విశాఖపట్నం

తప్పదు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదీ మన చేతుల్లో లేదని
కాలం చేతుల్లో కీలుబొమ్మలమని
దిగులు చెందకు
భవిష్యత్ కాలాన్ని
నీవు కోరుకునే విధంగా
నీవే మలచుకోగలవ్
ఎందుకంటే
ఇప్పుడు నీవనుభవిస్తున్న
కాలం వేరెక్కడి నుండో రాలేదు
నిన్నటి నీ నిర్మాణమే
నేటి నీ అనుభవం
నేడు నువ్వు
నిర్మించుకునే దానిలోనే
రేపు నీవుండేది గుర్తుంచుకో
పల్లేరు మొక్కలను నాటి
మామిడి పళ్లను రమ్మంటే ఎలా?
నాటేటప్పుడే యోచించాలి
చేసే ముందే ఆలోచించాలి
ఇప్పుడు ఎవరికో ఏవో
చేసేస్తున్నాం అనుకునే

భ్రమలో
కూడని వేవో చేసేస్తున్నాము
రేపవి మనం భరించక తప్పని
అనుభవాలని గుర్తించలేకపోతున్నాం
మనం చేస్తున్న పని శక్తి
మనకు తెలియడంలేదు
రాముడు విడిచిన బాణానికైనా
తిరుగుంటుందేమో కాని
ఒక మారు నువ్వు చేసిన పని
అది మంచయినా చెడైనా
దానికిక తిరుగుండదు
నువ్వెన్ని పూజలు చేసినా
ఎనె్నన్ని ప్రయత్నాలు

చేసినా
మంచికి సుఖము
చెడుకు దు:ఖము
అనుభవించక తప్పదు
కాలం చేతిలో కీలుబొమ్మలం కాము
మన తలరాతలు
మనమే రాసుకునే
అపర బ్రహ్మలం
- అనే్వషి (కోరాడ నరసింహారావు),
చినముషిడివాడ, శ్రమశక్తినగర్,
పెందుర్తి మండలం, విశాఖపట్నం. సెల్ :

7981327110.

తెలుగు వెలుగు
తీపి తేనియ కొమ్మ తెలుగమ్మా నువ్వు
రవి శశిలతో ఇలను వెలుగమ్మా
పుడమిపై ప్రభవించిన భాషలకు ధీటైన
జగతిలో వెలసిన జనులకు మేటివై
రాజాధిరాజులు మెండు మేధావులు

ఇచ్చంగ
మెచ్చుకుని పలుకు మాటల మూట

తెలుగు పదముల కోట
ఆది కవి కావ్యమున జాలువారిన తెనుగు
బమ్మెరతో కమ్మగ ఒదిగిపోయిన తెలుగు
గురజాడ గళములో గేయమయితివి నీవు
కరుణశ్రీ కరుణతో ఖ్యాతి పొందితివి నీవు
గలగలా పారేటి సెలయేరు జూచినా
కిలకిలా పలికేటి పక్షులను గాంచినా
పైరు పచ్చని ఇంట పరువాల పంట
వర్ణనకు వెలిసావు తెలుగు పొదరింట
శ్రీనాథ సీసములో అలరారినావులే
అల్లసాని జిగిబిగిలో పేరొందినావులే
దేశ భాష లందు లెస్స తెలుగంటూ
రంజింప బడినావు
రాయలాస్థానమున
- డబ్బీరు గోవిందరావు,
రెడ్డిక వీధి, ఫాజుల్‌బేగ్‌పేట,
శ్రీకాకుళం-532005. సెల్ : 9440642182.