ఆటాపోటీ

గ్రాండ్ శ్లామ్స్‌లో స్పెషల్ యుఎస్ ఓపెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో చివరిదైన యుఎస్ ఓపెన్ న్యూయార్క్ వేదికగా అభిమానులకు కనువిందు చేసేందు ముస్తాబైంది. సెరెనా విలియమ్స్, మిలోస్ రానిక్ వంటి కొంత మంది స్టార్లు వివిధ కారణాలవల్ల దూరమైనప్పటికీ, చాలా మంది హేమాహేమీలు బరిలో ఉన్నందున మరోసారి హోరాహోరీ త ప్పని పరిస్థితి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపె న్, వింబుల్డన్ ముగియడంతో, సోమవారం నుంచి మొదలయ్యే యుఎస్ ఓపెన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాలుగు టోర్నీల్లో అత్యంత పురాతనమైనది వింబుల్డన్. 1877లో మొదలైన వింబుల్డన్‌ను ఇప్పటికీ అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పరిగణిస్తారు. ఈ జాబితాలో రెండో స్థానం యుఎస్ ఓపెన్‌ది. అమెరికాను టెన్నిస్‌లో సూపర్ పవర్‌గా నిలబెట్టిన ఈ టోర్నమెంట్ 1881లో మొదలైంది. ఆరంభంలో ఇది కేవలం పురుషులకే పరిమితమైనప్పటికీ, 1887 నుంచి మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. కాగా, గ్రాండ్ శ్లామ్స్ లిస్టులో చేరిన మూడో టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్. రొలాండ్ గారోస్ మైదానం వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ 1891లో మొదలైంది. ఇక గ్రాండ్ శ్లామ్స్ జాబితాలో అన్నిటికంటే ఆలస్యంగా మొదలైన టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్. 1905లో ఇది ఆరంభమైంది. మొత్తం మీద సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న యుఎస్ ఓపెన్ ఏడాదిలో చివరగా ముగియడం విశేషం.
యుఎస్ ఓపెన్‌కు ఇప్పుడు న్యూయార్క్ కేంద్రంగా ఉందిగానీ, నిజానికి ఎన్నో ప్రాంతాల్లో తిరిగి చివరికి అక్కడ స్థిరపడింది. దీనిని తొలుత రోడ్స్ ఐలాండ్‌లోని న్యూపోర్ట్‌లో నిర్వహించారు. అక్కడి నుంచి ఇది న్యూయార్క్‌లోని ఫారెస్ట్ హిల్స్ ప్రాంతానికి చేరింది. 1920 దశకంలో మూడేళ్లు ఫిలడెల్ఫియా కేంద్రంగా మ్యాచ్‌లు కొనసాగాయి. కానీ, చివరికి న్యూయార్క్ దీనికి శాశ్వత వేదికైంది. యుఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్, సీనియర్స్, జూనియర్స్, ప్లేయర్స్ ఇన్ వీల్‌చైర్ విభాగాల్లోనూ పోటీలను నిర్వహిస్తారు. అయితే, సింగిల్స్ మ్యాచ్‌లకు ఉన్నంత క్రేజ్ మిగతా విభాగాలకు లేదు.
టై బ్రేక్ ప్రత్యేకం: టెన్నిస్‌లో చాలా టోర్నీలు... చివరికి ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్స్‌లో కూడా చివరి సెట్ అటో ఇటో తేలే వరకూ కొనసాగుతుంది. అందుకే, 2010 వింబుల్డన్‌లో జాన్ ఇస్నర్, నికోలస్ మాహుత్ మ్యాచ్ 11 గంటల 5 నిమిషాలు కొనసాగి, రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. మొదటి నాలుగు సెట్లు 6-4, 3-6, 6-7, 7-6గా నమోదుకాగా, చివరిదైన ఐదో సెట్ 70-68 వద్ద ముగిసింది. వింబుల్డన్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ టై బ్రేకర్ విధానాన్ని అనుసరించరు. అయితే, గ్రాండ్ శ్లామ్స్‌లో టై బ్రేకర్ యుఎస్ ఓపెన్‌లో మాత్రమే అమల్లో ఉంది.
అందరూ ఒకటే: టోర్నీ ఏదైనా, సహజంగా సీడింగ్స్ ప్రకారం పోటీదారులకు మెయిన్ డ్రాలో అర్హత కల్పిస్తారు. టాప్ ర్యాంక్‌లో లేనివారంతా క్వాలిఫయర్స్‌లో ఆడి, దానిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మెయిన్ డ్రాకు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మెయిన్ డ్రాలో మొదటి రౌండ్ నుంచి సెమీస్ వరకూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్‌లోకి అడుగుపెట్టాలి. కానీ, యుఎస్ ఓపెన్‌లో ఒకప్పుడు ఈ విధానం ఉండేదికాదు. డిఫెండింగ్ చాంపియన్ నేరుగా ఫైనల్ ఆడే అవకాశం 1915 వరకూ అమల్లో ఉండేది. అంటే, ఒక ఏడాది టైటిల్ సాధిస్తే, మరుసటి ఏడాది ఒక్క రౌండ్ కూడా ఆడకుండానే ఫైనల్‌లో స్థానం సంపాదించవచ్చు. 1915లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి మిగతా టోర్నీల్లో మాదిరిగానే, యుఎస్ ఓపెన్‌లోనూ క్వాలిఫయర్స్, మెయిన్ డ్రాలో నాలుగు రౌండ్లు పూర్తిచేసి క్వార్టర్ ఫైనల్స్ చేరాలి. అక్కడ గెలిస్తే సెమీస్‌కు, అందులోనూ విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరతారు. ఒకప్పుడు డిఫెండింగ్ చాంపియన్స్‌కు కల్పించిన ప్రత్యేకతలేవీ ఇప్పుడు యుఎస్ ఓపెన్‌లో లేవు.
స్టేడియంలోకి త్వరగా వచ్చి కూర్చున్న వారు టీవీ కవరేజీలో ప్రముఖంగా కనిపిస్తారు. దీనిని గమనించిన అభిమానులు స్టేడియాలకు పరుగులు తీయడం యుఎస్ ఓపెన్‌కు కలిసొచ్చింది. ప్రతి మ్యాచ్‌కీ ప్రేక్షకులు చాలా ముందుగానే రావడం ఈ టోర్నీలో ఆనవాయితీగా మారింది. అందుకే యుఎస్ ఓపెన్‌లో తోపులాటలు, ఘర్షణలు దాదాపుగా కనిపించవు. భద్రతా విషయంలోనూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. స్టేడియంలోకి ఒకొక్కరికీ ఒక్కో బ్యాగ్‌ను మాత్రమే అనుమతిస్తారు. అమెరికాలో ఎంతో ప్రాచుర్యం పొందిన బేస్ బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులు గ్లోవ్స్ తొడుక్కొని వెళ్లవచ్చు. కానీ, యుఎస్ ఓపెన్‌కు టెన్నిస్ ర్యాకెట్‌ను తీసుకెళ్లడం నిషిద్ధం. ఘర్షణలు తలెత్తకుండా, ఒకవేళ చోటు చేసుకున్నా ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు ఇలాంటి పలు నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ టోర్నీకి పిల్లల్ని ఉచితంగానే అనుమతించడం విశేషం. అయితే, వారు తల్లిదండ్రుల ఒళ్లోనే కూర్చోవాలి. వారికి ప్రత్యేకంగా సీట్లను కేటాయించరు.
గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో ఎంతో భి న్నంగా, ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది కాబట్టే యుఎస్ ఓపెన్‌కు అంత క్రేజీ ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు హేమాహేమీలు పో టీపడుతుంటారు. ఇక అమెరికా స్టార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టోర్న మెంట్ ఆరంభం కోసం అటు పోటీదారులు, ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూ స్తున్నారు. 12 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన నొవాక్ జొకోవిచ్, డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా, 2014 ఈవెంట్ ఫైనలిస్టు కెయ్ నిషికోరి గాయాల బారిన పడి టోర్నమెం ట్ నుంచి నిష్క్రమించారు. ప్రపంచ మాజీ నం బర్‌వన్ సెరెనా విలియమ్స్, ఆస్ట్రేలియా ఓపెన్ ను రెండుసార్లు గెల్చుకున్న విక్టోరియా అజరె న్కా కూడా వివిధ కారణాలతో దూరమయ్యా రు. దీనితో పురుషుల విభాగంలో రాఫెల్ నాద ల్, మహిళల విభాగంలో కరోలినా ప్లిస్కోవా టాప్ సీడ్స్‌గా బరిలోకి దిగుతున్నారు. వెరీవెరీ స్పెషల్ ఈవెంటైన యుఎస్ ఓపెన్‌లో ఈసారి విజేతలు ఎవరైనా, మ్యాచ్‌లు మాత్రం ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం.

- బిట్రగుంట