ఆటాపోటీ

డాడ్జిబాల్ రికార్డు.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*కాలిఫోర్నియాలోని యుసి ఇర్విన్ కాలేజీ డాడ్జిబాల్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒకే స్టేడియంలో 4,488 మంది విద్యార్థులు రెండు జట్లుగా విడిపోయి, 1,000 బంతులతో డాడ్జిబాల్ గేమ్ ఆడి, ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతకు ముందు రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్‌లోని డాడ్జిబాల్ క్లబ్ 2,138 మందితో సృష్టించిన రికార్డును ఇర్విన్ కాలేజీ బద్దలు చేసింది.

ఓవర్‌కు 17 బంతులు!
* ఒక ఓవర్‌కు ఆరు బంతులే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, 2004 ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ సమీ ఏకంగా 17 బంతులు వేశాడు. 11 ఎక్‌స్ట్రాస్‌లో ఏడు వైడ్స్‌కాగా, నాలుగు నోబాల్స్. ఆ ఓవర్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ హబీబుల్ బషీర్, రజిన్ సలే 22 పరుగులు సాధించారు.

ఫైన్‌తో స్వాగతం
* ఫ్రెంచ్ యువ ఆటగాడు బెంజమిన్ మెండేకు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కాంట్రాక్టు దొరికింది. 52 మిలియన్ డాలర్ల భారీ ఆఫర్‌ను సంపాదించి, అట్టహాసంగా కొత్త క్లబ్‌కు తరలివెళ్లిన అతనికి అక్కడ చుక్కెదురైంది. 2.5 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే తన ఫెరారీ కారును నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపినందుకు పోలీసులు అతనికి జరిమానా విధించారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని చెప్పినా వినిపించుకోలేదు. చట్టం ఎవరికైనా ఒకటే అంటూ ఓ పోలీస్ అధికారి చలానా రాసి అతని చేతిలో పెట్టాడు.
బంతి వేయకుండానే..
* ఒక్క బంతి కూడా వేయకుండానే ఎనిమిది పరుగులు సమర్పించుకున్న ఘనత పాకిస్తాన్ స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్‌కు దక్కుతుంది. అంటే, అతను బౌలింగ్ చేయలేదని అర్థం కాదు.. కానీ, అతను వేసిన మొదటి మూడు బంతులు బౌన్సర్స్ కావడంతో అంపైర్ వాటిని నోబాల్స్‌గా ప్రకటించి, నిబంధనల ప్రకారం అతనిని బౌలింగ్ నుంచి తప్పించాడు. 2014 ఆసియా కప్ చాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు నిబంధనలకు విరుద్ధమైన బంతులు వేసిన అబ్దుర్ రెహ్మాన్ ఎనిమిది పరుగులిచ్చాడు. దీనితో అతని బౌలింగ్ విశే్లషణ 0-0-8-0గా నమోదైంది.

- సత్య