ఆటాపోటీ

రాజీలేని క్వాలిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుఎస్ ఓపెన్‌లో నాణ్యతకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. టోర్నీలో సుమారు 70,000 బంతులను వాడతారు. ఈ విధంగా ఆటకు ఎంపిక చేసిన ప్రతి బంతినీ ముందుగానే నిశితంగా పరీక్షిస్తారు. సుమారు 100 అంగుళాల ఎత్తు నుంచి పడేసినప్పుడు ఆ బంతి భూమికి తగిలి, 53 నుంచి 58 అంగుళాల ఎత్తుకు ఎగరాలి. అంటే దాని బౌన్స్ సుమారు సగం ఉండాలి. ఆ విధంగా బౌన్స్ అయితేనే దానిని నాణ్యమైన బంతిగా గుర్తిస్తారు. అంతేగాక, ఆకారం నుంచి మన్నిక వరకూ అనేకానేక అంశాలను పరిగణలోకి తీసుకొని బంతులను తయారు చేస్తారు. ఏ మాత్రం తేడా ఉన్నా, ఆ బంతులు చెత్త బుట్టల్లోకి వెళతాయి. ఆరంభంలో బంతులను చర్మంతో తయారు చేసి లోపలి భాగాన్ని ఊలు లేదా వెంట్రుకలతో నింపేవారు. అప్పట్లో ప్రత్యేకించి ఫలానా రంగులో ఉండాలన్న నిబంధన లేదు. ఇప్పుడు బంతులను లేత ఆకుపచ్చ లేదా ముదురు పసుపుపచ్చ రంగులో తయారు చేస్తున్నారు. శర వేగంతో దూసుకొచ్చే బంతులను ఆటగాళ్లు సులభంగా గుర్తించడానికి ఈ రంగును ఎంపిక చేశారు. 1986 సంవత్సరానికి ముందు వింబల్డన్‌లో తెల్ల బంతులను ఉపయోగించేవారు. టీవీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు ఆరంభమైన తర్వాత స్పష్టత కోసం పసుపు లేదా లేత ఆకుపచ్చ బంతులను వాడడం అలవాటైంది. ఇప్పటికీ ఇదే విధంగా కొనసాగుతున్నది.