విజయవాడ

ప్రతిఘటన (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా బతుకు
నన్ను బతకనివ్వని దాష్టీకం
నా క్రతువు
నన్ను చేయనీయని దుష్టత్వం
అమాంతం నన్ను మింగుతున్న
ఒకానొక దుర్భర దృశ్యం
కలలన్నీ కల్లలై
కళలన్నీ వెలవెలబోయి
దిష్టిబొమ్మవుతున్న జీవనచిత్రం
రెక్కల్ని విరిచేసి కాళ్లను కట్టేసి
మూతుల్ని కుట్టేసి ముఖాలకు ముసుగేసి
నినదించమంటున్న నియంత పోకడ
అంతా అశాంతి లోకం అంతా ఆగని శోకం
కులసర్పాలు కాటేసి మతవ్ఢ్యౌలు మాటేసి
నన్ను దిగంబరంగా నిలబెడుతున్న దుస్థితి
ఇక్కడ మనిషిగా మరణించిన సన్నివేశం
సమాజం కళ్లప్పగించి చూస్తున్న వికృత

క్రీడ
ఇది వీధి నాటకం కాదు ఓ విధ్వంస జాడ
ప్రతిస్పందించని మృగ్యమైన అరాచక నీడ
ఈ చీకటి కోణాల్ని చీల్చేదెన్నడు!?
ప్రశ్నలన్నీ అస్పృశ్యవౌతున్నాయి
ప్రశ్నలన్నీ అస్పష్టవౌతున్నాయి
బానిసత్వం ఏడు తరాలై ఏడుస్తోంది
కొన్ని సంక్షోభాలు కొన్ని సంక్లిష్టాలు
కొన్ని వ్యధలు కొన్ని వెతలు
అన్నీ సామూహిక దుఃఖ రుతువులు
కలైనా నిజమైనా వసంతం కోసమే ఆరాటం
మనిషిని మనిషిగా పూర్ణించటానికే పోరాటం
అవును, ఇప్పుడు ప్రతిఘటన అనివార్యం!
- కటుకోఝ్వల రమేష్,
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా.
చరవాణి : 9949083327

విష సంస్కృతి
చదువులతో.. అత్యున్నత ఆశయాలతో
నిరంతరం హుషారుగా తుళ్లిపడే
నగరంలోని యువత జీవితాల్లోకి
కొండచిలువలా ఒక విష సంస్కృతి
ప్రవేశించింది అతి నెమ్మదిగా..!

సంపన్న వర్గాలపై గురిపెట్టిన
మాదకద్రవ్యాల వ్యాపారం
పసిడి పసిజీవితాలను
అతి కర్కశంగా కాటేస్తోంది
మత్తు పదార్థాల దమ్ము పీల్చటమో
ఒక మత్తుబిళ్లను చప్పరించటమో
అదీ ఆలస్యమవుతుందని అనిపిస్తే
సిరంజితో నేరుగా నరాల్లోకి
కిక్కు ఎక్కించటం!

ఇక అంతే సంగతులు
కొన్ని గంటల పాటు
బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి
కృత్రిమ స్వర్గసుఖాల్లో తేలియాడటం
ఆ మత్తులోనే చిత్తయిపోయి
జీవితాన్ని బానిసగా మార్చేసి
ఇంట్లోవాళ్లకి మాయమాటలు చెప్పో
బెదిరించో.. చివరికి దొంగిలించో
మళ్లీ మళ్లీ అదే మత్తులో మునిగిపోవటం

టీనేజర్లు సైతం
మత్తుకు బానిసలుగా మారటం
చేజారిపోయేవరకూ
కన్నవారికి తెలియకపోవటం
నిజంగా ఎంత దౌర్భాగ్యమిది!
మానం, మర్యాద అన్నీ కోల్పోయి
తూలుతూ పడివున్న తమ సంతానాన్ని
చూడాల్సిరావటం ఆ తల్లిదండ్రులకు
ఎంత దురదృష్టం!

ఇకనైనా ప్రతిఒక్కరూ
అప్రమత్తం కావాల్సిన
సమయం వచ్చేసింది
పక్కింటికే కదా నిప్పంటుకుందని
తీరుబడిగా కూర్చుంటే
ఆ ఉపద్రవం ఏదో
మీ ఇంటినీ క్షణాల్లో
మట్టుపెడుతుంది!

అందుకే కదలండి
కలాలను కదిలించండి
చేరుూచేరుూ కలుపుదాం
విష సంస్కృతిని తరిమికొడదాం
బిడ్డల భవిష్యత్తు
బుగ్గిపాలు కాకముందే
మాదకద్రవ్యాల అంటువ్యాధి
యువతకంతా సోకకముందే
ఆ మహమ్మారిని తరిమేద్దాం
భవితను కాపాడుకుందాం
మన యువతను
మనమే తీర్చిదిద్దుకుందాం!
- గంజాం భ్రమరాంబ,
చరవాణి : 9949932918

పునర్జన్మ
బంధాలన్నీ చితికిపోయాక
ఆత్మలేని దేహం ఒంటరిదయిపోతుంది
అవయవ పుష్పాలు వాడిపోకుండా
అవయవదానం చేస్తున్న మనుషులు
నిజంగా కాలానికి కట్టిన జీవజండాలు
అమ్మలు చెక్కిన ఈ దేహాలు
ఒక్కసారిగా మట్టిలోకి జారిపోకుండా
మరలా మరలా చిగురించాలని
సంకల్పం చేయడం గొప్ప విషయం
కొన్ని కలలెప్పటికీ నిజాలు కావు
మానవత్వపు చిహ్నాలే ఎప్పుడూ
నిజ జీవితంలో పుష్పించి పరిమళిస్తాయి
కాలం మారిపోతూ ఉంది
దానితో పాటుగా మనుషులు కూడా

మారిపోతున్నారు
మరణించాక పనికిరాని అవయవాల్ని
మరొక దేహంలోకి ప్రవేశపెట్టి
మనిషై వెళ్లిపోవడమే నిజమైన బ్రతుకు
ఇప్పుడు మరలా బతికిపోయాక మమతలు

జీవిస్తాయి
అనురాగాలు జీవస్వప్నాల పుటల్లో చేరి
పుట్టడంలోని నిజ అర్థాన్ని చెప్తాయి
మరణించిన వ్యక్తి మరలా ఎన్నో

జీవదర్పణాల్లో కన్పిస్తాడు
ఈ చెట్లు చేమల మధ్య ఒక జీవిలా

ఎందుకు
మానవత్వం నిండుగా నింపుకుని
కాలం మీద సంతకం చేసిన

మనుషులవ్వాలి
ఆత్మీయతల్ని సాటి మనుషులకి పంచి
నిజమయిన మానవత్వాన్ని

ఆవిష్కరించాలి
మనమిప్పుడు మనుషులమవ్వాలి
మానవత్వపు పుష్పాలై పరిమళించాలి
- షారోన్ బేగం, సోమశిల, చరవాణి :

8985963150

నీకెలా
కృతజ్ఞతలు చెప్పనూ..?
తొలిసారి నిన్ను ముట్టుకున్నప్పుడూ
సున్నితంగా.. సుతారంగా..
సుప్రభాతంగా తాకినప్పుడూ
ఎంత థ్రిల్లైపోయానో తెలుసా..!
నాకునేనే యోగినిలా మారిపోయాను
లేలేత చేతులతో.. బుల్లిబుల్లి పాదాలతో
పాలుగారే నీ పసిమోము చూసినప్పుడు
ఆల్చిప్పల్లాంటి ఆ కళ్లలో
నా ఆశల కాంతిపుంజాలు
తళుక్కుమన్నప్పుడు
నాలో భావాల సంలీనాన్ని
ఏ భావుకుడు వర్ణించగలడు?
మనసు కాన్వాసు మీద ముద్రించుకున్న
నీ బోసినవ్వుని
ఏ చిత్రకారుడు చిత్రించగలడు?
చిటికెన వేలు పట్టుకొని
బుడిబుడి అడుగులేస్తూ
నువ్వు కేరింతలు కొట్టినప్పుడు
గమనించలేదుగానీ
నీతోపాటు నా హృదయమూ
తుళ్లితుళ్లి పడిందిరా నాన్నా..
రెండు చేతులూ మెడచుట్టూ మెలితిప్పి
అమ్మా.. అమ్మా.. అంటూ
ఆలింగనం చేసుకున్నప్పుడు
జగతి పసితనానికి
వెలుగు చుక్కనయ్యాను!
వెలితిగా వున్న మనసు కలశాన్ని
నింపుకుంటాను
మరొక్కసారి నోరారా నవ్వరా
బంగారుతండ్రీ..!
నా వరాలమూటా.. వజ్రాల గనీ..
నువ్వు పుట్టాకే కదరా
ఆడతనం అమ్మగా రూపాంతరం చెంది
పరిపూర్ణ వనితనన్న నిండైన భావం
మనసు నిండా నిండిపోయింది
నీకెలా కృతజ్ఞతలు చెప్పనురా కన్నా..!
- బంగార్రాజు కంఠ,
విజయవాడ.
చరవాణి : 8500350464