విజయవాడ

ఇద్దరూ అదృష్టవంతులే.. (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భస్కరం గారు చాలా దురదృష్టవంతుడే.

ఆయన నలుపు అని నువ్వు

తిరస్కరించినా నీకంటే చాలా అందమైన

అమృత అతని భార్య అయింది. అతని

అదృష్టం చూసి కన్నుకుట్టిన దేవుడు

యాక్సిడెంట్ రూపంలో అమృతను దూరం

చేశాడాయనకు. ఇద్దరు చిన్నపిల్లలు.

వాళ్లను స్కూల్ నుంచి తీసుకురావటానికి

బయలుదేరి వాళ్లకు దూరమైపోయింది. ఇక

ఆ పిల్లలకు తల్లి లేని లోటు ఎవరు

తీరుస్తారు? కుర్రాళ్లకే పెళ్లిళ్లు కావటం

కష్టమైన ఈ రోజుల్లో రెండో పెళ్లివాడిని ఎవరు

చేసుకుంటారు? ఎవరైనా ఆయాని పెట్టుకొని

పెంచుకుందామంటే పెద్దవయసు వాళ్లు

పిల్లల్ని పెంచలేరు. చిన్న వయస్సు వాళ్లని

పెట్టుకుంటే వెధవ సమాజం నిందలు

వేస్తుంది. ఆయన తల్లి, అత్తగారు కూడా

అనారోగ్యం పాలయ్యారు. పాపం! ఆయన

పిల్లల్ని పెంచటానికి సతమతవౌతున్నాడే!

నీకు తెలిసిన వాళ్లెవరైనా వుంటే కొద్దిగా

ఆయనకు సహాయం చేయవే..’ బాధగా

అంది సుమ.
‘ఎనిమిదేళ్ల క్రితం అందగత్తెననే అహంతో

నలుపంటూ ఆయనను తిరస్కరించినా

ఆయనపై జాలితో కూడిన ప్రేమ నా

మనసులో వుంది. అమృత చనిపోయి

ఆయనంత కష్టాల్లో వున్నారంటే నా గుండె

బరువెక్కింది. నా అందమే నాకు శత్రువైంది.

నామీద ఆశలు పెట్టుకున్న అబ్బాయిలు

నాపై నిందలు వేసి, వచ్చిన ప్రతి పెళ్లి

సంబంధం తప్పిపోయేలా చేశారు. ఇదంతా

భాస్కరం గారిని నొప్పించినందుకు దేవుడు

నాకు వేసిన శిక్షగా భావించాను. ఇప్పుడిక

ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం వచ్చింది.

వెంటనే వెళ్లి తల్లి లేని ఆ పిల్లలకు ఆయాగా

వుంటానని కోరతాను. అమ్మా నాన్న

పోయాక ఇంట్లో వదిన అనే వంకర మాటలు

మనసుని కోసేస్తున్నాయి. అన్నయ్య

నిస్సహాయుడు. నా పరిస్థితి భాస్కరం

గారికి చెప్పవే. ఆయాగా నేనే...’ నసుగుతూ

అన్నాను.
ఆనందంగా చూసింది సుమ. ‘ఆయాగా

ఎందుకే? అమ్మగానే వెళ్లు. అందరూ

నిందలు వేసి నీ జీవితం నాశనం చేశారని

చెప్పగానే భాస్కరం గారు చాలా

బాధపడ్డారు. నీ నిర్ణయం అతని జీవితానికి

మళ్లీ ఆమని తెస్తుందని నాకు పూర్తిగా

నమ్మకముంది’ అంది.
కృతజ్ఞతతో నా కళ్లలో ఆనందబాష్పాలు.
‘ఆయాగా చేరిన దాన్ని అమ్మగా

చేసుకోమని సలహా నేనే ఇస్తా. భాస్కరం

గారు నలుపైనా ఆయన మనసు తెలుపని

నీకు అర్థమైంది కదా. కాబట్టి చాలా తేలిగ్గా..

ఇద్దరిలో అదృష్టవంతులు ఎవరంటే ఇద్దరూ..

అంటానే్నను’ అంది సుమ ఆనందంగా.

- కాశీభొట్ల సరస్వతీదేవి, భద్రాచలం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా