహారాలు కాని- మరికొందరి ప్రమేయం కాని కనపడుతోంది. స్థిర సంకల్పంతో స్వతంత్రమైన ఆలోచనతో ప్రయత్నించండి. ప్రమేయానికి కారకులు అటువైపు వారు కూడా కావచ్చు. కలహానికైనా కాపురానికైనా నాలుగు చేతులు కలిస్తేనే జరిగేది- ఆశాభావంతో ప్రయత్నించండి.
గంటి ఉదయభాస్కర్, కొత్తపేట, హైదరాబాద్
ప్ర: వివాహం ఎప్పుడు- ప్రభుత్వోద్యోగం ఉందా? పరిష్కారాలు చెప్పండి.
సమా: మీకు ఫలితంమీద ఉన్న తొందర ప్రయత్నంమీద ఉన్నట్టు లేదు. అందుకే సంఖ్య వ్రాయటం మరచిపోయారు.
పేరు లేదు, చిరునామా లేదు
ప్ర: విషయం చాలా సున్నితం...ఎం చేయాలి?
సమా: ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కష్టం. ‘శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కరావలంబన స్తోత్రం చదువుకొని వడపప్పు పానకం నివేదన చేయండి- ప్రతిరోజూ అలా 40 రోజులు.
టి.నాగసాయిశ్రీదుర్గ, చీరాల (ప్రకాశం)
ప్ర: మానసిక స్థిరత్వం లేదు. భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. నాకు ప్రభుత్వోద్యోగం లభిస్తుందా, దయచేసి చెప్పండి.
సమా: ముందు మానసిక స్థిరత్వం కలగటానికి భవిష్యత్తు ఆందోళన తగ్గటానికి. ప్రతిరోజూ ఆంజనేయస్వామి గుడికి వెళ్లి 54 ప్రదక్షిణాలు చేసి అరటిపండ్లు- తేనె నివేదన చేయండి. చీమలకు బియ్యపు పిండి వేయండి. మీ జాతకం బాగానే ఉంది. భవిష్యత్తు చక్కగా ఉంటుంది.
పి.కిరణ్‌కుమార్, బరంపురం (ఒడిస్సా)
ప్ర: నాకు ఈ డిసెంబర్‌లోపు ధన ప్రాప్తి యోగం ఉన్నదా?
సమా: మీరు ఆశించినంత లభించే అవకాశం లేదు. రాబడి కన్నా పోబడి (ఖర్చు) ఎక్కువగా ఉంది. పొదుపు పాటించండి!
కె.వి.ఎన్.మూర్తి (నాగంపేట)- పెద్దాపురం (తూ.గో.)
ప్ర: గౌ శర్మగారూ! నమస్కారం! మీరు సూచించిన విధానం- సలహా- నాకు బాగా ఉపకరించింది. ధన్యవాదాలు. సంకల్పిత కార్యం జయప్రదంగా మొదలైంది. పరిపూర్తికోసం ఆశీర్వదించండి.
సమా: విజయోస్తు- శుభమస్తు- నిర్విఘ్నమస్తు ఇత్యాశీః
బండి నాగరాజు, అరకువేలి, విశాఖపట్నం
ప్ర: నాకు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వస్తుందా? నేను దివ్యాంగుణ్ణి-
సమా: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రిగారు దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వీలయితే గౌ ప్రధానమంత్రిగారికే విజ్ఞప్తి దరఖాస్తు చేయండి. ఊరికే దీనంగా వేడుకోవడం మానేయండి.
డి.దీపిక, మదనపల్లి (చిత్తూరు)
ప్ర: శర్మగారూ! మా ఇంట్లో పులిపైన సవారీ చేస్తున్న దుర్గాదేవి విగ్రహం ఉంది. మా స్నేహితురాలు ఉండకూడదు అంటుంది. ఏం చేయమంటారు.
సమా: పిడికిలికంటే చిన్నగా ఉండాలి. దాన్ని ప్రతిమ అనాలి. విగ్రహం కాదు. ప్రతిమలు కనుముక్కు తీరు బాగా ఉంటే ఇంట్లో ఉండటం మంచిదే.
కొటికలపూడి మధుసూదన్‌రావు,
నాగారం, నిజామాబాద్ (తెలంగాణ)
ప్ర: శరీరాయాసం- నడవలేను- వ్యాధి తగ్గుతుందా?
సమా: భవిష్యకాలానికి సంబంధించిన ప్రధానాంశం సంఖ్య- అది మీరు వ్రాయలేదు. ఇప్పుడు నేను కేవలం మీ జన్మ తేదీ ఆధారంగా అంచనా వేస్తున్నాను. మీకు మోకాళ్ళు- హృదయం బలహీన స్థానాలు. కొంచెం బి.పి కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకు ప్రశాంతతను అలవరచుకోండి. వీలయితే ఏదైనా దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి. హోమియోలో బరైటాకార్బ్, కార్బోలెజ్ అనేవి వృద్ధులకు అనుకూలం. డాక్టర్ సలహాతో వాడండి. శుభం భవతు-
పి.కరుణాదేవి, వేణుగోపాలనగర్, అనంతపురం
ప్ర: ఏ వ్యాపారం యోగిస్తుంది.
సమా: స్వగృహ ఫుడ్స్- ఫాస్ట్ఫుడ్-కాటరింగ్ వంటివి యోగిస్తాయి.
క్రొవ్విడి బాలాత్రిపురసుందరి, సజ్జాపురం, తణుకు
ప్ర: మాకు వచ్చే వాటా అమ్మి తణుకులో అపార్ట్‌మెంట్ కొనగలనా?
సమా: వాటా అమ్మే విషయంలో ఆలస్యమూ- అభ్యంతరాలూ చోటుచేసుకుంటాయి. ఫలితం అనుమానమే.
డి.లక్ష్మి, అనకాపల్లి, విశాఖపట్నం
ప్ర: ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు..పరిష్కారం?
సమా: అనారోగ్యం హృదయ స్థానం-కంఠం క్రింది భాగం- జలస్థానంలో పడిన సందర్భాలూ కనబడుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి నానబోసిన ఐదు శనగ గింజలను ప్రొద్దునే్న తినండి. ఆర్థికంగా ఇతరుల సహకారం కావాలి.
వై.శ్యాంసుందర్, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: వివాహం- ఆర్థిక సమస్యలు..పరిష్కారం ఎపుడు?
సమా: వివాహానికి మీ వయస్సు ప్రతిబంధకంగా వుంది. సరియైన వయస్సులో స్పందించలేదు. ఆర్థిక సమస్యలకు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి- స్వగృహ ఫుడ్స్ వంటివి.
పోతరాజు రామన్న, రామన్నపేట, యాదాద్రి (తెలంగాణ)
ప్ర: ఋణబాధలు తీరుతాయా? ఉద్యోగయోగం?
సమా: అనాలోచితంగా ఋణం చేసి ఉంటారు. ప్రతి మంగళవారం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి వడపప్పు - పానకం సమర్పించండి.
జె.వి.ఎన్.ఎల్.శాండిల్య, విజయవాడ (కృష్ణా)
ప్ర: చాలా కోరికలు ఉన్నాయ. అభివృద్ధి ఎలా?
సమా: మీ జీవనోపాధి మద్రాసు వైపు అభివృద్ధికరంగా సాగగలదు.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

- ‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ