విశాఖపట్నం

తీరని రుణం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగాపురంలో రాములమ్మ అనే

వృద్ధురాలు ఉండేది. ఆమెకు రంగడు అనే

కొడుకు తప్ప మరెవరూ లేరు. భర్త

చనిపోయిన రాములమ్మ కొడుకుని అల్లారు

ముద్దుగా పెంచింది. కూలినాలీ చేసిన

కష్టంతో విద్యాబుద్ధులు నేర్పించింది.

ప్రయోజకుడైన రంగడు తల్లి రుణం

ఎలాగైనా తీర్చుకోవాలని భావించి వేకువ

జాము నుండి రాత్రి పడుకునేంత వరకు

తల్లికి సేవలు చేస్తూ గడపసాగాడు. తల్లికి

పనుల్లో సాయం చేయడం, అన్నం

తినిపించడం, నిద్దుర పోయేటప్పుడు కాళ్లు

ఒత్తడం వంటి పనులు చేసేవాడు.

రాములమ్మకి ఇవేం అర్థం కాలేదు. తాను

అన్ని పనులు చేసుకోగలిగినా కొడుకు

ఎందుకు ఇలా తనకు సేవ చేస్తున్నాడు

అనుకునేది. అప్పులు చేసి తల్లికి బజారు

నుండి పండ్లు, మిఠాయిలు తెచ్చేవాడు. దీని

వల్ల లేనిపోని అనారోగ్యం సంక్రమించింది.

వద్దన్నా వినకుండా వేల రూపాయలు

ఖర్చు చేసి తీర్థయాత్రలు తల్లిని తీసుకెళ్లాడు

రంగడు. అయినా తల్లి ముఖంలో సంతృప్తి

కనబడలేదు. పని మానుకుని తన కోసం

రాత్రీ పగలు కష్టపడడం ఆ తల్లికి ఏ మాత్రం

రుచించలేదు. ఇంకా ఏదో చేయాలి. తల్లి

రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. దీనికి సరైన

మార్గం కనుక్కునేందుకు రామానందుడనే

పండితుని ఆశ్రయించాడు రంగడు. తల్లి

రుణం తీర్చాలనే ఎన్ని చేసినా తన తల్లి

సంతృప్తి చెందడంలేదని, తల్లి రుణం

తీర్చుకునే మార్గం చెప్పమని పండితుని

కోరాడు రంగడు.
దానికి రామానందుడు నవ్వి ‘‘నాయనా

సముద్రం నుండి నీటిని తోడవచ్చు. ఎడారి

నుండి ఇసుకను తొలగించవచ్చు. సూర్యుని

నుండి కాంతిని వేరు చేయవచ్చు. కాని తల్ల

రుణం తీర్చడమనేది అసాధ్యం. అవసాన

కాలంలో కంటికి రెప్పలా చూసుకోవడమే

రుణం తీర్చుకునేందుకు చక్కని అవకాశం

సుమా’’ అని పండితుడు తెలిపాడు. కాని

రంగడికి ఆ మాటలు రుచించలేదు. ఇదే

విషయం తల్లికి చెప్పాడు రంగడు.

‘‘నాయనా అది నిజమే. నాకు ఒంట్లో శక్తి

ఉంది. నాలుగు రూకలు సంపాదించే యుక్తి

ఉంది. తల్లికి సేవ పేరుతో నీవు సోమరిగా

మారడం నాకు ఇష్టం లేదు’’ అని

రాములమ్మ కుండబద్ధలు కొట్టినట్లు

చెప్పడంతో రంగడికి జ్ఞానోదయం అయింది.

నాటి నుండి ఉపాధి బాట పట్టిన రంగడు

తల్లి అవసాన కాలంలో సేవ చేసి రుణం

తీర్చుకున్నాడు.

- టంకాల సత్యంనాయుడు, సెల్ : 9395355952.