రాజమండ్రి

పసివాడి స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి, సరోజ దంపతులకి కిరణ్మయి అనే

కూతురుండేది. రవి బ్యాంకు అధికారి. ప్రతి

మూడు సంవత్సరాలకి బదిలీ జరిగేది.

ఈసారి ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్‌పూర్

ట్రాన్స్‌ఫర్ అయింది. కూతురు నాలుగో

తరగతే కాబట్టి చదువు గురించిన

దిగుల్లేదు. కానీ అక్కడ ప్రాంతీయంగా

ఒరియా, హిందీ మాట్లాడుతుంటారు.

తెలుగువారున్నారు కానీ ఇలాగే

ట్రాన్స్‌ఫర్‌లపై వచ్చి అక్కడొక్కరు,

ఇక్కడొకరు అన్నట్లుగా తలోవీధిలో

ఉన్నారు. ఇల్లు దొరికింది. ఇంటి వోనర్స్

పంజాబీవాళ్లు. ఉమ్మడి కుటుంబం. పైన

రెండు పోర్షన్స్, కింద రెండు పోర్షన్స్. పై

పోర్షన్‌లో ఓ పక్క వాళ్ల పెద్దకొడుకు, కోడలు,

మనుమడు ఉంటారు. కింద పెద్దవాళ్లు,

రెండో కొడుకు, ఆడపిల్ల ఉంటారు. పై

పోర్షన్‌లో మరో పక్కది రవి వాళ్లకి

అద్దెకిచ్చారు. జాయిన్ అయి వచ్చాక రవి

భార్య, కూతురితో చెప్పాడు. మనం పంజాబీ

వాళ్లున్న లొకాల్టీలో ఉండబోతున్నాం. ఈ

రెండు నెలల్లో హిందీ బాగా నేర్చుకోండి

అంటూ 30 రోజుల్లో హిందీ నేర్చుకో అనే

పుస్తకం కొనిచ్చి వెళ్లారు. ఇక ఆ నెలంతా

తల్లీకూతుళ్లు ఎక్కాలు బట్టీ పట్టినట్టు ఆ

పుస్తకాన్ని బట్టీ పట్టారు. స్కూలు

అడ్మిషన్‌కి వెళితే హిందీ, లోకల్ భాష

ఒరియా కూడా రావాలి అని చెప్పారట.

ఒరియా స్కూల్లో చేర్తేగానీ రాదు. అందుకే

హిందీ అయినా నేర్చుకోవాలనే ప్రయత్నం.
అలా రెండు నెలలకి వెళ్లారు ఆ ఊరుకి.

ఇంటి వాళ్లంతా హిందీలో పరిచయం

చేసుకున్నారు వాళ్లు ఏదైనా హిందీలో

ప్రశ్నిస్తే ఇంగ్లీషులో జవాబులిస్తూ ఓ వారం

గడిపేశారు. బయట తెలుగువాళ్లెవరో కలసి

మీరెవరింట్లో ఉంటున్నారని అడిగితే రవి

వీళ్ల గురించి చెప్పినప్పుడు ‘అదేంటి? మీరు

తిరికూర్చుని దాదాగిరి, సెటిల్‌మెంట్లు చేసే

వాళ్ల ఇళ్లల్లో ఉంటున్నారు. త్వరగా వేరే

ఇల్లు చూసుకొని ఖాళీ చేయండి’ అనేవారు.

దాంతో రవికేం భయం వేయలేదుగానీ

సరోజ మాత్రం భయపడిపోయింది. రవి

బ్యాంక్‌కెళ్లగానే తలుపులేసుకొని

కూర్చునేది.
ఓ రోజు ఇలాగే రవి వెళ్లాక, ఏదో నవల

చదువుతుంటే దబదబ శబ్దాలు, దర్వాజా

ఖోలోనా అంటూ గట్టిగా తలుపులు విరిగేలా

కొట్టి పిలుస్తున్నారు. ఉలిక్కిపడి ఎవరా?

అని కిటికీలో నుండి బయటకు చూసింది.

ముద్దులొలికే మూడేళ్ల బాబు

పిలుస్తున్నాడు. నెమ్మదిగా తీసింది,

గబగబా లోపలకొచ్చాడు ఎత్తుకోమన్నాడు.

‘క్యానాం?’ అడిగింది. ‘ఆషీష్’ అంటూ

ముద్దుగా చెప్పాడు.
కిరణ్మయి దాచుకున్న బొమ్మలన్నీ తీసి

ఆడుకున్నాడు. కాసేపు బిస్కెట్లు అడిగి

మరీ తిన్నాడు. అలా వాళ్ల అమ్మ

పిలిచేదాకా వీళ్లింట్లోనే ఉండి

ఆడుకొంటున్నాడు. అలా ప్రతిరోజూ ఆషు

రావటం, సరోజ ఏక్యాహై ఏక్యాహై, ఓ క్యాహై

అంటూ ఒక్కో వస్తువు, కూరలు,

కిరాణాలను ఆ బుల్లిబాబు ఆషు దగ్గర

నుండి అడిగి తెలుసుకుని నేర్చుకొనేది.

అందుకే ఆ బాబు సరోజ వాళ్లింటి

సభ్యుడైపోయాడు. బజారులోనో, ఏదైనా

తెలుగువాళ్ల గెట్‌టు గెదర్‌కి వెళ్లినప్పుడు,

‘ఇల్లు మారటం ఏమైంది? వేరే

చూసుకొన్నారా?’ అని

స్నేహితులడుగుతుంటే ఈ బుల్లి

స్నేహితుణ్ణి విడిచి వేరే ఇంటికెందుకెళ్లటం?

ఈగురువు గారి ద్వారా ఎనె్నన్ని హిందీ

మాటలొస్తున్నాయో అనుకొనేది సరోజ.

కూతురు కిరణ్ స్కూలుకెళ్లటం,

స్నేహితులతో మాట్లాడటంతో మంచిగా

భాష వచ్చేసింది. ఇక రవికి బ్యాంక్‌లో

జనాలతో, హిందీలో తప్పనిసరిగా

మాట్లాడటం అవసరంతో ఫర్లేదనిపించేలా

ఉంది. ఇక సరోజ ఇంటి పట్టునే ఉండి ఈ

బుల్లిస్నేహితుడికి పులిహోర, పల్లీలు,

బిస్కెట్లు, చిక్కీలిచ్చి, బొమ్మలిచ్చి ఆడిస్తూ,

లాలిస్తూ మాట్లాడిస్తూ పదేపదే పిలుస్తూ

బజారెళ్లినప్పుడు వాడికి మరచిపోకుండా

ఏవో ఒకటి కొని తెస్తూ హిందీ

నేర్చుకుంటోంది. వాడాదెబ్బకి పక్కనే ఉన్న

ఇంటికి కూడా వెళ్లకుండా పగలంతా

వీళ్లింట్లోనే ఉండిపోయేవాడు. వాళ్ల అమ్మో,

నాన్నో వచ్చి మీకు చాలా ఇబ్బందులు

కలిగిస్తున్నాడు. అల్లరి చేస్తున్నాడని ఎనె

్నన్నో ‘సారీ’లు చెప్తూ తీసుకెళ్లేవారు వాణ్ణి.

వాడితోపాటు అప్పుడప్పుడు వాళ్ల

అమ్మవచ్చి తెలుగు వంటలెలా చేయాలో

నేర్చుకుని వెళ్లేది. ఆవిధంగా రెండేళ్లు

భయపెట్టిన వాళ్లకి సమాధానంగా, ఆ ఇల్లు

వదలకుండా ఆ ఊరు నుండి బదిలీ అయ్యి

వచ్చేటప్పుడు రవి, సరోజలకు బట్టలు పెట్టి

దీవెనలందుకొని వాళ్లతో కలసి ఫొటో

తీయించుకుని చెమ్మగిల్లిన కన్నులతో

సాగనంపారు. దాదాపు 25 ఏళ్లయినా హిందీ

నేర్పిన ఆ బుల్లి గురువుని తలచుకొని

నవ్వుకుంటుంది సరోజ. దర్వాజా ఖోలోనా

అంటూ ఇప్పటికీ చెవుల్లో ధన ధన

వినిపించే ఆ శబ్దాలు గుర్తుచేస్తాయి ఆ

పసివాడి స్నేహాన్ని.

- యు. శైలజ